అలా దెబ్బతీస్తున్నారన్నమాట
రివర్స్ టెండరింగ్… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొందరిని వణికిస్తున్న పేరు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన రోజు నుంచే ఈ పేరు పాపులర్ అయింది. ఎక్కువగా [more]
రివర్స్ టెండరింగ్… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొందరిని వణికిస్తున్న పేరు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన రోజు నుంచే ఈ పేరు పాపులర్ అయింది. ఎక్కువగా [more]
రివర్స్ టెండరింగ్… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొందరిని వణికిస్తున్న పేరు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన రోజు నుంచే ఈ పేరు పాపులర్ అయింది. ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రివర్స్ టెండరింగ్ కు భయపడుతున్నారు. కొందరు కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పోలవరం, రాజధాని అమరావతి పనులపై రివర్స్ టెండర్లకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మిగిలిన కాంట్రాక్టర్లు కూడా ఆందోళనలో ఉన్నారు.
కాంట్రాక్టర్లు వారేనట…..
కేవలం కాంట్రాక్టర్లే కాదు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఒకింత ఆందోళనలో ఉన్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు నామినేషన్ పద్ధతిలోనూ, ఓపెన్ టెండ్ర లో కాంట్రాక్టులు దక్కించుకున్న వారిలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కువగా ఉన్నారు. వారే సబ్ కాంట్రాక్టుల్లో ప్రధానంగా ఉన్నారు. మరో విషయం ఏంటంటే కాంట్రాక్టు పనుల్లోనే కాదు అందులో వడే సాంకేతిక యంత్రాలు, వాహనాలు కూడా తెలుగుదేశం పార్టీ నేతలవే కావడం గమనార్హం.
ఐదేళ్లుగా సంపాదించుకున్న…..
తెలుగుదేశం పార్టీ నేతలు లబ్ది పొందేందుకు ఆర్థికంగా బలపడేందుకు వారికి గత ఐదేళ్లు ఆదాయ మార్గాలను చంద్రబాబు చూపించారన్న టాక్ ఉంది. జిల్లాల వారీగా తీసుకున్న ప్రధాన కాంట్రాక్టుల్లో తెలుగుదేశం పార్టీ నేతలే ఉండటం విశేషం. ఇక ఎన్నికల చివరి క్షణంలో అయితే అప్పటికప్పడు పనులు అప్పగించినవి కూడా లేకపోలేదు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ తెచ్చారంటున్నారు. దీనిద్వారా టీడీపీ నేతల ఆదాయ మార్గాలను మూసివేయవచ్చన్నది ఆయన ఆలోచన. తద్వారా ఆర్థికంగా దెబ్బకొట్టవచ్చన్నది జగన్ భావిస్తున్నారు.
ఢిల్లీలో లాబీయింగ్…..
అయితే రివర్స్ టెండరింగ్ కు భయపడిన టీడీపీ నేతలు క్రమంగా ఆ పార్టీని వదలేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే రాజకీయంగానూ, ఆర్థిక విషయాల్లోనూ తాము సేఫ్ గా ఉండేందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లో చేరేందుకు ఉత్సాహ పడుతున్నారు. కొందరు కాంట్రాక్టర్లు కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకుని బీజేపీ నేతలతో లాబీయింగ్ కూడా చేశారట. జగన్ ఢిల్లీ పర్యటించినప్పుడు కూడా అక్కడ కొందరు ప్రముఖ కాంట్రాక్టర్లు లాబీయింగ్ చేసేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. మొత్తం మీద ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు జగన్ రివర్స్ టెండరింగ్ ను బయటకు తీసినట్లుంది.