మాట ఇస్తే అంతే.. మర్చిపోరట
జగన్ మాట ఇచ్చారంటే మర్చిపోరు. ఎప్పుడో ఒకసారి వారిని గుర్తించి మరీ పదవులు ఇస్తారు. ఎన్నికలు అయిపోయాయి కదా? అని ఇచ్చిన మాటను విస్మరించరు. ఇప్పుడు తాజాగా [more]
జగన్ మాట ఇచ్చారంటే మర్చిపోరు. ఎప్పుడో ఒకసారి వారిని గుర్తించి మరీ పదవులు ఇస్తారు. ఎన్నికలు అయిపోయాయి కదా? అని ఇచ్చిన మాటను విస్మరించరు. ఇప్పుడు తాజాగా [more]
జగన్ మాట ఇచ్చారంటే మర్చిపోరు. ఎప్పుడో ఒకసారి వారిని గుర్తించి మరీ పదవులు ఇస్తారు. ఎన్నికలు అయిపోయాయి కదా? అని ఇచ్చిన మాటను విస్మరించరు. ఇప్పుడు తాజాగా వెంకటగిరి రాజాను ఎస్వీబీసీ ఛైర్మన్ గా జగన్ నియమించారు. దీంతో జగన్ ఇచ్చిన మాట తప్పరన్న కామెంట్స్ పార్టీలో వినపడుతున్నాయి. సమయం వచ్చినప్పుడు పదవులను జగన్ సర్దుబాటు చేస్తారని సాయికృష్ణ యాచేంద్ర విషయంలో స్పష్టమయిందంటున్నారు.
టీడీపీకి అండగా….
వెంకటగిరి రాజులు తెలుగుదేశం పార్టీకి మొన్నటి వరకూ అండగా ఉండేవారు. వెంకటగిరి నియోజకవర్గంలో వారు ఎంత చెబితే అంత. అందుకే అక్కడ టీడీపీ జెండా ఎగురవేయగలిగింది. 1985లోనే వెంకటగిరి రాజు సాయికృష్ణ యాచేంద్ర టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో వీవీఆర్కే యాచేంద్ర ఎమ్మెల్యే అయ్యారు. మూడు దశాబ్దాల నుంచి వారు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. కానీ 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వారి వైఖరి మారింది.
అప్పటి ఎమ్మెల్యేతో విభేదాలు…..
వెంకటగిరి రాజుల మద్దతు లేకుంటే ఇక్కడ గెలవడం కష్టమే. 2014లో వెంకటగిరి నుంచి టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచిన కురుగొండ్ల రామకృష్ణ రాజుల ఆగ్రహానికి గురయ్యారు. సైదాపురం మండలం కలిచేడు ప్రాంతాల్లోని మైకా గనుల్లో మట్టితరలించి రాజులను కురుగొండ్ల ఇబ్బందులకు గురి చేశారు. వెంకటగిరి రాజులు దానంగా ఇచ్చిన స్థలాలను కూడా అప్పటి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తనవర్గానికి లీజుకివ్వడం వారికి కోపం తెప్పించింది.
వైసీపీలో చేరడంతో….
దీంతో వెంకటగిరి రాజులు పార్టీ నుంచితప్పుకోవాలని నిర్ణయించారు. చంద్రబాబు ఫోన్ లో మాట్లాడినా ప్రయోజనం లేదు. అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయంగా వెళ్లి రాజులను బుజ్జగించినా ఫలితం లేదు. వెంకటగిరి రాజులు వైసీపీలో చేరిపోయారు. అక్కడ మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అప్పుడు మాట ఇచ్చినట్లుగానే సాయికృష్ణ యాచేంద్రకు జగన్ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారని చెబుతున్నారు. మొత్తం మీద రెండు దశాబ్దాల తర్వాత వెంకటగిరి రాజులకు అధికారిక పదవి దక్కింది.