జగన్ ప్రభుత్వాన్ని వణికిస్తున్న ఆ మూడు అవే?
కరోనా వైరస్ టెస్ట్ లలో ఎపి దూసుకుపోతూ ఉంది. దానికి తగిన విధంగానే కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూ అందరిలోనూ ఆందోళన పెంచుతుంది. అయినా భయం వలదు [more]
కరోనా వైరస్ టెస్ట్ లలో ఎపి దూసుకుపోతూ ఉంది. దానికి తగిన విధంగానే కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూ అందరిలోనూ ఆందోళన పెంచుతుంది. అయినా భయం వలదు [more]
కరోనా వైరస్ టెస్ట్ లలో ఎపి దూసుకుపోతూ ఉంది. దానికి తగిన విధంగానే కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూ అందరిలోనూ ఆందోళన పెంచుతుంది. అయినా భయం వలదు అంటూ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. వైరస్ కట్టడి పోరాటం లో ఉన్నవారిని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ తలక్రిందుల తపస్సే చేస్తుంది. ఇంత చేస్తున్నా ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుంది ఆ మూడు వర్గాలే.
వాటిమీదే దృష్టి …
లాక్ డౌన్ రెండో దశలో తీవ్ర వత్తిడి తెచ్చి కాశి నుంచి కొన్ని వందలమంది ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించారు. ఇలా వచ్చిన బృందాల్లో పశ్చిమ గోదావరి జిల్లా లో 8 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో సర్కార్ ఉలిక్కి పడి అప్రమత్తం అయ్యింది. కాశి నుంచి వచ్చినవారి వివారాలు సేకరించి వారిని హోం క్వారంటైన్ చేసి పరీక్షలు మొదలు పెట్టింది.
కోయంబేడు బ్యాచ్ మరి డేంజర్ …
తమిళనాడు కి ఆంధ్రప్రదేశ్ లోని సరిహద్దు ప్రాంతాలకు ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల వారు ఏ చిన్న పని కావలిసిన కోయంబేడు మార్కెట్ కె వెళతారు. ఇలా వెళ్ళివచ్చినవారిలో ఇటీవల వైరస్ లక్షణాలు బయటపడటంతో ఆ జిల్లా యంత్రాంగం హై అలెర్ట్ అయ్యింది. కర్నూల్, గుంటూరు , కృష్ణా జిల్లాల ల స్థాయికి చిత్తూరు జిల్లా చేరుకుంది. ఈ నేపథ్యంలో చిత్తూరులో కోయంబేడు మార్కెట్ తో లింక్ లు ఉన్నవారు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను వేటాడుతున్నారు. దొరికిన వారిని క్వారంటైన్ చేస్తున్నారు.
వలస కూలీలు మరో సమస్య …
ఆంధ్రప్రదేశ్ నుంచి పనులకోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఇప్పుడు వస్తున్న వారితో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. వలస వచ్చినవారి కి టెస్ట్ లు చేసే ప్రక్రియ వేగవంతం చేసింది సర్కార్. వీరిని సైతం క్వారంటైన్ చేసే పనిలో పడింది. ఇప్పటివరకు విదేశాలనుంచి వచ్చినవారు, ఢిల్లీ జమాతే ఇప్పుడు ఈ మూడు వర్గాలతో కేసులు పెరుగుదలకు రీజన్ అనేది తేలుతూ ఉండటంతో ప్రత్యేక నజర్ పెట్టింది జగన్ ప్రభుత్వం. ఎన్ని చర్యలు చేపడుతున్నా కరోనా కట్టడి ఇప్పుడు మరింత కష్టమని ప్రజలు జాగ్రత్తలు తీసుకుని స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని యంత్రాంగం పిలుపునిస్తుంది.