నాడు తిట్టిన వారే నేడు చేరువయ్యారా? ఈ టెండర్ల కథే వేరయా ?
సాధారణంగా.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. పడిపడి తిట్టుకున్న నాయకులుకూడా తర్వాత కాలంలో అవసరాల కోసం చేతులు కలిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. [more]
సాధారణంగా.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. పడిపడి తిట్టుకున్న నాయకులుకూడా తర్వాత కాలంలో అవసరాల కోసం చేతులు కలిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. [more]
సాధారణంగా.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. పడిపడి తిట్టుకున్న నాయకులుకూడా తర్వాత కాలంలో అవసరాల కోసం చేతులు కలిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా చేతులు కలిపిన నాయకులు కూడా అదే అవసరం కోసం విభేదాలు సృష్టించుకుని పక్కకు వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా అంటే.. శాశ్వత శత్రువులు-శాశ్వత మిత్రులు.. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా.. బిజినెస్లు, టెండర్లు, వాణిజ్య వ్యవహారాల వంటి వాటికి కూడా విస్తరించడం గమనార్హం.
నవయుగను నాడు….
ఉదాహరణకు.. రామాయపట్నం పోర్టు వ్యవహారమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆదిలో అంటే.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రామోజీరావు బంధువైన నవయుగ కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించడాన్ని అసెంబ్లీలోను, బయటకూడా ఎండగట్టింది. అంతేకాదు.. ముడుపుల కోసమే చంద్రబాబు ఇలా చేస్తున్నారని విమర్శించారు. కానీ, ఇదే వైసీపీ అధికారంలోకి రాగానే .. అదే నవయుగను నెత్తిన పెట్టుకున్నారు. అంతేకాదు.. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు పనులు చేసిన మేఘా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ను సైతం తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కానీ.. ఇప్పుడు మాత్రం ఈ రెండు సంస్థలు.. వైసీపీకి మిత్రులుగా మారిపోవడం గమనార్హం.
రామాయపట్నం పోర్టును….
వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ సాయిరెడ్డి అల్లుడికి వాటాలు ఉన్నాయని చెప్పుకొనే అరబిందోతో కలిసి నవయుగ ఒక కన్సార్టియంగా ఏర్పడింది. ఇది .. ఇప్పుడు ఏకంగా.. రామాయపట్నం పోర్టు పనులు దక్కించుకుంది. ప్రస్తుతం పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బెర్తుల నిర్మాణం, డ్రెడ్జింగ్పనులు, ఇతరత్రా నిర్మాణాలకు 2017-18 లెక్కల ప్రకారం రివర్స్ టెండరింగ్ నిర్వహించి రూ.2634 కోట్లకు ఖరారు చేశారు. అదేవిధంగా గతంలో తిట్టిపోసిన మేఘాకు కూడా పోలవరం పనులు అప్పగించడం గమనార్హం.
అదే సంస్థ మిత్రుడిగా….
పట్టిసీమ విషయంలో మేఘాను తిట్టిపోసిన వైసీపీ అధినేత.. సొంత మీడియాలో వ్యతిరేక ప్రచారం కూడా చేయించారు. కానీ.. ఇప్పుడు మాత్రం ఇదే సంస్థ ఆయనకు మిత్రుడుగా మారడం గమనార్హం. వెరసి.. వసూళ్లే జరిగాయో.. లేక వ్యాపార లావాదేవీలే ఉన్నాయో.. మొత్తానికి రాజకీయాల్లోనే కాదు.. వ్యాపార, వాణిజ్య వ్యవహారాల్లోనూ శాశ్వత శత్రువులు ఉండరని వైసీపీ నాయకులు నిరూపించడం గమనార్హం.