Ys jagan : పట్టాభి అలా ఉపయోగపడ్డారా?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. అధికార, విపక్షాలు మాత్రమే కాకుండా రాజకీయ ఆలోచనలు ఉన్న వారు కూడా బయటకు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. అధికార, విపక్షాలు మాత్రమే కాకుండా రాజకీయ ఆలోచనలు ఉన్న వారు కూడా బయటకు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. అధికార, విపక్షాలు మాత్రమే కాకుండా రాజకీయ ఆలోచనలు ఉన్న వారు కూడా బయటకు వస్తున్నారు. అధికారంలో ఉన్న జగన్ కు రానున్న కాలంలో మరింత ఇబ్బందులు కల్పించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పటికే డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టారు. అదే తరహాలో మరికొందరు కూడా ముందుకు వస్తారని జగన్ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఎంపిక చేసుకున్న నేతలతో….
చంద్రబాబు వ్యూహాలు అన్నీ ఇలానే ఉంటాయి. కొందరు ఎంపిక చేసుకున్న నేతలను పార్టీలోకి తీసుకోక ముందు ఇలా జగన్ పై విమర్శలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. రాయలసీమ నుంచే మరో నేత కూడా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయన కూడా జగన్ పై విమర్శలు చేసిన తర్వాతే పార్టీలోకి ఎంట్రీకి చంద్రబాబు ఓకే చెబుతారన్న ప్రచారమూ జరుగుతుంది. మరికొందరు నేతలు జగన్ ను, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తారన్నది వైసీపీ నేతల అనుమానం. కాంగ్రెస్ లో ఉన్న ఒక ముఖ్యనేత సయితం జగన్ పై త్వరలోనే విమర్శలతో విరుచకుపడతారన్న వార్తలు వస్తున్నాయి.
సీన్ ఇవ్వాల్సిన అవసరం….
అందుకే పట్టాభి విషయంలో వైసీపీ అంత సీరియస్ అయిందంటున్నారు. నిజానికి పట్టాభికి అంత సీన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయాల్సిన అవసరం లేదు. కానీ వైసీపీ ఒక బలమైన సంకేతాలను పంపేందుకు పట్టాభిని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగి జగన్ ను ఏదైనా అంటే ఊరుకోబోమన్న హెచ్చరికలను వైసీపీ పంపిందనే అనుకోవాలి.
హెచ్చరికలు పంపారా?
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకే దిక్కులేకపోతే, ఇక తామెంత అని విమర్శించాలనుకున్న నేతలు వెనక్కు తగ్గే అవకాశముంది. అందుకే పట్టాభి విషయంలో అంత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం లేకపోయినా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ఇలా ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిందంటున్నారు. అందుకు పట్టాభి పార్టీకి బాగా ఉపయోగపడ్డారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దాడులకు భయపడి విమర్శలకు వెనకాడతారా? లేదా? అన్నది చూడాలి.