విలువలా? వల్లకాడా?
టిడిపిని పూర్తిగా డిఫెన్స్ లోపడేసే వ్యూహానికి అధికార వైసిపి పదును పెంచినట్లే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే వైసిపి రాజకీయ అడుగుల్లో వేగం [more]
టిడిపిని పూర్తిగా డిఫెన్స్ లోపడేసే వ్యూహానికి అధికార వైసిపి పదును పెంచినట్లే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే వైసిపి రాజకీయ అడుగుల్లో వేగం [more]
టిడిపిని పూర్తిగా డిఫెన్స్ లోపడేసే వ్యూహానికి అధికార వైసిపి పదును పెంచినట్లే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే వైసిపి రాజకీయ అడుగుల్లో వేగం పెరిగింది. దీనికి గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ సీన్ చూశాక ఏపీ లో రాజకీయం వేడెక్కిందనే అందరికి అర్ధమైంది. ఇదిలా ఉంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక టిడిపి లో అయితే నారాయణ స్వామి వ్యాఖ్యలు పెద్ద చర్చకు తెరలేపాయి. జగన్ ఒకే అంటే 16 మంది ఎమ్యెల్యేలు తమ పార్టీకి క్యూ కట్టేయడానికి రెడీ గా ఉన్నట్లు ఉపముఖ్యమంత్రి హాట్ కామెంట్స్ చేశారు.
మైండ్ గేమ్ ? లేదా నిజమేనా ?
రాజకీయాల్లో అసలు కంటే అసత్యాలే ఎక్కువగా ఉంటాయి. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ప్రతి పార్టీ మైండ్ గేమ్ అస్త్రాలను విరివిగా వాడుతూ ఉంటాయి. ఇప్పటికే టిడిపి లో ఒక వికెట్ డౌన్ అన్నది తేలిపోయింది. అదే బాటలో మిగిలినవారు అధికారపార్టీ ప్రసన్నం కోసం చూస్తున్నారని అందరిలోనూ అనుమానాలు వున్నాయి. కొందరు టిడిపి ఎమ్యెల్యేల వ్యవహారశైలి అనుమానాలు మరింత బలపడేలా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణ స్వామి ఇదే మంచి ముహూర్తమని గుర్తించి లీక్ విడుదల చేసి ఉంటారని విశ్లేషకులు లెక్కేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు తో బాటు చంద్రబాబు తనవారిని ఒక్కొరొక్కరిగా బిజెపిలోకి చేర్చి చివరిలో తానూ ఆ పార్టీ లో చేరతారని కూడా అన్నారు. అయితే మోడీ మాత్రం బాబు ను చేర్చుకోమని స్పష్టం చేశారని దాంతో తన వారిని ముందు కమలం లోకి పంపిస్తున్నారని పేర్కొన్నారు.
వైసిపి గేట్లు తీస్తోందా ?
విలువలు వల్లకాడు అని కూర్చుంటే వచ్చే ఎన్నికల నాటికి టిడిపి బలపడే ప్రమాదం ఉందని వైసిపి లోని ఒక వర్గం అధిష్టానంపై వత్తిడి తెస్తుందంటున్నారు. ఫలితంగా ఒక్కొక్కరిగా టిడిపి లోని ఎమ్యెల్యేలను వ్యూహాత్మకంగా ఖాళీ చేయించి చంద్రబాబు ను ఒంటరి చేసి నిలబెట్టాలన్న వాదన పెరుగుతుందిట. అయితే జగన్ ఫైనల్ గా తీసుకునే నిర్ణయం కోసమే అంతా వేచిచూస్తున్నట్లు తెలుస్తుంది. దశల వారీగా టిడిపి ఎమ్యెల్యేలను ఖాళీ చేయాలా ఒక్కసారే భారీగా పసుపు పార్టీకి వారు గుడ్ బై కొట్టించాలా అన్న చర్చ కూడా నడుస్తుంది. మొత్తానికి రాబోయే రోజుల్లో టిడిపి కి గడ్డుకాలమే అంటున్నాయి వైసిపి వర్గాలు.