జగన్ ఒక అడుగు వెనక్కు వేసినట్లే?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ లో మార్పు వచ్చింది. తొందరపడి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నారు. శాసనమండలి నిర్ణయంపై జగన్ పునరాలోచనలో పడ్డారు. కేంద్ర [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ లో మార్పు వచ్చింది. తొందరపడి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నారు. శాసనమండలి నిర్ణయంపై జగన్ పునరాలోచనలో పడ్డారు. కేంద్ర [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ లో మార్పు వచ్చింది. తొందరపడి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నారు. శాసనమండలి నిర్ణయంపై జగన్ పునరాలోచనలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం, పార్టీ నేతలకు పదవులను కట్టబెట్టాల్సి రావడంతో జగన్ శాసనమండలి రద్దు పై వెనక్కు తగ్గారని చెబుతున్నారు. తాజాగా జరిగిన మంత్రి మండలి సమావేశంలోనూ దీనిపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
రద్దు చేసిన తర్వాత…..
శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కూడా శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయితే తీర్మానం పంపి నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రానున్న వర్షాకాల సమావేశంలోనూ శాసనమండలి రద్దు పై నిర్ణయం తీసుకునే అవకాశం కన్పించడం లేదు. అనేక రాష్ట్రాల నుంచి రద్దు, పునరుద్దరణ అంశాలు పెండింగ్ లో ఉండటంతో ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆలోచన చేయదన్నది వాస్తవం.
అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో…
పార్టీ సీనియర్ నేతలు సయితం శాసనమండలి రద్దు పై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి చోటు కల్పిస్తే రానున్న ఎన్నికల్లో టిక్కెట్ల వత్తిడి తగ్గుతుందని సూచిస్తున్నారు. లేకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం కొట్లాట తప్పదన్న హెచ్చరికలు కూడా సీనియర్ నేతలు చేస్తున్నారు. దీంతో పాటు అనేక మంది ఆశావహులు ఎమ్మెల్సీ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. మండలి రద్దు కావడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి.
పునరాలోచనలో…..
ఎటూ కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుండటంతో మండలి రద్దు పై పునరాలోచించాచలని కొందరు సూచించినట్లు తెలిసింది. దీంతో జగన్ కూడా కొంత ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు. రానున్న కాలంలో శాసనమండలిలో వైసీపీ బలపడే అవకాశముండటంతో జగన్ కూడా ఖాళీ అయిన ఎమ్మెల్సీ పోస్టులను భర్తీకే మొగ్గు చూపుతున్నారు. నేతలకు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుపర్చాలంటే మండలి కొనసాగడమే బెటరన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద శాసనమండలి రద్దు అంశాన్ని వైసీపీ అధిష్టానం పక్కన పెట్టినట్లే కనపడుతుంది.