కత్తి కట్టినట్లు కనపడుతోంది….!!!
రాష్ట్రంలో వై.ఎస్. జగన్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో పాలనా పరంగా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభివృద్ది క్రమంలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేయాలని కూడా సీఎం జగన్ [more]
రాష్ట్రంలో వై.ఎస్. జగన్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో పాలనా పరంగా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభివృద్ది క్రమంలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేయాలని కూడా సీఎం జగన్ [more]
రాష్ట్రంలో వై.ఎస్. జగన్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో పాలనా పరంగా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభివృద్ది క్రమంలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేయాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు. నిజానికి గడిచిన 30 రోజుల పాలన విషయంలో జగన్ నిజాయితీపైనకానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలపై కానీ ఎవరికీ ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవు. ఆయన దూకుడు ఇలానే కొనసాగాలని కోరుతున్న నాయకులు కూడా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల విషయంలో జగన్ వేస్తున్న అడుగులను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. అయితే, ఇంతలోనే గత ప్రభుత్వ నిర్ణయాలు, కాంట్రాక్టుల అప్పగింత విషయంలో జగన్ వైఖరి ఒకింత రాద్ధాంతాన్నే రేపుతోంది.
ద్వేషం లేదంటూనే…..
ఒకపక్క తనకు ఎవరిపైనా వ్యక్తిగత కక్ష, ద్వేషం లేదంటూనే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కత్తికట్టినట్టుగా వై.ఎస్. జగన్ వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా.. గత ప్రభుత్వం తాలూకు నిర్ణయాల పై సమీక్ష చేయడం అనేది ఎక్కడా కనిపించదు. అందునా.. పనిగట్టుకుని ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూడడం అనేది ఎక్కడా లేదు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉంటేనే తప్ప.. ఎవరూ కూడా గత ప్రభుత్వ నిర్ణయాలపై భూతద్దాన్ని సారించరు. అయితే, ఇప్పుడు జగన్ మాత్రం తనకు చంద్రబాబుపైనా, ఇతర నాయకులపైనా కోపం లేదంటూనే వ్యవహార శైలిలో మార్పు.. పూర్తిగా కావాలనే టార్గెట్ చేస్తున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దూకుడుగా వెళ్లడం మంచిదే అయినా….
గత ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపడం అవసరమే! అయితే, మెజారిటీ విషయాల్లో జగన్ ఇలాంటి నిర్ణయం తీసు కుంటే ఎవరూ కాదనరని, కానీ, కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం వై.ఎస్.జగన్ కాస్త దూకుడుగా ముందుకు వెళుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం కూడా ఇదే తరహా చర్చ నడుస్తోంది. అయితే, అదేసమయంలో ఏపీ అభివృద్ధికి గాను జగన్ వేసే ప్రతి అడుగు కూడా కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. విభజనతో అల్లాడుతున్న రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీయడమే పనిగా కాకుండా.. ప్రస్తుత ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పరుచుకుని ముందుకు సాగాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా…..
వై.ఎస్. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లో అటు విమర్శకులతో పాటు మీడియాకు, ప్రతిపక్షాలకు ఎక్కడా చిన్న విమర్శ కూడా చేసే ఛాన్స్ ఇవ్వకుండా మంచి నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. అలాంటిప్పుడు ఈ ఒక్క విషయంలోనూ ఎవ్వరికి వేలెత్తి చూపకుండా ముందుకు వెళితే మంచిదన్న అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. మరి జగన్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.