జగన్ ఆయువు పట్టు మీదే దాడి ?
జగన్ రాజకీయం అంతా ఇపుడు ఒకే చోట ఉంది. అదే సంక్షేమం. చేతికి ఎంత వస్తే అంత అన్న తీరున ఆయన వితరణ చేసి పారేస్తున్నారు. అడిగిన [more]
జగన్ రాజకీయం అంతా ఇపుడు ఒకే చోట ఉంది. అదే సంక్షేమం. చేతికి ఎంత వస్తే అంత అన్న తీరున ఆయన వితరణ చేసి పారేస్తున్నారు. అడిగిన [more]
జగన్ రాజకీయం అంతా ఇపుడు ఒకే చోట ఉంది. అదే సంక్షేమం. చేతికి ఎంత వస్తే అంత అన్న తీరున ఆయన వితరణ చేసి పారేస్తున్నారు. అడిగిన వారికీ, అడగని వారికీ దండీగా అన్నీ సమకూర్చుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలో అక్షరాలా 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. దీన్ని పదే పదే వైసీపీ మంత్రులు, పెద్దలు ప్రకటించుకున్నారు. ఇపుడదే వారికి బూమరాంగ్ అయ్యేలా విపక్షం కీలక మలుపునకు కధ తిప్పుతోంది. ముఖ్యంగా టీడీపీకి వైసీపీ రాజకీయం అంతా తెలుసు. జగన్ ఇలా ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ 2024 ఎన్నికల్లో ఆయనే వస్తారు. దాంతో తమ రాజకీయం ఏం కానూ ఇదే కదా అసలు బాధ.
మరో వెనిజులా…
ఇపుడు టీడీపీ సోషల్ మీడియా వీరులు తమ కలాలకు పదును పెడుతున్నారు. జగన్ సర్కార్‌ని విమర్శిస్తూ ఏపీ ఏమైపోతుంది అంటూ తెగ పరేషన్ అవుతున్నారు. ఏపీలో అభివ్రుధ్ధి లేదు, అంతా సంక్షేమం పేరిట విదిల్చేస్తున్నారు. ఇలా అయితే ఏపీ మరో వెనిజులా దేశమే అవుతుందని ఆవేదనాభరితమైన కధలను వినిపిస్తున్నారు. ఆ భయంకర వెనిజులా గాధను సోషల్ మీడియా ద్వారా ప్రతీ ఒక్కరికీ పంపిస్తున్నారు. వెనిజులా ఒకప్పుడు ప్రపంచంలో ధనవంతమైన దేశం, ఇపుడు అక్కడ ఆర్ధిక సంక్షోభం ఏర్పడింది. తినడానికి తిండి లేదు, దానికి కారణం సంక్షేమ పధకాలను విరివిగా ఇస్తూ ఖజానా ఖాళీ చేసిన రాజకీయ నేతల విపరీత చేష్టలేనని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఉచితం వద్దు ….
ఉచితం అంటే ఏపీ చిల్లే. అందువల్ల అందరూ బాగుండాలంటే ఉచితం వద్దు అని అంతా అనాలట. విచ్చలవిడిగా జగన్ చేస్తున్న సంక్షేమం ఖర్చుతో ఏపీ దారుణంగా నష్టపోతుందని అంటున్నారు. మేధావుల పేరిట వరసగా వస్తున్న కధనాలను సోషల్ మీడియా వీరులు, టీడీపీ సానుభూతిపరులు బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. దీని వల్ల వైసీపీని టీడీపీని వ్యతిరేకించే వారి సంగతి ఎలా ఉన్నా తటస్థుల్లో కీలకమైన మార్పు వస్తుందని వూహిస్తున్నారు. ముందుగా వారిలో వస్తే అది నెమ్మదిగా అసంత్రుప్తిగా మారి జగన్ సర్కార్ మీద పెను తుఫాను గా మారుతుందని ఊహిస్తున్నారు.
దానికి ఆది ఎవరో …?
సరే ఉచితాలు వద్దు అని అంతా ఏకీభవిస్తున్నా ఒక కుటుంబం పేదరికంలో అలమటిస్తూంటే ఆదుకోవడం పాలకుల ధర్మం. మనది సంక్షేమ రాజ్యం అని రాజ్యాంగంలోనే రాసుకున్నాం. ఇక అది శ్రుతి మించిన సంగతి అందరికీ అర్ధమవుతోంది. కానీ దీనికి ఆది ఎవరు అన్న ప్రశ్న వస్తే కచ్చితంగా అన్ని వేళ్ళూ టీడీపీ వైపే చూపిస్తాయి. నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీయార్ కిలో రెండు రూపాయలు అంటూ మొదలుపెట్టారు. చంద్రబాబు సీఎం అయిన కొత్తల్లో ఆర్థిక సంస్కరణలు అని జపించినా తరువాత ఆయన కూడా ఇదే బాటలో నడిచారు. అంతేందుకూ బాబు గత అయిదేళ్ల పాలన్లో అన్న క్యాంటీన్ అంటూ బయట హోటల్లో 80 రూపాయలు ఉండే భోజనాన్ని అయిదు రూపాయలకే ఇచ్చి సోమరిపోతుల సత్రాలని వీధికొకటి తెరచిన సంగతి విదితమే.
పేదల పేరిట వితరణ …..
అలాగే ఎన్నికల వేళ పసుపు కుంకుమ స్కీములు తీసుకున్నా బాబు నిరుద్యోగ భృతి పేరిట చేసిన హంగామా చూసినా ఆయన కూడా ఆ తానులో ముక్కేనని చెప్పాలి. అయితే జగన్ మాత్రం అందరికీ మించి పోయారు. ఒక కుటుంబంలో ఒక ఏడాదికి అన్ని స్కీములూ కలుపుకుని కనీసంగా అరవై వేలకు పైగా వస్తోంది. అంటే నెలకు అయిదు వేలు అన్న మాట. జగన్ ఇచ్చిన హామీలు ఎలా ఉన్నా ఇకపైన కొత్తవి ఇవ్వకుండా ఇచ్చిన వాటిని కూడా సమీక్ష చేస్తూ పోవాలి. ఏది ఏమైనా జగన్ కి అక్కర వస్తాయనుకున్న సంక్షేమమే బూమరాంగ్ అయిన అసలుకే ఎసరు వస్తుంది. తీపి ఎక్కువైతే చేదేగా మరి.