బెజవాడ లో ఈసారి తాడోపేడో…?
కొద్ది రోజుల వ్యవధితో ఈ నెల ఆఖరులోగా విజయవాడ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దఫా జనరల్‌కు కేటాయించారు. గతంలో టీడీపీ తరఫున కమ్మవర్గానికి చెందిన శ్రీధర్ [more]
కొద్ది రోజుల వ్యవధితో ఈ నెల ఆఖరులోగా విజయవాడ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దఫా జనరల్‌కు కేటాయించారు. గతంలో టీడీపీ తరఫున కమ్మవర్గానికి చెందిన శ్రీధర్ [more]
కొద్ది రోజుల వ్యవధితో ఈ నెల ఆఖరులోగా విజయవాడ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దఫా జనరల్‌కు కేటాయించారు. గతంలో టీడీపీ తరఫున కమ్మవర్గానికి చెందిన శ్రీధర్ మేయర్‌గా ఉన్నారు. ఈ దఫా జనరల్‌కు కేటాయించిన నేపథ్యంలో ఈ పీఠాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ జెడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం బావిస్తోంది. ఇక, వైసీపీ విషయానికి వస్తే తూర్పు నియోజకవర్గంలో గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బొప్పన భవకుమార్ కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బొప్పన నగర వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికలకు ముందు వరకు భవకుమార్ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నారు.
హోరా హోరీ పోరు….
మధ్యలో వైసీపీలోకి వచ్చిన యలమంచిలి రవి కోసం ఆయన్ను పక్కన పెట్టినా చివర్లో ఎన్నికల వేళ పీవీపీ పట్టుబట్టడంతో భవకుమార్‌కే తూర్పు సీటు దక్కింది. అయితే ఎన్నికల్లో భవకుమార్ గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. ఇక ఇప్పుడు తూర్పు నియోజకవర్గ పగ్గాలను కొద్ది రోజుల క్రితమే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్‌కు ఇచ్చారు. దీంతో అప్పుడే భవకుమార్‌కు మంచి పదవిపై హామీ వచ్చింది. ఆ వెంటనే ఆయన్ను విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇక నగరంలో బలాబలాలను గమనిస్తే టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్యే హోరాహోరీ పోరు సాగే అవకాశం కనిపిస్తోంది. జనసేన తరఫున ఎవరు పోటీకి దిగుతారు ? అనేది ఇప్పటి వరకు స్పష్టం కాలేదు., పైగా జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఎవరికి ఏ కార్పొరేటర్ స్థానం కేటాయిస్తారో తేలాల్చి ఉంది.
టీడీపీ బలంగా ఉండటంతో….
ఇదిలా వుంటే, వైసీపీకి రెండు నియోజకవర్గాల్లో బలం ఉంది. సెంట్రల్, వెస్ట్‌లో వైసీపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూడో నియోజకవర్గంలోనూ కలుపుకొని మెజారిటీ స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంటే విజయవాడ మేయర్ పీఠం వైసీపీ ఖాతాలో పడే ఛాన్సులు ఎక్కువుగా ఉన్నాయి. ఈ విషయంలో పశ్చిమలో వైసీపీకి కొంత మెరుగ్గానే రోడ్ మ్యాప్ కనిపిస్తున్నా.. సెంట్రల్ లో మాత్రం ఎమ్మె ల్యే మల్లాది విష్ణుకు టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. బొండా ఉమా మంచి దూకుడు ప్రదర్శించేందుకు రెడీగా ఉన్నారు. గత ఎన్నికల్లో సెంట్రల్ సీటులో టీడీపీ కేవలం 25 ఓట్లతోనే ఓడింది. ఇప్పటకీ అక్కడ వైసీపీ కంటే సంస్థాగతంగా టీడీపీయే బలంగా ఉంది.
రాజధాని మార్పు అంశం…..
అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి అనురాధ ఏకంగా మేయర్ రేసులో ఉన్నారు. దీంతో ఇక్కడ కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు హోరుగా సాగనుంది. పైగా తూర్పులో డామినేటెడ్ రాజకీయం చేసే కమ్మ వర్గం అండదండలు ఎక్కువగా టీడీపీకే ఉన్నాయి. మరోపక్క వైసీపీకి అండగా ఉండాల్సిన యలమంచిలి రవి పూర్తి మౌనం పాటిస్తున్నారు. తూర్పు వైసీపీలో అవినాష్, యలమంచిలి రవి, భవకుమార్ వర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ని ప్రతికూలతలు అధిగమించి వైసీపీ మేయర్ పీఠం దక్కించుకోవడం జరుగుతుందా? అనేది ప్రశ్న. ఇక రాజధాని మార్పు ప్రభావం విజయవాడలో ఎక్కువగానే ఉంది. అదే సమయంలో టీడీపీ లో నేతలు ఎవరికివారే అన్నట్టుగా ఉండడంతో ఈ పార్టీ పుంజుకుంటుందా ? అనేది కూడా సందేహమే! మరి ఏం జరుగుతుందో చూడాలి.