Kuppam : కుప్పంలోనే ఆ ప్రయోగం.. అందుకేనా?
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కుప్పం మున్సిపల్ ఫలితాలలో ప్రతిబింబించేలా ఉన్నాయి. కమ్మ, కాపు ఈక్వేషన్ ను కుప్పం [more]
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కుప్పం మున్సిపల్ ఫలితాలలో ప్రతిబింబించేలా ఉన్నాయి. కమ్మ, కాపు ఈక్వేషన్ ను కుప్పం [more]
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కుప్పం మున్సిపల్ ఫలితాలలో ప్రతిబింబించేలా ఉన్నాయి. కమ్మ, కాపు ఈక్వేషన్ ను కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రయోగిస్తున్నారు. ఇక్కడ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా బలిజ సామాజికవర్గానికి చెందిన త్రిలోక్ ను చంద్రబాబు ప్రకటించారు. త్రిలోక్ గతంలో అనగానపల్లి సర్పంచ్ గా పనిచేశారు.
బ్రాహ్మణ సామాజికవర్గానికి….
అలాగే వైసీపీ ఇక్కడ మరో ప్రయోగానికి దిగింది. ఇతర సామాజికవర్గాలను ఏకం చేసేందుకు ఇక్కడ బ్రాహ్మణ సామాజికవర్గానికి మున్సిపల్ ఛైర్మన్ పదవిని కేటాయించింది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా డాక్టర సుధీర్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాపు, కమ్మేతర సామాజికవర్గాలను ఆకట్టుకునేందుకు బ్రాహ్మణ సామాజికవర్గానికి వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇచ్చి ఉంటుంది.
బలిజలను ఏకం చేసేందుకు…
కుప్పం నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు చంద్రబాబు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ప్రతి ఓటు కీలకం కావడంతో ఆయన ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా ప్రచారాన్ని ఒక విడత తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది. బలిజ సామాజికవర్గం అండగా ఉంటే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు ఆయనను ఎంపిక చేశారంటున్నారు.
మోడలాగా మారుతుందా?
ఇక వైసీీపీ కూడా ఇందుకు తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి పోట ీచేస్తాయని ప్రచారం జరుగుతుండటంతో కాపు సామాజికవర్గం ఓట్లు పెద్దగా రావని డిసైడ్ అయింది. అందుకే ఇతర సామాజికవర్గాలన్నింటినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తుంది. కుప్పం నియోజకవర్గంలో వైసీీపీ, టీడీపీ సామాజికవర్గాల ప్రయోగాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మరి కుప్పం ఫలితం రానున్న ఎన్నికలకు మోడల్ గా నిలవనుందా? అన్న చర్చ జరుగుతోంది.