లాస్ట్ ఛాన్స్ మిస్ చేసుకుంటారా?
ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల30వ తేదీ నుంచి ఫిబ్రవరి ఏడో తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు [more]
ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల30వ తేదీ నుంచి ఫిబ్రవరి ఏడో తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు [more]
ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల30వ తేదీ నుంచి ఫిబ్రవరి ఏడో తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగనుండటంతో ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారా? లేదా? అన్నది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చిట్ట చివరి సమావేశాలు కావడంతో జగన్ ఈ సెషన్స్ కు హాజరయ్యే అవకాశాలున్నాయన్నది పార్టీలో కొందరు చెబుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, సమస్యలపై గళం విప్పే అవకాశం జగన్ వదులుకోరన్నది కొందరు పార్టీ నేతల వాదన.
శాసనసభ సమావేశాలకు దూరంగా….
గత మూడు దఫాలుగా అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు హాజరుకావడం లేదు. తమ పార్టీ ఎమ్మెల్యేలను అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని, పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, అలాగే వైసీపీ గుర్తు మీద గెలిచి మంత్రులుగా ప్రమాణస్వీకారంచేసిన నలుగురు మంత్రులపై వేటు వేయాలని, అప్పుడే తాము శాసనసభలోకి అడుగుపెడతామని జగన్ చెప్పారు. అప్పటి నుంచి జగన్ పార్టీ ఏపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. దీనిపై సీపీఐ, సీపీఎం, జనసేన, లోక్ సత్తా వంటి పార్టీలు విమర్శించినా జగన్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
సమర్థించుకుంటున్న వైసీపీ….
ప్రజాసమస్యలకు పరిష్కారం దొరికే శాసనసభను జగన్ సక్రమంగా వినియోగించుకోలేకపోయాడన్న విమర్శలు ఉన్నాయి. జగన్ శాసనసభకు రాకపోవడాన్ని అనేకమంది తప్పుపట్టారు. కానీ వైసీపీ వర్షన్ వేరేలా ఉంది. శాసనసభ కు వెళ్లినా ప్రయోజనం ఏమీ ఉండదని, తమకు మైకు ఇవ్వడమే గగనమని, ఇచ్చినా వెంటనే కట్ అయిపోతుందని చెబుతున్నారు. తాము చేసిన అభివృద్ధి పనులను గురించి ప్రస్తావించకుండా, శాసనసభలోనూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, దాని వల్ల శాసనసభకు వెళ్లకపోవడమే మంచిదన్నది వైసీపీ సీనియర్ నేతల అభిప్రాయం. ఇందులో కూడా నిజం లేకపోలేదంటున్నారు.
చివరి సమావేశాలు కావడంతో….
అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నో సమస్యలపై నిలదీసే అవకాశం జగన్ కు లభిస్తుందంటున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరంతో పాటు అగ్రిగోల్డ్ అంశాలను ప్రస్తావించి అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేయవచ్చని, అందుకే ఈసమావేశాలకు వెళ్లడమే మంచిదనికొందరు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. చివరి సమావేశాలను చక్కగా ఉపయోగించుకోవాలని, పథ్నాలుగు నెలల పాదయాత్రలో తాను ప్రత్యక్షంగా చూసిన సమస్యలను కూడా శాసనసభలో ప్రస్తావించే అవకాశం జగన్ కు దొరుకుతుందని పలువురు సూచిస్తున్నారు. జగన్ ప్రస్తుతం లండన్ బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంపై నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో?
- Tags
- ap politics
- assembly sessions
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- à° à°¸à±à°à°¬à±à°²à± సమావà±à°¶à°¾à°²à±
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- పవనౠà°à°²à±à°¯à°¾à°£à±
- à°µà±.à°à°¸à±. à°à°à°¨à±à°®à±à°¹à°¨à± à°°à±à°¡à±à°¡à°¿
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±