అంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులా?
మరో పది నెలల్లో ఏపీ కేబినెట్‌ను భారీగా ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. జగన్ ముందే చెప్పినట్టు ఇప్పుడున్న మంత్రుల్లో 90 శాతం మందిని మార్చేసి వారి [more]
మరో పది నెలల్లో ఏపీ కేబినెట్‌ను భారీగా ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. జగన్ ముందే చెప్పినట్టు ఇప్పుడున్న మంత్రుల్లో 90 శాతం మందిని మార్చేసి వారి [more]
మరో పది నెలల్లో ఏపీ కేబినెట్‌ను భారీగా ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. జగన్ ముందే చెప్పినట్టు ఇప్పుడున్న మంత్రుల్లో 90 శాతం మందిని మార్చేసి వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇస్తానని చెప్పారు. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచి సిట్టింగ్‌ల్లో టెన్షన్ స్టార్ట్ అయితే.. ఆశావాహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కోస్తాలో కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం జగన్ కేబినెట్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ( డిప్యూటీ సీఎం కూడా), ఆచంట ఎమ్మెల్యే రంగనాథరాజు మంత్రులుగా ఉండగా… వీరిలో వనిత, రంగనాథరాజును గ్యారెంటీగా తప్పించేస్తారని వైసీపీ వాళ్లే చెపుతున్నారు. ఆళ్ల నాని పదవి ఉంటుందా ? ఊడుతుందా ? అనేది అప్పటి సామాజిక సమీకరణలను బట్టి జగన్ నిర్ణయం తీసుకోవచ్చు. కాపు వర్గంలో బందరు ఎమ్మెల్యే పేర్ని నాని ప్రభుత్వ వాయిస్ బలంగా వినిపిస్తుండడంతో ఆళ్ల నానిని కూడా కంటిన్యూ చేసే అవకాశాలు తక్కువే అని ఓ లెక్క.
ఆశావాహులు చాలా మందే….
కొత్తగా మంత్రి పదవి రేసులో ఉన్న వారిలో సీనియర్లు, క్యాస్ట్ ఈక్వేషన్లపై ఆశలు పెట్టుకున్న వారు చాలా మందే ఉన్నారు. గతంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేయడతో పాటు నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తెల్లం బాలరాజు ఈ సారి తనకు మంత్రి పదవి గ్యారెంటీయే అనుకుంటున్నారు. గత ఎన్నికల తర్వాతే ఆయన మంత్రి కావాల్సి ఉండగా ఆయన పదవిని పుష్ప శ్రీవాణి అనూహ్యంగా తన్నుకుపోయారు. ఈ సారి ఎస్టీ కోటాలో సీనియర్‌గా ఉన్న బాలరాజుకు ఒక్క సాలూరు ఎమ్మెల్యే పీడికల రాజన్న దొర నుంచి మాత్రమే పోటీ ఉండగా.. మెజార్టీ అవకాశాలు మాత్రం బాలరాజుకే ఉన్నాయి.
క్షత్రియ కోటాలో….
ఇక జగన్ కేబినెట్ లో పడే ఫస్ట్ వికెట్ రంగనాథ రాజుదే. క్షత్రియ కోటాలో జగన్‌కు నమ్మినబంటుగా ఉన్న నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజుకే మంత్రి పదవి రావాల్సి ఉండగా… రంగనాథ రాజు తనకు వయస్సు అయిపోతోందని.. ఇదే ఆఖరి అవకాశం అంటూ జాతీయస్థాయిలో క్షత్రియ వర్గం నేతలతో జగన్‌కు రికమెండ్ చేయించుకుని మరీ మంత్రి పదవి పొందారన్న టాక్ ఉంది. ఆయన పనితీరుపై కూడా జగన్ అంత సంతృప్తిగా అయితే లేరంటున్నారు. ఇక ప్రసాదరాజు జగన్ కోసం తన ఎమ్మెల్యే పదవి వదులుకోవడం, నియోజకవర్గం మారి ఓడిపోవడం ఇలా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ సారి ప్రసాదరాజుకు మంత్రి పదవి పక్కా.
పవన్ ను ఓడించిన….
ఇక భీమవరంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ సీనియర్. ఆయన కూడా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. గతంలో దూకుడుగా ఉండే ఆయన ఇప్పుడు చిన్న వివాదం కూడా లేకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన కాపు కోటాలో మంత్రి పదవి వస్తుందని అనుచరులతో చర్చించడంతో పాటు గట్టి నమ్మకంతో ఉన్నారు. పవన్‌పై గెలవడమే ఆయనకు ప్లస్. ఈ ముగ్గురు నేతలకు మాత్రం కేబినెట్ బెర్త్‌పై గట్టి నమ్మకాలే ఉన్నాయి. ఇక బీసీ కోటాలో తణుకు నుంచి రెండోసారి గెలిచిన కారుమూరి నాగేశ్వరరావు సీనియర్ అయినా… యాదవ వర్గంలో అనిల్‌కుమార్‌ను తప్పిస్తారా ? లేదా ? అన్నది డౌటే. అయినా ఇదే వర్గంలో మాజీ మంత్రి పార్థసారథి కూడా బెర్త్‌పై కన్నేశారు. వీరిద్దరిని దాటుకుని కారుమూరికి ఛాన్స్ రావడం కష్టమే. ఇక గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తొలిసారి ఎమ్మెల్యే అయినా ఎస్సీ ( మాల) కోటాలో ఆయన పేరు కేబినెట్ రేసులో ఉంటుందని స్థానికంగా చర్చలు నడుస్తున్నాయి. ఈ మార్పుల్లో వనిత, రంగనాథ రాజు అవుట్ అవ్వడం ఖాయం కాగా… మిగిలిన ఈక్వేషన్లు మాత్రం ఎలా మారతాయో ? చూడాలి.