జగన్ మీద మోజు పోయినట్లేనా…?
వైసీపీలో జోష్ అసలు కనిపించడంలేదు. మునుపటి ఉత్సాహం కూడా పార్టీ శ్రేణుల్లో లేదనే అంటున్నారు. లేకపోతే జగన్ రికార్డు సృష్టించిన పాదయాత్ర పూర్తి అయి మూడేళ్ళు అయిన [more]
వైసీపీలో జోష్ అసలు కనిపించడంలేదు. మునుపటి ఉత్సాహం కూడా పార్టీ శ్రేణుల్లో లేదనే అంటున్నారు. లేకపోతే జగన్ రికార్డు సృష్టించిన పాదయాత్ర పూర్తి అయి మూడేళ్ళు అయిన [more]
వైసీపీలో జోష్ అసలు కనిపించడంలేదు. మునుపటి ఉత్సాహం కూడా పార్టీ శ్రేణుల్లో లేదనే అంటున్నారు. లేకపోతే జగన్ రికార్డు సృష్టించిన పాదయాత్ర పూర్తి అయి మూడేళ్ళు అయిన సందర్భంగా ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు పది రోజుల పాటు పాదయాత్రలు చేయాలని పార్టీ పెద్దలు ఆదేశిస్తే క్రేత్ర స్థాయిలో అధికార పార్టీ నేతలు తుస్సుమనిపించారు. ఎక్కడ చూసినా కూడా తూతూమంత్రంగా కార్యక్రమం ముగించేసి మమ అనేశారు. మరి ఇదేనా పార్టీ పట్ల చిత్త శుద్ధి అంటే యధా రాజా తధా ప్రజా అనేస్తున్నారు.
మోజు తీరిందా …?
సరిగ్గా రెండేళ్ళ క్రితం అయితే జగన్ ఒక్క పిలుపు ఇస్తే సొంత డబ్బులు తీసి మరీ కార్యకర్తలు కసిగా రోడ్ల మీదకు వచ్చేవారు. అంతే కాదు టీడీపీ మీద ఒక్క లెక్కన గర్జించేవారు. జనాలకు నాటి ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంలోనూ సక్సెస్ అయ్యేవారు. పోటీలు పడి మరీ సభలూ సమావేశాలు నిర్వహించేవారు. ఇక నాడు పార్టీ ఏ కార్యక్రమం ఇస్తుందా అని ఆతృతగా వెయిట్ చేసేవారు. జగన్ సీఎం కావాలి అన్న ఒకే ఒక అజెండాతో అంతా కట్టుబడి మరీ పనిచేసేవారు. ఇపుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. మాకెందుకు వచ్చిన గోల అనుకుంటున్నారులా ఉంది.
నిరాశనేనా…?
ఓ వైపు కార్యకర్తలకు సరైనా ఆదరణ లేదు. దానితో పాటు ఏడాదిన్నరగా పార్టీని జగన్ సహా అంతా మరచిపోయారు. ఇపుడు స్థానిక ఎన్నికలు ఉన్న్నాయన్న ఉద్దేశ్యంలో ఈ పాదయాత్ర ప్రొగ్రాం ని ఉన్న ఫళంగా డిజైన్ చేశారు. అయితే పద్దెనిమిది నెలలుగా తమను పట్టించుకోని పార్టీ కోసం తామెందుకు పనిచేయాలని క్యాడర్ కస్సుమంటోంది. ఇక నాటి కసి పోయింది. నిరాశ పెరిగింది. దాంతో పాటు ఎమ్మెల్యేలు కనీసం తమ గెలుపు కోసం పనిచేసిన క్యాడర్ ని ఇంతకాలం వదిలేశారు. ఇపుడు వారిని దగ్గరకు తీసుకోవాలంటే నిలదీస్తారన్న భయం ఉంది. అందుకే ఎమ్మెల్యేలు కూడా క్లుప్తంగా పాదయాత్రలు అయిందనిపించేసి ఊరుకున్నారు.
కష్టమే కదా…?
ఇక వైసీపీలో అసలైన నాయకులకు పదవులు అధికారాలు లేవు. ఎమ్మెల్యేలు తమ సొంత వ్యాపారాలు వ్యవహారాలూ చూసుకుంటున్నారు. తమ అనుచరులనే చేరదీస్తున్నారు. దానికి తోడు టీడీపీ నుంచి వచ్చిన నాయకుల హవా కూడా పెరిగింది. వారి పెత్తనం, సొంత పార్టీ నాయకుల ఉదాశీనత ఇవన్నీ కలసి ఒక పార్టీగా వైసీపీని నిస్తేజం చేశాయన్నది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. ముందు క్యాడర్ సంగతి చూడకుండా హఠాత్తుగా పాదయాత్రల పిలుపు ఇచ్చి హై కమాండ్ పార్టీ అసలు స్థితిని బయటేసుకుందని కూడా కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇప్పటికైనా క్యాడర్ ని ఆదరించి పార్టీని పటిష్టం చేయకపోతే రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి శృంగభంగం తప్పదని అంటున్నారు.