చెయ్యెత్తి జై కొట్టాల్సిందేనా… ?
కొందరు నాయకులు ఉంటారు. వారికి ప్రాంతాలతో పట్టింపు ఉండదు. వారు పక్కా మాస్ లీడర్స్ గా గుర్తింపు పొందుతారు. అలాంటి వారిలో ఎన్టీయార్, వైఎస్సార్ లను చూడాలి. [more]
కొందరు నాయకులు ఉంటారు. వారికి ప్రాంతాలతో పట్టింపు ఉండదు. వారు పక్కా మాస్ లీడర్స్ గా గుర్తింపు పొందుతారు. అలాంటి వారిలో ఎన్టీయార్, వైఎస్సార్ లను చూడాలి. [more]
కొందరు నాయకులు ఉంటారు. వారికి ప్రాంతాలతో పట్టింపు ఉండదు. వారు పక్కా మాస్ లీడర్స్ గా గుర్తింపు పొందుతారు. అలాంటి వారిలో ఎన్టీయార్, వైఎస్సార్ లను చూడాలి. వీరిలో ఒకరు కోస్తాలో పుడితే మరొకరు రాయలసీమలో పుట్టారు. అయితే ఈ ఇద్దరూ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులుగా తమదైన ముద్రను గట్టిగానే వేసుకున్నారు. ఈ ఇద్దరు నాయకులకు ఏపీలో కంటే మిన్నగా తెలంగాణాలోనూ అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇపుడు అదే అక్కడ రాజకీయాలను కూడా విశేషంగా ప్రభావితం చేస్తోంది.
గట్టి ఫ్యాక్టర్..
వైఎస్సార్ దుర్మరణం తరువాత ఆగిన గుండెల్లో తెలంగాణా వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి ఆయన అంటే అంత అభిమానం. పైగా అక్కడ కూడా వైఎస్ పధకాలను అందుకున్న వారు ఉన్నారు. వైఎస్సార్ ని కులం మతం అన్న దానికి భిన్నంగా అన్ని వర్గాల్లోనూ ప్రేమించే వారు ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాకనే ఆయన తనయ తన రాజకీయ కార్యక్షేత్రంగా తెలంగాణాను ఎంచుకున్నారు అంటున్నారు. ఆమె తన తండ్రి పాలనను మళ్లీ తెస్తాను అంటున్నారు. ఆయన తెలంగాణాకు చేసిన సేవలు కూడా గుర్తు చేస్తున్నారు.
అది నిజమా…?
ఇక షర్మిల తాజాగా తెలంగాణావ్యాప్తంగా ఒక సర్వే చేయించారు అంటున్నారు. ఆ సర్వేలో షాకింగ్ విషయాలే బయటకు వచ్చాయట. అవేంటి అంటే మొత్తం తెలంగాణాలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 72 దాకా చూసుకుంటే వైఎస్సార్ ఫ్యాక్టర్ చాలా గట్టిగానే ఉందిట. ఈ నియోజకవర్గాల్లో వైఎస్సార్ అంటే పడి చచ్చే అభిమానులు ఉన్నారుట. వారు గెలుపు ఓటములకు నిర్ణయించే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు అని కూడా ఈ సర్వే చెబుతోందిట. ఇంతకాలం వైఎస్సార్ చరిష్మా విషయంలో ఏపీలోనే సర్వేలు జరిగాయి కాబట్టి తెలంగాణా నాడి తెలియలేదు, కానీ ఇపుడు అక్కడ సర్వే చూస్తే జనాల గుండెల్లో వైఎస్సార్ ఇంకా బతికే ఉన్నారు అని అర్ధమవుతోంది అంటున్నారు.
అందుకే జపం ….
వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ ఆస్తి అని పీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించడం వెనక ఈ నిజాలే ఉన్నాయని అంటున్నారు. వైఎస్సార్ మాట లేకుండా గతంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు వెళ్ళి చాలానే నష్టపోయారు అని కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి తెలివిగా మొదట్లోనే వైఎస్సార్ మా వాడు అని క్లైం చేసుకుంటున్నారు. రేపటి రోజున షర్మిల పార్టీ పెట్టి జనంలోకి వెళ్ళి వైఎస్సార్ అభిమాన గణాన్ని ఆకట్టుకుంటే కాంగ్రెస్ కే దెబ్బ అన్నది తెలిసిందే. అందుకే రేవంత్ కూడా జై కొడుతున్నారు. ఇక పార్టీ పెట్టాక షర్మిల పాదయాత్రలో తటస్థులను మిగిలిన వర్గాలను కలుపుకుని కేసీయార్ కి ధీటైన నాయకత్వం తనదని గట్టిగా చాటి చెబితే కనుక ఆమె పార్టీ బాగానే రాణిస్తుందని అంటున్నారు. మొత్తానికి రానున్న రోజులలో వైఎస్సార్ పేరు ఏపీ కంటే కూడా తెలంగాణాలోనే ఎక్కువగా మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది.