షర్మిల ఆడబిడ్డే..డోర్స్ క్లోజ్… ?
బై బై బాబూ అంటూ 2019 ఎన్నికలల్లో ఏపీలో ప్రతీ సభలోనూ షర్మిల చేసిన ప్రసంగాలకు విపరీతంగా జనం నుంచి మద్దతు దక్కింది. అ..ఆలు రావు కానీ [more]
బై బై బాబూ అంటూ 2019 ఎన్నికలల్లో ఏపీలో ప్రతీ సభలోనూ షర్మిల చేసిన ప్రసంగాలకు విపరీతంగా జనం నుంచి మద్దతు దక్కింది. అ..ఆలు రావు కానీ [more]
బై బై బాబూ అంటూ 2019 ఎన్నికలల్లో ఏపీలో ప్రతీ సభలోనూ షర్మిల చేసిన ప్రసంగాలకు విపరీతంగా జనం నుంచి మద్దతు దక్కింది. అ..ఆలు రావు కానీ అగ్ర తాంబూలం కావాలన్నాడట వెనకటికి ఒకడు అంటూ లోకేష్ మీద వేసిన సెటైర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఒక వైపు జగన్ సీరియస్ గా స్పీచ్ ఇస్తూంటే షర్మిల ప్రసంగంలో ఇలాంటి పంచులు బోలేడు. చంద్రబాబుని గట్టిగా వైసీపీలో ఎవరైనా విమర్శించారు అంటే అది వైఎస్ షర్మిల తప్ప మరొకరు కాదు అని చెప్పాలి. మంచి మాటకారిగా, వైఎస్ హావభావాలను అచ్చంగా పుణికి పుచ్చుకున్న వైఎస్ షర్మిల ఏపీలో చక్కని భవిష్యత్తు ఉన్న నేత అని అంతా అనుకున్నారు.
సీన్ కట్ చేస్తే….
వైఎస్ షర్మిల ఇపుడు తెలంగాణాకు తన పాలిటిక్స్ ని షిఫ్ట్ చేశారు. పార్టీ ఇంకా పెట్టకుండానే ఆమెకు ఆదిలోనే అగ్ని పరీక్ష ఎదురైంది. పుట్టిల్లుకీ, మెట్టింటికీ మధ్య వివాదం వస్తే సహజంగా ఆడబిడ్డలు అత్తింటి వైపే ఉంటారు. వైఎస్ షర్మిల అదే నిజమని నిరూపించారు. తాను తెలంగాణా కోడలిని అని నిరూపించుకున్నారు. తెలంగాణాకు చుక్క నీరు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోమంటూ ఏపీ మీదనే భారీ యుద్ధాన్నే ప్రకటించారు. కేసీఆర్ ఆమెని ఇరకాటంలో పెట్టే వ్యూహాన్ని రూపొందిస్తే ఎలాంటి శషబిషలకు తావు లేకుండా తాను తెలంగాణా పక్షమే అని వైఎస్ షర్మిల చాటి చెప్పారు.
వైఎస్సార్ బ్రాండ్ ఇమేజ్….
రాజశేఖరరెడ్డి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్. ఆయన రాయలసీమ పౌరుషానికి ప్రతీకగా అంతా చూస్తారు. వైఎస్సార్ తనయగా షర్మిల కూడా సీమ గురించి గట్టిగా మట్లాడుతారు అనుకున్నారు. లేకపోతే కనీసం మౌనం వహిస్తారు అని కూడా భావించారు. కానీ ఆమె మాత్రం తన రాజకీయమే చూసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. సీమ ఆడపడుచుగా వైఎస్ షర్మిల వైఎస్సార్ దే తప్పు అనేలా తన పొలిటికల్ కామెంట్స్ తో మచ్చ తెచ్చారు అన్న విమర్శలు వస్తున్నాయి. 2019 దాకా వైఎస్ షర్మిల ఏపీ బిడ్డగానే ఉన్నారు. అలాంటిది ఆమె రాజకీయం తెలంగాణాకు మారేసరికి మాట కూడా మారింది. దాంతో ఆమె వైఎస్సార్ బ్రాండ్ ఇమేజ్ నే ఫణంగా పెట్టేసి తన కెరీర్ చూసుకుంటున్నారు అంటున్నారు.
జగన్ కి రిలీఫ్…..
వైఎస్ షర్మిల ఇక ఏపీ వైపు చూడదు, అసలు చూడలేదు కూడా. ఎందుకంటే ఆమె తనకు తానుగానే డోర్స్ క్లోజ్ చేసుకున్నారు. ఏపీ తెలంగాణాల మధ్యన నీటి వివాదాల విషయంలో ఆమె తెలంగాణా పక్షం వహించారు. రేపటి రోజునా మంచికైనా చెడ్డకైనా ఆమె అక్కడే రాజకీయం చేయాలి. మళ్ళీ తన కన్న ఊరు కడపని, జగన్ కి బలమైన రాజకీయ స్థావరం అయిన ఏపీ వైపు చూడాలనుకున్నా కూడా ఇక చెల్లే అవకాశం కనిపించడంలేదు. వైఎస్ షర్మిల తెలంగాణాలో రాజకీయంగా ట్రైనింగ్ అయి జగన్ మీదకే దూసుకువస్తుంది. ఆమే అసలైన కార్యక్షేత్రం ఎప్పటికైనా ఏపీయేనని జగన్ వ్యతిరేకులు జోస్యం చెప్పారు. అలా జరగాలని కోరుకున్నారు. ఇక షర్మిల వల్ల వైసీపీకి ఎప్పటికైనా ప్రమాదమే అని ఆ పార్టీ పెద్దలకు భయం ఉండేది. ఇపుడు వైఎస్ షర్మిల అవన్నీ తప్పు అని తానే చెప్పేశారు. ఆమె తెలంగాణా రాజకీయాల్లో ఫెయిల్ అయినా ఏపీ వైపు చూసే చాన్సే ఉండదు. ఆమె రాయలసీమ బిడ్డ అయి కూడా నీటి వివాదంతో చేసిన వ్యతిరేక వ్యాఖ్యలే ఆమెను ఏపీ వైపు రాకుండా డోర్స్ క్లోజ్ చేసేస్తాయి అంటున్నారు.