లెక్కలు సరిచేస్తున్నారా? తూకం సరిపోలేదా?
కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్నాయి. ఇది ఊహించిందే. కానీ నమోదవుతున్న కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. కొన్ని చోట్ల మూడో దశకు కరోనా చేరుకుందేమోనన్న అనుమానాలు అధికారుల్లోనూ [more]
కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్నాయి. ఇది ఊహించిందే. కానీ నమోదవుతున్న కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. కొన్ని చోట్ల మూడో దశకు కరోనా చేరుకుందేమోనన్న అనుమానాలు అధికారుల్లోనూ [more]
కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్నాయి. ఇది ఊహించిందే. కానీ నమోదవుతున్న కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. కొన్ని చోట్ల మూడో దశకు కరోనా చేరుకుందేమోనన్న అనుమానాలు అధికారుల్లోనూ వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కర్నూలు, శ్రీకాళహస్తి, విజయవాడ నగరం వంటి ప్రాంతాల్లో కనెక్షన్ లేకుండా కేసులు నమోదు కావడంతో అధికారులు కూడా హైరానా పడుతున్నారు. అయితే పెరుగుతున్న కేసులు కూడా రాజకీయ రగడకు దారి తీశాయి.
కేసుల సంఖ్య పెరగడం….
కేసుల సంఖ్య పెరగడం పెద్ద విశేషమేమీ కాదని అధికార పార్టీ చెబుతోంది. తాము పరీక్షలు ఎక్కువగా చేయడంతోనే కేసుల సంఖ్య పెరగడం సర్వ సాధారణమని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. వైసీపీ నేతలు చెప్పేదాంట్లో కూడా కొంత నిజం లేకపోలేదు. ఇటీవలే కరోనా టెస్ట్ కిట్స్ తెప్పించి మరీ పరీక్షలను వేగవంతం చేశారు. రోజుకు ఐదు వేల మందికి పైగానే పరీక్షలు చేస్తున్నారు. దీంతో అనుమానితులకు పాజిటివ్ లక్షణాలు వస్తున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.
పరీక్షల కారణంగానే….
కరోనా పరీక్షలను నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రధమంగా ఉందంటున్నారు. కావాలంటే ఇతర రాష్ట్రాల లెక్కలు సరిచూసుకోమని వైసీపీ నేతలు సూచిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం లెక్కలు దాచి పెడుతున్నారని మొన్నటి వరకూ వాదించారు. ఇప్పుడు తాజాగా కేసులు పెరగడానికి వైసీపీ నేతల వ్యవహారశైలి కారణమని గట్టిగా చెబుతున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా చేస్తున్న పనులు వైరస్ వ్యాప్తికి కారణమయ్యాన్నది టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ.
పొరుగు రాష్ట్రాల మాటేమిటి?
నిజానికి ప్రతి రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏపీకి పొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణలో కూడా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో సూర్యాపేట జిల్లాలో ఈ వైరస్ భయపెడుతుంది. అక్కడ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారణమని అనగలరా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కష్టసమయంంలో ప్రజల కు ధైర్యం చెప్పడానికి, వారికి సహాయం అందించడానికే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని అధికార పార్టీ చెబుతోంది. మొత్తం మీద కరోనా లెక్కలను కూడా రాజకీయంగా సరిచేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి పార్టీలు.