అదోరకం ఆనందమే కాని పార్టీని దూరం చేయగలరా ?
రాజకీయం అంటే పచ్చిగానే ఉంటుంది. ఎంత లోతుకైనా వెళ్ళగలుతుంది. చాలా చిన్న విషయం అనిపించినా దాన్ని కూడా పెంచి పెద్ద చేయగలిగే నేర్పు రాజకీయ జీవులకే ఉంటుంది. [more]
రాజకీయం అంటే పచ్చిగానే ఉంటుంది. ఎంత లోతుకైనా వెళ్ళగలుతుంది. చాలా చిన్న విషయం అనిపించినా దాన్ని కూడా పెంచి పెద్ద చేయగలిగే నేర్పు రాజకీయ జీవులకే ఉంటుంది. [more]
రాజకీయం అంటే పచ్చిగానే ఉంటుంది. ఎంత లోతుకైనా వెళ్ళగలుతుంది. చాలా చిన్న విషయం అనిపించినా దాన్ని కూడా పెంచి పెద్ద చేయగలిగే నేర్పు రాజకీయ జీవులకే ఉంటుంది. లేకపోతే ఎక్కడ వైసీపీ, మరెక్కడ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అసలు ఆ పార్టీ ఉందన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. కానీ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు పుణ్యామని కలుగులో ఉన్న అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుని బయటకు తెచ్చారు. మా పార్టీ పేరుని వైసీపీ వాడుకుంటోందని అంటూ హై కోర్టులొ మహమ్మద్ భాషా అన్న వ్యక్తి కేసు వేశారు. దాని నోటీసులు వైసీపీకి అందాయి. దీని వల్ల జరిగేదేంటి అంటే అదోరకం ఆనందం తప్ప మరేమీ కాదని న్యాయ, రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
ఎందుకలా …?
నిజానికి జగన్ పార్టీ పేరు ఫుల్ ఫార్మ్ లో చూస్తే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. అయితే ఆ పార్టీ కూడా రిజిష్టర్ చేసింది తెలంగాణాకు చెందిన శివకుమార్ అని ఒక వ్యక్తి. అతని నుంచి జగన్ తీసుకుని తాను ప్రెసిడెంట్ అయ్యారు. అందులో అతనికి వేరే పదవి ఇచ్చారు. ఇక కడపకు చెందిన మహమ్మద్ భాషా అన్న వ్యక్త్రి అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పేరిట ఒక పార్టీని 2011లో ఏర్పాటు చేశారుట. దాని కార్యవర్గం ఏంటో, ఆ కధ ఏంటో ఎవరికీ ఇప్పటి దాకా ఎవరికీ తెలియదు కానీ తనదే అసలైన వైసీపీ అని భాషా అంటున్నారు. దీని మీద ఆయన ఢిల్లీ హై కోర్టులో కేసు వేశారు.
ఏం జరుగుతుందో..?
ఇక దీని మీద వైసీపీ కి హై కోర్టు నోటీసులు జారీ చేసింది. సరే కోర్టులో కేసు ఇపుడు విచారణకు వచ్చింది. కానీ నిజానికి వైఎస్సార్ అంటే ఎవరు, ఆయన మీద ఎవరికి ఎంతెంత హక్కులు ఉన్నాయన్నది లెక్క ఎపుడో ఉమ్మడి ఏపీ ప్రజలు తేల్చేసి తీర్పు ఇచ్చేశారు. ఆయన రక్తం పంచుకుని పుట్టిన కుమారుడు జగన్, అంతే కాదు ఆయన ఆశయాలను పంచుకుని ముందుకు తీసుకుపోతున్నాడు. జగనే అసలైన వారసుడు అని శతాధిక వ్రుధ్ధురాలు అయిన కాంగ్రెస్ పార్టీనే తోసిపుచ్చారు వివేచన కల్గిన ప్రజలు. ఇక వైఎస్సార్ పేరు మీద రాధ్ధాంత చేసే వారికి ఇంతకంటే పెద్దగా చెప్పాల్సినది లేదు. అసలు ఎన్నికల్లో జనం ఓట్లు వేయడానికి చూసేది నాయకుడి ముఖమే. జగన్ ని తమ నాయకుడు అని మెచ్చి ఇంత భారీ మెజారిటీని ప్రజలు కట్టబెట్టారు తప్ప ఆయన పార్టీ పేరుని చూసో మరోటి చూసో కాదు. అందువల్ల నిజంగా వైఎస్సార్ మీద సర్వహక్కులు జగన్ కి తప్ప మరెవరికీ కాదని భారీ ఎత్తున విజయం అందించి జనం తీర్పు చెప్పాక ఇవన్నీ చిల్లర రాజకీయాలే మరి.
అలా చేయాల్సిందే…?
ఈ దేశంలో ప్రతీ వారూ ఒక పార్టీ పెడుతున్నారు. మరి వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా. పార్టీకి కార్యవర్గాలు క్రమం తప్పకుండా పార్టీ లోపల ఎన్నికలు జరుగుతున్నాయా ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. అలాగే జనం మెచ్చి ఎన్నుకున్న పార్టీని పోలిన పేర్లతో వేరే పార్టీలు ఉంటే అవి క్రియాశీలంగా లేకపోతే ఆ పార్టీలనే రద్దు చేయడం ఉత్తమం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజా తీర్పు కంటే ఎవరూ కూడా గొప్ప కాదు, ఏ వ్యవస్థ కూడా ఎక్కువ కాదు. కచ్చితంగా సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి కనీస మాత్రంగా ఓట్లు సాధించని పార్టీలను రద్దు చేసేస్తె ఇంత గొడవ కూడా ఉండదు. మరి ఎపుడో 2011లో పార్టీ పెట్టి ఇప్పటిదాకా ఎక్కడా పోటీ చేయకుండా కార్యవర్గం లేకుండా ఉన్న అన్న వైసీపీని ఇంకా పార్టీగా గుర్తిస్తే మాత్రం ప్రజల తీర్పుకే అర్ధం ఉండదు కూడా.