ఆయనే జగన్ ఆస్థాన రాజ గురువు..?
రాజ గురువు అన్న మాట చంద్రబాబు జమానా నుంచి వచ్చింది. ఎన్టీఆర్ సీఎం గా ఉన్నపుడు ఎవరి మాట లెక్కచేసేవారు కాదు, ఆయనకు హిందూ సంప్రదాయలు పట్ల [more]
రాజ గురువు అన్న మాట చంద్రబాబు జమానా నుంచి వచ్చింది. ఎన్టీఆర్ సీఎం గా ఉన్నపుడు ఎవరి మాట లెక్కచేసేవారు కాదు, ఆయనకు హిందూ సంప్రదాయలు పట్ల [more]
రాజ గురువు అన్న మాట చంద్రబాబు జమానా నుంచి వచ్చింది. ఎన్టీఆర్ సీఎం గా ఉన్నపుడు ఎవరి మాట లెక్కచేసేవారు కాదు, ఆయనకు హిందూ సంప్రదాయలు పట్ల మంచి నమ్మకం ఉంది. అలాగే యాగాలు పూజలు కూడా ఆయన చేశారని తెలుసు. కానీ అహం బ్రహ్మస్మిఅని ఆయన తానే పెద్దగా భావించుకునేవారు అని చెబుతారు. ప్రత్యేకంగా ఆయన ఏ స్వామీజీని ప్రోత్సహించలేదు. ఎవరూ తన గురువు అని అంగీకరించలేదు. ఇక చంద్రబాబు సీఎం కావడానికి ఒక మీడియా అధిపతి సహకరించారని ప్రచారంలో ఉంది. దాంతో ఆయన్ని బాబుకు రాజగురువుగా అంతా పేర్కొంటూ వచ్చారు. ఈ రాజగురువు ఆక్షర యాగాలే చేస్తారు. ఆయన తన పాఠకులకే టీడీపీ అనుకూల స్తోత్ర పాఠాలు వల్లించి చంద్రబాబుకు మేలు జరిగేలా చూస్తారని ప్రత్యర్ధులు విమర్శిస్తారు.
జగన్ కి ఆయనే…
ఇక స్వతహాగా క్రిస్టియన్ అయిన జగన్ కి హిందూ సంప్రదాయల పట్ల ఏ విధమైన అభిప్రాయాలూ మొదట్లో లేవు. అదే సమయంలో జగన్ అధికారంలోకి రాకూడదని 2014 ఎన్నికల్లో విశాఖకు చెందిన స్వరూపానందేంద్ర స్వామి భావించారని చెబుతారు. చిత్రంగా ఇద్దరికీ బంధం కుదిరింది. దానికి బీజం వేసింది మాజీ ఎంపీ టీ సుబ్బరామిరెడ్డి అని చెబుతారు. అయితే టీఎస్సార్ సైడ్ అయ్యారు. స్వామి పట్ల జగన్ కి మంచి గురి కుదిరింది. అది ఎంతలా అంటే జగన్ ఏ మంచి పని తలపెట్టాలన్నా ఆయన జాతకం, ముహూర్తం చూసి చెప్పాల్సిందే.
స్వామి పేరిట పూజలు ….?
ఇది నిజంగా వివాదంగానే ఉంది. ఇప్పటిదాకా ఎక్కడా జరగలేదు కూడా. పీఠాధిపతులు, స్వామీజీలు వస్తే వారికి రాచమర్యాదలు చేయడం కూడా లేదు. వారిని వీవీఐపీలు భావించి మాత్రమే ఆలయాలలో స్వాగతాలు పలుకుతారు. కానీ జగన్ జమానాలో స్వామీజీకి ఎర్ర బుగ్గ కారు సదుపాయం కల్పించారు. ఇక స్వామి తిరుపతి వస్తే ఏకంగా విమానాశ్రయం నుంచి ఎదురేగి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఇపుడు ఆయన పుట్టిన రోజుల అన్ని దేవాలయాల్లో అర్చనలు జరిపించాలని జీవోలు ఇచ్చారు. మొత్తానికి స్వామీజీ అంటే జగన్ కి ఎంత మక్కువ అన్నది ఈ చర్యలతో రుజువు చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇది వివాదంగా మారుతోంది.
మంచి రోజులా…?
జగన్ కి జనవరి తరువాత మంచి రోజులు అని స్వామి చెబుతున్నాట్లుగా ప్రచారంలో ఉంది. డిసెంబర్ వరకూ ఆయన అనుకున్న దానికి అడ్లు ఆటంకాలు ఏర్పడతాయని కూడా చెబుతున్నారు. ఈ పరీక్ష సమయంలో జగన్ నెగ్గితే ఆయనకు తిరుగులేదని కూడా అంటున్నారు. దాంతో స్వామీజీ పైన గురి మరింత పెంచుకున్న జగన్ ఆస్థాన రాజ గురువుగా చోటు కల్పించారని అంటున్నారు. మరి గతంలో అస్థాన గాయకులు,కవి పండితులు ప్రభుత్వంలో ఉండేవారు. ఇపుడు రాజ గురువులు కూడా కొత్తగా చేరుతున్నారు. చంద్రబాబు లాంటి వారు రాజగురువులకు చేసిన ఉపకారాలు ఎవరికీ తెలియవు. జగన్ మాత్రం బాహాటంగా చేయడంతోనే వివాదాలు వస్తున్నాయి అని అంటున్నారు.