వెనక్కు తగ్గాల్సిందేగా
రాష్ట్రాల అధికారాల్లోకి కూడా కేంద్రం చొరబడుతుందా? ప్రజల నిర్ణయాలను కూడా పక్కన పెట్టి.. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం సాగిస్తుందా? రాష్ట్రాలు కూడా తమ చెప్పుచేతుల్లోనే ఉండాలని కేంద్రం [more]
రాష్ట్రాల అధికారాల్లోకి కూడా కేంద్రం చొరబడుతుందా? ప్రజల నిర్ణయాలను కూడా పక్కన పెట్టి.. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం సాగిస్తుందా? రాష్ట్రాలు కూడా తమ చెప్పుచేతుల్లోనే ఉండాలని కేంద్రం [more]
రాష్ట్రాల అధికారాల్లోకి కూడా కేంద్రం చొరబడుతుందా? ప్రజల నిర్ణయాలను కూడా పక్కన పెట్టి.. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం సాగిస్తుందా? రాష్ట్రాలు కూడా తమ చెప్పుచేతుల్లోనే ఉండాలని కేంద్రం భావిస్తోందా? అంటే..తాజాగా ఏపీలో జరిగిన పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వ్యవస్థలోని లోపాలను కడిగేస్తానని, పారదర్శక పాలన అందిస్తానని, అవినీతి లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ప్రభుత్వం నుంచి సేవలు పొందేలా చేస్తానని సీఎంగా ప్రమాణం చేసిన వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ఆయన పాలనను ప్రారంభించారు. ఈ క్రమంలోనే గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలపై రివ్యూలు చేపడుతున్నారు.
కేంద్రం జోక్యంతో….
ముఖ్యంగా పలు ప్రాజెక్టుల్లో అవినీతి రాజ్యమేలిందని ఆరోపిస్తున్న జగన్.. వాటి నిగ్గు తేల్చేందుకు కమిటీలను ఏర్పా టు చేస్తున్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులు సహా అత్యంత కీలకమైన పవర్ సెక్టార్‌లోనూ అవినీతి పెచ్చరిల్లిందని చెప్పిన జగన్.. వీటి అంతు చూసేందుకు రెడీ అయ్యారు. అయితే, జగన్ తొలి వ్యూహానికి కేంద్రం చెక్ పెడుతోందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా పవర్ సెక్టార్ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం నేరుగా స్పందించడం రాజకీయ వర్గాల్లో కలవరం పుట్టిస్తోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో అందునా అవినీతిని అంతం చేసేందుకు నిర్ణయించిన క్రతువులో కేంద్రం జోక్యం చేసుకోవడం ఇదే ప్రథమం కావడంతో అందరూ నివ్వెర పోతున్నారు.
పీపీఏలను తిరగదోడటం…..
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) తిరగదోడటం సరికాదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. గతంలో ఈ అంశంపై కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయగా… ఈసారి ఏకంగా ఆ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ముఖ్యమంత్రికి లేఖ పంపించారు. ‘పునఃసమీక్షకు ప్రధాని కూడా అంగీకరించారు’ అని సీఎం జగన్ ప్రకటించి… ఈ ప్రక్రియపై కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం ట్రాన్స్‌కో అధికారులు పవన, సౌర విద్యుదుత్పత్తిదారులను పిలిపించి ధరలు తగ్గించాలని కోరారు. కానీ, అంతా పద్ధతి ప్రకారమే జరిగిందని, ధరలు తగ్గించలేమని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రానికి కేంద్ర మంత్రి లేఖ రాశారు.
పెట్టుబడులు దెబ్బతింటాయని….
లేఖతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పవన, సౌర విద్యుత్ ధరల పట్టికలను కూడా జత చేసి పంపారు. ఇటువంటి పట్టికలను కేంద్రం పంపడం ఇదే ప్రథమం. విద్యుత్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మా పూర్తి సహకారం ఉంటుంది. అవినీతిపై మీరు చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుంది. అవినీతి ఎక్కడ చోటు చేసుకున్నా కచ్చితంగా దానిపై చర్యలు ఉండాల్సిందే. అదే సమయంలో మన చర్యలు, ప్రయత్నాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా చట్టానికి లోబడి ఉండాలి. అలా లేకపోతే పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి రెండూ దెబ్బ తింటాయి. మన దేశంలో పునరుత్పాదక ఇంధన రంగం భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ప్రపంచంలోని దాదాపు అన్ని పెద్ద పింఛను ఫండ్లు మన దేశంలో ఈ రంగంలోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి.
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో…?
దేశంలో వేగవంతమైన అభివృద్ధి ప్రదర్శిస్తున్న రంగాల్లో పునరుత్పాదక ఇంధనం ఒకటి. ఇక్కడ చట్టం పని చేయడం లేదని, కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించడం లేదన్న అభిప్రాయం బయటకు వెళ్తే పెట్టుబడులు ఆగిపోయి అభివృద్ధి నిలిచిపోతుంది. విద్యుత్ టారిఫ్ లను స్వతంత్రంగా పనిచేసే రెగ్యులేటరీ కమిషన్లు నిర్ణయిస్తాయి. కేంద్రంలో, రాష్ట్రాల్లో దీని కోసం వేర్వేరు రెగ్యులేటరీ కమిషన్లు ఉన్నాయి. ఇవి బహిరంగ విచారణలు నిర్వహించి.. ఖర్చును పరిశీలించి విద్యుత్ ధరలను నిర్ణయిస్తాయి. ఒకసారి పీపీఏలు (విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు) కుదుర్చుకున్న తర్వాత వాటిపై సంతకాలు చేసిన వారంతా దానికి కట్టుబడి ఉండాలి. అని తాజాగా జగన్‌కు కేంద్రం నుంచి లేఖ అందింది. దీంతో ఆయన ఈ విషయంలో వెనక్కి తగ్గడం తప్ప మరో మార్గం లేదు. ఇదే కొనసాగితే.. రాబోయే రోజుల్లో జగన్‌కు మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం లేక పోలేదని అంటున్నారు పరిశీలకులు. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.