ఈ ఎమ్మెల్యేలకు ఏమైంది? ఒకరిపై ఒకరు గుస్సా.. రీజనిదేనా ?
వైసీపీలో జగన్‌ను పక్కన పెడితే.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 24 మంది మంత్రులు ఉన్నారు. మిగిలిన వారు 126 మంది. అయితే.. వీరిలో సగం [more]
వైసీపీలో జగన్‌ను పక్కన పెడితే.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 24 మంది మంత్రులు ఉన్నారు. మిగిలిన వారు 126 మంది. అయితే.. వీరిలో సగం [more]
వైసీపీలో జగన్‌ను పక్కన పెడితే.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 24 మంది మంత్రులు ఉన్నారు. మిగిలిన వారు 126 మంది. అయితే.. వీరిలో సగం మంది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఒకరిని ఒకరు పలకరించుకోవడం లేదు. ఎవరికివారుగా ఉంటున్నారు. ఎవరి హడావుడిలో వారు ఉన్నారు. ఎవరైనా ఎమ్మెల్యే ఫోన్ చేసినా.. అన్నా తర్వాత చేస్తా.. అని ఫోన్ కూడా పెట్టేస్తున్నారట. ఈ విషయం ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. ఎవ్వరూ ఎందుకో అంత సంతోషంగా అయితే ఉన్నట్టే లేరన్న టాకే ఉంది. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు గుస్సాగా ఉన్నారు ? అంటే.. 126 మందిలో ఏకంగా 40 మంది కీలక ఎమ్మెల్యేలు.. మంత్రి పదవులపై కన్నేశారు.
మంత్రివర్గంలోకి…?
వీరిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖ, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా కూడా మంత్రి పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019లో జగన్ తన కేబినెట్‌ను ఏర్పాటు చేసుకునే సమయంలోనే రెండున్నరేళ్ల తర్వాత.. తన కేబినెట్లో 90 శాతం మందిని మారుస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఆ రెండున్నరేళ్ల కాలం కళ్లముందు గిర్రున తిరిగిపోతోంది. ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయి. మరో ఆరు మాసాల వ్యవధి మాత్రమే ఉంది. ఈ క్రమంలో తమకు అవకాశం దక్కించుకోవాలంటే.. తమకు అవకాశం దక్కించుకోవాలని వైసీీపీ ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలుతాము చేస్తున్నారు.
ఒకరితో మరొకరు…?
అయితే.. ఇలా మంత్రి పదవుల రేసులో ఉన్న ఎమ్మెల్యేలు.. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. కనీసం ఫోన్ చేసి పలకరించుకోవడం లేదు. ఫోన్ చేసి మాట్లాడితే.. మాటల మధ్య తమ వ్యవహారం ఏమైనా లీకవుతుందేమో.. తాము చేసుకుంటున్న ప్రయత్నాలను తోటి ఎమ్మెల్యే పసిగడతారేమో.. అని జంకుతున్నారట. దీంతో ఎమ్మెల్యేల మధ్య కొన్నాళ్లుగా మాటలు లేకుండాపోయాయి. ఒకే జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తోన్న పరిస్థితి.
కరోనా సమయంలో…?
ఎమ్మెల్యేల వ్యవహారం ఇలా ఉంటే.. ప్రజలను పట్టించుకునేందుకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు సహకరించడం లేదు. కరోనా సమయంలో తమకు అండగా లేకుండా పోయారంటూ.. ప్రజలు సదరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మంత్రి పదవుల యావలో పడి.. ప్రజలకు దూరమైతే.. కష్టమే అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా కరోనా కష్టకాలంలో కష్టపడుతోన్న వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య డబుల్ డిజిట్ కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిందే