దాని వెనక జగన్ మాస్టర్ ప్లాన్…?
జగన్ రాజకీయం రాటుదేలుతోంది. ఆయనకు మొదట్లోనే దెబ్బ మీద దెబ్బలు పడడం వల్లనో ఏమో కానీ దూకుడుగానే మారారు. అలా ఆయన తన మీద పడ్డా ఒక్కో [more]
జగన్ రాజకీయం రాటుదేలుతోంది. ఆయనకు మొదట్లోనే దెబ్బ మీద దెబ్బలు పడడం వల్లనో ఏమో కానీ దూకుడుగానే మారారు. అలా ఆయన తన మీద పడ్డా ఒక్కో [more]
జగన్ రాజకీయం రాటుదేలుతోంది. ఆయనకు మొదట్లోనే దెబ్బ మీద దెబ్బలు పడడం వల్లనో ఏమో కానీ దూకుడుగానే మారారు. అలా ఆయన తన మీద పడ్డా ఒక్కో రాయిని మెట్లుగా మార్చుకుని ముందుకు సాగుతున్నారు. ఇపుడు విభజన ఏపీలో ఆర్ధికంగా అష్టకష్టాలు పడుతున్న జగన్ ఈ బాధల నుంచి కూడా కొత్త ఉపాయాలు కూడా వెతుక్కుంటున్నారు. రూపాయి పుట్టే మార్గాలు కూడా అన్వేషించుకుంటున్నారు. దానికి ఆయన తాజాగా తీసిన సరి కొత్త అస్త్రం కొత్త జిల్లాలు. నిజానికి ఇది జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన పాత హామీ. కానీ ఏడాదిన్నర పాలన తరువాత జగన్ ఆ హమీకి మరిన్ని కొత్త మెరుగులు దిద్ది ప్రస్తుత అవసరాలు తగినట్లుగా మార్చుకుంటున్నారు.
భారం కాదు ….
నిజానికి చంద్రబాబు హయాంలోనే కొత్త జిల్లాల ప్రతిపాదనలు వచ్చాయి. అదే సమయంలో కేసీఆర్ 10 ఉన్న తెలంగాణా జిల్లాలను 33 దాకా పెంచుకున్నారు. ఆయన చాలా చిన్న జిల్లాలను చేసి అన్ని రకాలుగా రాజకీయ లాభం పొందారు. అపుడు బాబును కూడా కొత్త జిల్లాలు చేయమని టీడీపీ తమ్ముళ్లు కోరుతూ వచ్చారు. కానీ బాబు మాత్రం అది పెద్ద భారం అనేశారట. నిజమే ఒక విధంగా ఆలోచిస్తే కొత్త జిల్లాలు, కొత్త కలెక్టర్లు, పలానాపరమైన సదుపాయాలు వీటికి ఖర్చు ఇలా భారమే అవుతుంది. కానీ వాటి విషయంలో బాబు పూర్తి శ్రధ్ధ పెట్టి ఉంటే అవి మరోలా కూడా ఉపయోగపడేవి కూడా.
జగన్ కి వరంగా…
బాబు చేయలేని పనులన్నీ అలా పెండింగులో పడి జగన్ కి వరంగా మారుతున్నాయి. జగన్ కొత్త జిల్లాల నినాదాన్ని ఎత్తుకోవడం వెనక ఎత్తుగడలు అనేకం ఉన్నాయి. కేంద్రం జిల్లాలను యూనిట్ గా తీసుకుని పెద్ద ఎత్తున నిధులను ఇస్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలో జిల్లాలు ఆ విధంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. ఇక కొత్త జిల్లాలకు జిల్లా పరిషత్తులు కూడా వస్తాయి. వాటికి నేరుగా కేంద్రం నిధులు ఇస్తుంది. ఆ విధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంటుంది. పాలన కూడా దగ్గరై ప్రజల సమస్యలు సత్వర పరిష్కారం అవుతాయి.
పెంచేస్తున్నారా…?
జగన్ 25 జిల్లాలు అని మొదట అన్నారు. దాని అరకును రెండు చేస్తూ 26 అని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇపుడు తాజాగా వినిపిస్తున్న మాట అయితే 32 జిల్లాలు చేస్తారని అంటున్నారు. ఆరేసి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లా అన్నది కొత్త ప్రతిపాదనగా ఉందిట. అలా అయితే ఇప్పటికి మూడు రెట్లు కొత్త జిల్లాలు వస్తాయి. అంతే కాదు. పన్నెండు లక్షల మంది జనాభాకు ఒక జిల్లా అవుతుంది. దాంతో ప్రగతికి ఎంతో వీలు అవుతుంది. పార్టీ పరంగా కూడా ఎక్కడికక్కడ తమ వారిని జిల్లా పరిషత్తు చైర్మన్లుగా గెలిపించుకుంటే మొత్తం రాజకీయం కూడా కంట్రోల్ లోకి వస్తుందని జగన్ ఆలోచిస్తున్నారుట. ఇక టీడీపీ కంచుకోటలను అటూ ఇటూ చేయడం ద్వారా రానున్న రోజుల్లో పసుపు పార్టీ రూపురేఖలు చెదిరేలా జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి కొత్త జిల్లాల వెనక చాలా పెద్ద కధ ఉందని అంటున్నారు. అది తెలిసే ఇపుడు తమ్ముళ్ళ ద్వారా చంద్రబాబు గగ్గోలు పెట్టిస్తున్నారు అంటున్నారు. కానీ అక్కడ ఉన్నది జగన్. తాను తలచుకుంటే చేసి పారేస్తారు. సో ఇక అంతే మరి.