జగన్ ఆదేశించినా అంతేనా?
ఉమ్మడి ఏపీలో ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా నష్టపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉత్తరాంధ్ర నుంచి ఎంతో మంది మంత్రులు, ఘనత వహించిన నాయకులు ఉన్నా కూడా [more]
ఉమ్మడి ఏపీలో ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా నష్టపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉత్తరాంధ్ర నుంచి ఎంతో మంది మంత్రులు, ఘనత వహించిన నాయకులు ఉన్నా కూడా [more]
ఉమ్మడి ఏపీలో ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా నష్టపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉత్తరాంధ్ర నుంచి ఎంతో మంది మంత్రులు, ఘనత వహించిన నాయకులు ఉన్నా కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ పెద్దగా వాణి వినిపించేది కాదు. ఎక్కడో హైదరాబాద్, మరెక్కడో చివరాఖరున శ్రీకాకుళం జిల్లా. దాంతో ఇక్కడ ప్రజల వెతలు చట్ట సభల దృష్టికి పోయేవేకావు. ఇక ఈ ప్రాంతంలో ఉద్దండులైన వారు ఎంతో మంది ప్రజాజీవితంలో పాలు పంచుకున్నారు. ఓ తెన్నేటి విశ్వనాధం, భాట్టం శ్రీరామమూర్తి, ద్రోణం రాజు సత్యనారాయణ వంటి వారు పార్లమెంట్ లో తమ హయాంలో ఈ ప్రాంతం గురంచి చర్చించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే తరువాత కాలంలో ఆ స్థాయిలో నాయకులు ఉన్నారా, ప్రజా సమస్యలపైన గళం విప్పుతున్నారా అంటే జనం పెదవి విరుస్తున్నారు.
ప్యాకేజీ సంగతేంటి…?
ఇక విభజన తరువాత ఉత్తరాంధ్రకు మంచి జరుగుతుందని భావించారు. సగం రాష్ట్రమైన నేపధ్యంలో సాధకబాధకాలను చాలా దగ్గరగా చూస్తారని, ప్రతి విషయం పరిష్కారం అవుతుందని అనుకున్నారు. కానీ ఆచరణలో అయిదేళ్ళ పాటు చూసుకుంటే నిరాశ మిగిలింది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర నుంచి నెగ్గిన ఎంపీల్లో నలుగురు వైసీపీకి చెందిన వారు ఉన్నారు. వీరంతా పార్లమెంట్ సమావేశాలకు వెళ్తూ ఉత్తరాంధ్ర సమస్యలు ప్రస్తావిస్తామనే చెబుతున్నారు. విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ రాజకీయాలకు కొత్త. అయినా ప్రజా సమస్యలపైన తనకు అవగాహన ఉందని ఆయన అంటున్నారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజి సాధిస్తామని చెబుతున్నారు. అలాగే ఏపీకి సంబంధిన విభజన సమస్యలకు పరిష్కారం జరిగేలా పోరాడుతామని చెప్పుకొచ్చారు.
మౌనమే భాషనా?
ఇక ఉత్తరాంధ్ర ఎంపీల విషయానికి వస్తే అందరూ ప్రజా జీవితంలో ఎంతో కొంత అనుభవం ఉన్న వారే. గిరిజన సమస్యలపైన అహరహం పోరాడిన వామపక్ష ఎమ్మెల్యే దేవుడు కుమార్తె అరకు ఎంపీ గొడ్డేటి మాధవి. అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచిన సత్యవతి ప్రజా వైద్యురాలే కాకుండా స్వచ్చంద సేవా కార్యక్రమాలు బాగా నిర్వహించి జనంలో పేరు తెచ్చుకున్నారు. విజయనగరం ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ విజయనగరం జిల్లా పరిషత్ కి కొంతకాలం చైర్మన్ గా పనిచేశారు. వీరందరికీ ఉంత్తరాంధ్ర వెనకబాటుతనం తెలుసు. ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన పూర్తిగా అవగాహన ఉంది. అయితే ఆరు నెలలుగా ఎంపీలుగా ఉన్న వీరు ఇప్పటివరకూ తమ గొంతు విప్పలేదు. ఇది జనం చెబుతున్న మాట. ఇపుడైన ప్రజా సమస్యపైన గళం విప్పితే ఎన్నుకున్న ప్రజలకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. దీని మీద ముఖ్యమంత్రి జగన్ సైతం దిశా నిర్దేశం చేశారు. అందరూ నిధులు తెస్తామని, అభివ్రుధ్ధి చేస్తామని పెద్ద మాటలు చెప్పి ఢిల్లీ విమానం ఎక్కారు. చూడాలి మరి.