చరిత్రలో కలిపేస్తారా?
ఏపీకి రాజధాని ఏదీ అని ఇపుడు స్కూల్లో చదువుతున్న పిల్లలను అడిగితే అమరావతి అని ఠక్కున చెబుతారు. అదే పిల్లలను పిక్ నిక్ తీసుకెళ్ళి అమరావతి ని [more]
ఏపీకి రాజధాని ఏదీ అని ఇపుడు స్కూల్లో చదువుతున్న పిల్లలను అడిగితే అమరావతి అని ఠక్కున చెబుతారు. అదే పిల్లలను పిక్ నిక్ తీసుకెళ్ళి అమరావతి ని [more]
ఏపీకి రాజధాని ఏదీ అని ఇపుడు స్కూల్లో చదువుతున్న పిల్లలను అడిగితే అమరావతి అని ఠక్కున చెబుతారు. అదే పిల్లలను పిక్ నిక్ తీసుకెళ్ళి అమరావతి ని చూపించమంటే మాత్రం దిక్కులు చూస్తారు. అంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అయిదు కోట్ల ఏపీ ప్రజల మెదళ్ళలో మన రాజధాని అమరావతి అని గట్టిగా జొప్పించగలిగిన ఘనత మాత్రం టీడీపీ ప్రభువులదే. అదే సమయంలో అక్కడ ఒక్కటి కూడా శాశ్వత భవనం కట్టకుండా తరువాత వచ్చిన ప్రభుత్వానికి రాజధాని మార్చడానికి వీలుకల్పించినది కూడా ఇదే టీడీపీ అంటే ఒప్పుకోరు కానీ అదే నిజం. ఆ విషయాన్నే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు కూడా. నాడు చంద్రబాబు శాశ్వత భవనాలే కట్టి ఉంటే ఇపుడు జగన్ రాజధాని మార్పు విషయంలో ఫీలర్స్ అయినా వదిలే ధైర్యం చేసేవారు కాదు కదా అన్నది జీవీఎల్ ఉద్దేశ్యం.
శివరామక్రిష్ణనే దిక్కు…..
ఏపీ రాజధాని అమరావతి మార్పు తధ్యమని తలపండిన రాజకీయ జీవులతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూసిన వారు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. దీనికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. నిజానికి విభజన తరువాత కేంద్రం శివరామక్రిష్ణన్ కమిటీని ఏర్పాటు చేసి ఏపీ అంతా తిప్పింది. పదమూడు జిల్లాల్లో పర్యటించి పరిశీలించిన కమిటీ చివరికి తేల్చింది ఏంటంటే గుంటూరు, కృష్ణా తప్ప మిగిలిన ప్రాంతాల్లో రాజధాని కట్టాలని, మొత్తం పదమూడు జిల్లాలను సమగ్రంగా అభివ్రుద్ధి చేయాలని సూచించింది. ఇక రెండు నివేదికలు దీని మీద కేంద్రానికి కమిటీ ఇస్తే రెండవ నివేదిక బూజుని ఇపుడు దులుపుతున్నారట. ఆ నివేదిక ఇప్పటివరకూ బహిర్గతం కాలేదని అంటున్నారు. అందులో ముక్కారు పంటలు పండే భూములు అసలు తీసుకోవద్దని కూడా పేర్కొన్నారట. పైగా అభివ్రుధ్ధి చెందిన జిల్లాల్లో రాజధాని ఏర్పాటు మరో రాష్ట్ర విభజనకు దారి తీస్తుందని కూడా పేర్కొన్నారుట. ఈ క్రమంలోనే శివరామక్రిష్ణన్ నివేదికను కేంద్రం కూడా నిశితంగా పరిశీలిస్తోందని సమాచారం.
నిధుల కొరతే కారణమా…?
ఇటు రాజధాని నిర్మాణానికి ఏపీ సర్కార్ కి నిధులు లేవు. విభజనలో పేర్కొన్న మేరకు భారీ ఎత్తున నిధులు ఇచ్చేందుకు కేంద్రానికి అవకాశంలేదు. దాంతో ఇక్కడ రెండు ప్రభుత్వాలకు ఏకాభిప్రాయం కుదిరిందని అందుకే రాజధాని మార్పు విషయంలో వైసీపీ వేస్తున్న అడుగుల వెనక కేంద్రం సలహాలు ఉన్నాయని అంటున్నారు. పదమూడు జిల్లాల్లో శివరామక్రిష్ణన్ కమిటీ చెప్పిన మేరకు అభివ్రుధ్ధి చేస్తూ రాజధాని భవనాలను, నిర్మాణాలను చాలా తక్కువ ఖర్చుతో వీలైనంత వరకూ పూర్తి చేయాలన్నది వైసీపీ ఆలోచనగా ఉంది. దానికి కేంద్రం కూడా వత్తాసు పలుకుతోందని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే బాబు గారి అమరావతి చరిత్రలోనే కలవడం ఖాయం. అధి ఎప్పటికీ భ్రమరావతిగానే ఉంటుందన్నది కూడా ఖాయమే.