ఇక్కడ వైసీపీ నేతలు బెదిరిపోతున్నారు.. రీజన్ ఇదేనట
పంచాయతీ ఎన్నికలు కొందరు వైసీపీ నేతలు కొంపముంచేటట్లు కన్పిస్తున్నాయి. కోరుకోకుండా వచ్చిన ఎన్నికలు కావడం, గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో మూడు జిల్లాల వైసీపీ నేతలకు పంచాయతీ ఎన్నికల [more]
పంచాయతీ ఎన్నికలు కొందరు వైసీపీ నేతలు కొంపముంచేటట్లు కన్పిస్తున్నాయి. కోరుకోకుండా వచ్చిన ఎన్నికలు కావడం, గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో మూడు జిల్లాల వైసీపీ నేతలకు పంచాయతీ ఎన్నికల [more]
పంచాయతీ ఎన్నికలు కొందరు వైసీపీ నేతలు కొంపముంచేటట్లు కన్పిస్తున్నాయి. కోరుకోకుండా వచ్చిన ఎన్నికలు కావడం, గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో మూడు జిల్లాల వైసీపీ నేతలకు పంచాయతీ ఎన్నికల జ్వరం పట్టుకుంది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా జరుగుతున్నప్పటికీ ఫలితాల అనంతరం ఎవరికి వారే విజయం తమదేనన్న క్లెయిమ్ చేసుకునే అవకాశముంది. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లా టీడీపీ నేతలు దూకుడుగా ఉన్నారు.
రాజధాని ప్రభావం….
ఈ మూడు జిల్లాలపై రాజధాని అమరావతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తమకు దగ్గరగా ఉన్న రాజధాని వేరే ప్రాంతానికి తరలి వెళ్లడాన్ని ఈ ప్రాంతాల్లో కొన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. భూముల ధరలు పడిపోవడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కోల్పోవడంతో పరోక్షంగా అనేక మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు వీరందరూ వైసీపీ కి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశముంది.
ఏకగ్రీవం చేయాలనుకున్నా…..
దీంతో ఈ మూడు జిల్లాల వైసీపీ నేతలకు పంచాయతీ ఎన్నికలు ఇబ్బందిగా మారనున్నాయి. పార్టీ హైకమాండ్ మాత్రం ఎక్కువ పంచాయతీలను కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు అల్టిమేటం జారీ చేసింది. దీంతో వీలయినంత మేర ఏకగ్రీవం చేయాలని కొందరు ప్రయత్నాలు చేశారు. చేస్తున్నారు కూడా. కానీ ఈమూడు జిల్లాల్లో టీడీపీ దూకుడుగా ఉండటంతో ఏకగ్రీవాలు కూడా పెద్దగా జరగలేదు. దీంతో ఎన్నిక అనివార్యమయింది.
ఎందుకు వచ్చాయంటూ….
ఇప్పుడు ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే అధిష్టానాన్ని ఎలా ఎదుర్కొనాలన్న యోచనలో వైసీపీ నేతలు సతమతమవుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వైసీపీ నేత అయితే నియోజకవర్గంలో వైసీపీ గెలవడం కష్టమేనని ముందుగానే ఒప్పేసుకున్నారని చెబుుతున్నారు. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతల పరిస్థితి కూడా అంతే ఉంది. ఒకరిద్దరు దూకుడుగా ఉండే వారు తప్ప మిగిలిన వైసీపీ నేతలు పంచాయతీ ఎన్నికలు ఎందుకు వచ్చాయంటూ తలలు పట్టుకుంటున్నారు.