షర్మిలా “అన్న”ను ఒకసారి అడగవా?
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని ఎవరూ తప్పు పట్టారు. కానీ ఆమె వేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న డిమాండ్లకు మాత్రం తిరిగి వేలు ఆమె వైపే చూపుతుంది. [more]
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని ఎవరూ తప్పు పట్టారు. కానీ ఆమె వేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న డిమాండ్లకు మాత్రం తిరిగి వేలు ఆమె వైపే చూపుతుంది. [more]
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని ఎవరూ తప్పు పట్టారు. కానీ ఆమె వేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న డిమాండ్లకు మాత్రం తిరిగి వేలు ఆమె వైపే చూపుతుంది. ఎంత కాదనుకున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షర్మిలకు స్వయానా సోదరుడు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ప్రజలు మాత్రం రెండు రాష్ట్రాల పరిస్థితులను బేరీజు వేసుకుంటారు. అక్కడ పరిస్థితులను, ఇక్కడ పరిస్థితులకు తేడా చూస్తారు. అదే ఇప్పుడు వైఎస్ షర్మిలకు ఇబ్బందిగా మారనుంది.
పార్టీ పెట్టిన తర్వాత…?
వైఎస్ షర్మిల జగన్ ను కాదని తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారంటారు. ఆమె ఇక్కడ పార్టీ పెట్టడం కూడా జగన్ కు ఇష్టం లేదంటారు. అనవసర ప్రయాస అని జగన్ అనుకోవచ్చు. అక్కడ మనం నెగ్గలేమన్న భావన కావచ్చు. వైసీపీనే తెలంగాణలో మూసివేసిన జగన్ తన సోదరి వైఎస్ షర్మిలతో అక్కడ కొత్త పార్టీ పెట్టిస్తారనుకుంటే పొరపాటే. మరి వైఎస్ షర్మిల ఏ ధైర్యంతో, ఏం ఆశించి పార్టీ పెట్టారో తెలియదు కాని ఆమె వ్యాఖ్యలు తిరిగి లోటస్ పాండ్ కే చేరేలా ఉన్నాయి.
నిరుద్యోగ సమస్యపై…?
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపైన వైఎస్ షర్మిల పోరాటాన్ని ప్రారంభించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న 1.91 లక్షల పోస్టులను భర్తీ చేయాలని, వెంటనే వాటికి నోటిఫికేషన్ విడుదల చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఖరే కారణమని షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వాటిని ప్రభుత్వ హత్యలుగా చెబుతున్నారు.
ఏపీ సంగతేంటి?
కానీ ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. ఇటీవల వైెఎస్ జగన్ జాబ్ క్యాలండర్ ను ప్రకటించారు. కేవలం 10వేల పోస్టులనే భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో మాత్రం యాభై వేల పోస్టుల భర్తీకి కసరత్తు మొదలయింది. దీంతో ముందు ఏపీలో ఉద్యోగాల భర్తీకి అన్నను డిమాండ్ చేయాలని వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో ట్రోల్ మొదలయింది. నదీ జలాల విషయంలోనూ అంతే. షర్మిల ఇక్కడ చేసే డిమాండ్ ను అన్న ముందు ఉంచమన్న కామెంట్స్ వినపడుతున్నాయి.