జగన్ ఆపరేషన్ అందుకేనా?
తెలుగుదేశం పార్టీని సమూలంగా దెబ్బతీసేందుకు ఒక పక్క వైసిపి, మరో పక్క బిజెపి ప్రణాళికబద్ధంగా సాగుతున్నాయా ? అవుననే అనిపిస్తున్నాయి ఎపి లో తాజగా నడుస్తున్న రాజకీయాలు. [more]
తెలుగుదేశం పార్టీని సమూలంగా దెబ్బతీసేందుకు ఒక పక్క వైసిపి, మరో పక్క బిజెపి ప్రణాళికబద్ధంగా సాగుతున్నాయా ? అవుననే అనిపిస్తున్నాయి ఎపి లో తాజగా నడుస్తున్న రాజకీయాలు. [more]
తెలుగుదేశం పార్టీని సమూలంగా దెబ్బతీసేందుకు ఒక పక్క వైసిపి, మరో పక్క బిజెపి ప్రణాళికబద్ధంగా సాగుతున్నాయా ? అవుననే అనిపిస్తున్నాయి ఎపి లో తాజగా నడుస్తున్న రాజకీయాలు. గత ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితం అయ్యి చావుదెబ్బ తిన్న టిడిపి ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టకపోతే ప్రమాదమని ఒక పక్క వైసిపి లెక్కసుకుంటే మరోపక్క తెలుగుదేశం ఉండగా తాము బలపడటం అసాధ్యమని బిజెపి పక్కాగా ఉన్నట్లు పరిశీలకుల అంచనా. అందులో భాగంగానే ఈ రెండు పార్టీలు వేగంగా తమ సమీకరణాలు మారుస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గంలోని పెద్ద తలకాయలను ఇప్పటికే బిజెపి తీర్ధం ఇచ్చేస్తూ వస్తుంది. తామేమీ తక్కువ తినలేదని వైసిపి సైతం రూల్స్ ను కొద్దిగా సడలించి గేట్లు తెరుస్తుంది.
మాజీ లతో సమస్య లేదు …
ప్రస్తుతం వైసిపి కి అవసరానికి మించి అసెంబ్లీలో బలం వుంది. 151 సీట్లు ఉండటంతో కొత్తగా వచ్చే వారికి ఎలాంటి హామీలు ఇవ్వలేని పరిస్థితి వైసీపీది. అందువల్లే సింగిల్ సీట్ వున్న జనసేన ఎమ్యెల్యేకి ఎలాంటి ఆఫర్ వైసిపి నుంచి రావడం లేదు. వైసిపి కి అనుకూలంగా రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో పెరిగినా కూడా పార్టీలో చేర్చుకునేందుకు పార్టీకి పదవికి రాజీనామా చేసి రావాలన్న జగన్ షరతు శాసనసభ్యులకు అడ్డుగోడగా నిలిచింది. దాంతో గోడ దూకేందుకు సిద్ధంగా వున్న టిడిపి ఎమ్యెల్యేల్లో కొందరు ఎటు నిర్ణయించుకోలేక ఇష్టం లేకపోయినా సొంత పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎమ్యెల్యేలుగా ఉండి బిజెపి తీర్ధం పుచ్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కమలం వైపు వారు దృష్టి పెట్టడం లేదు.
వల్లభనేని వంశీ తో ….
కృష్ణా జిల్లా టిడిపి కి కంచుకోటగా వుంటూ వచ్చేది. అలాంటి ఆ జిల్లాల్లో గత ఎన్నికల్లో టిడిపి గెలిచినవి రెండే సీట్లు. గన్నవరం లో వల్లభనేని వంశీ, విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహనరావు మాత్రమే గెలిచారు. మిగిలిన స్థానాలన్నీ వైసిపి క్లిన్ స్వీప్ చేసింది. వీరిద్దరూ కూడా చంద్రబాబు కి అత్యంత సన్నిహితులే కావడంతో వీరెవరూ పార్టీ జంప్ చేసే పరిస్థితి వుండకపోవచ్చనేది టిడిపి వర్గాల ధీమా. అయితే గత కొంతకాలంగా వంశీ బిజెపి లోకి వెళతారని ప్రచారం జోరుగా సాగింది. మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తో వున్న బంధుత్వంతో వంశీ కాషాయం కండువా కప్పేస్తారనే అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన వైసిపి వాకిట నిలిచి అందరిని ఆక్శ్చర్య పరిచారు.
మరో నలుగురు వెళితే …
తన ఎమ్యెల్యే పదవికి పార్టీకి రాజీనామాకు సిద్ధమన్న సంకేతాలు జగన్ ఇంటికి వెళ్ళి తన మిత్రుడు కొడాలి నాని తో కలిసి వెళ్లిమరీ ఇచ్చివచ్చారు. పండగ వెళ్ళాకా వంశీ తన నిర్ణయం వెల్లడించే అవకాశాలు ఉండటంతో ఆయన వైసిపి లో చేరడం ఖాయమనే మాట వినవస్తుంది. అదే జరిగితే ఇంకా ఆ లైన్లోనే వున్న గంటా శ్రీనివాసరావు వంటివారు కూడా టిడిపికి టాటా చెప్పే వాతావరణం ఎలానూ వుంది. వీరిద్దరూ కాక మరోముగ్గురు టిడిపి ఎమ్యెల్యేలు ఇదే నిర్ణయం తీసుకుంటే మాత్రం శాసనసభలో టిడిపి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కోల్పోతుంది. దాంతో బాటు రాబోయే రోజుల్లో మండలి లో తమ సభ్యుల సంఖ్యను క్రమంగా కోల్పోయి జీరో అయ్యే ప్రమాదం పొంచివుంది. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న టిడిపి మాత్రం ఆచితూచి ఈ వ్యవహారాలపై స్పందిస్తుంది. వంశీ పార్టీ కి రాజీనామా చేస్తా అని స్వయంగా ప్రకటించాకా స్పందించాలని భావిస్తుంది. అయితే అంతర్గతంగా మాత్రం టిడిపి లో తాజా పరిణామాలు ప్రకంపనలే సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది.