ఏ పార్టీ అయినా అంతే.. అక్కడ ఎమ్మెల్యే డమ్మీనే?
కడప జిల్లా బద్వేలు రాజకీయాలు ఎప్పుడూ డిఫరెంటే. ఇక్కడ నుంచి గెలిచేది ఒకరు. అయితే.. చక్రం తిప్పేది మరొకరు అన్నది కామన్. వాస్తవానికి బద్వేలు నియోజకవర్గం ఎస్సీ [more]
కడప జిల్లా బద్వేలు రాజకీయాలు ఎప్పుడూ డిఫరెంటే. ఇక్కడ నుంచి గెలిచేది ఒకరు. అయితే.. చక్రం తిప్పేది మరొకరు అన్నది కామన్. వాస్తవానికి బద్వేలు నియోజకవర్గం ఎస్సీ [more]
కడప జిల్లా బద్వేలు రాజకీయాలు ఎప్పుడూ డిఫరెంటే. ఇక్కడ నుంచి గెలిచేది ఒకరు. అయితే.. చక్రం తిప్పేది మరొకరు అన్నది కామన్. వాస్తవానికి బద్వేలు నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. అంటే ఇక్కడ గెలిచిన వారు సర్వ స్వతంత్రంగా వ్యవహరించుకునే వెసులు బాటు ఉంటుంది. అయితే.. ఇక్కడ ఎవరు ఏ ఎస్సీ నాయకుడు ఏ పార్టీ తరఫున గెలిచినా.. డమ్మీ అభ్యర్థిగానే మారుతున్నారనే మాట వినిపిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే బద్వేల్ రాజకీయ ఆధిపత్యంలో నలిగిపోతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోతోందని నియోజకవర్గ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
గతంలో ఐదేళ్లు….
గత రెండు ఎన్నికల్లోనూ బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధిస్తోంది… 2014లో తిరువీధి జయరాములు వైసీపీ టికెట్‌పై గెలుపు గుర్రం ఎక్కారు. పలు జిల్లాల్లో మునిసిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఆయన వెనకపడ్డ నియోజకవర్గాన్ని ఎన్నో ఆలోచనలతో అభివృద్ధి చేస్తారని ఆశించారు. ఆయన గెలిచినా ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో కొద్ది రోజులు వేచి చూసి. తర్వాత టీడీపీలోకి జంప్ చేశారు. అయితే.. ఇక్కడ టీడీపీలో దివంగత యాజీ ఎమ్మెల్యే బిజివేముల వీరారెడ్డి కుమార్తె. పెత్తనం చేసేవారు. నిజానికి అధికార పార్టీలోకి జంప్ చేసినా.. జయరాములు సాధించిందేమీలేదనే టాక్ ఉండేది. ఏది చేయాలన్నా.. ఆయనను సంప్రదించేవారు కారు. పైగా.. ఆయనను కనీసం పరిగణనలోకి కూడా తీసుకునేవారు కాదు. గ్రూపు రాజకీయాలు జోరుగా సాగాయి. ఇలానే ఆ ఐదేళ్లు గడిచిపోయాయి.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి….
ఓ వైపు విజయమ్మ, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన విజయజ్యోతి, ఇటు జయరాములు ముగ్గురు గ్రూపుల గోలతో బద్వేల్ లో రాజకీయం చేశారే తప్పా ఒకే పార్టీలో ఉన్నా అభివృద్ధి శూన్యం. ఎన్నికల్లో ఓడిన విజయజ్యోతిని, గెలిచిన జయరాములును కాదని మరీ విజయమ్మ పెత్తనమే నడిచింది. ఇక, గత 2019 ఎన్నికల్లో డాక్టర్ వెంకట సుబ్బయ్యకు టికెట్ ఇచ్చి.. గెలిపించుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఆయన డాక్టర్ కావడంతో పాటు పార్టీ కూడా అధికారంలోకి రావడంతో ఈ సారి అయినా ఇక్కడ అభివృద్ధి పరుగులు పెడుతుందని అందరూ భావించారు. అయితే.. డాక్టర్ వెంకట సుబ్బయ్య కూడా డమ్మీ అయ్యారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
అన్నీ తానే అయి…..
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న శివనాథరెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నా యి. దీంతో పనుల కోసం ఎవరు వచ్చినా.. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యా.. నాదేమీ లేదు.. అంతా ఆయనే చూస్తున్నారనే కామెంట్ చేసి.. పెదవి విరుస్తున్నారట. ఇక, శివనాథరెడ్డి.. పార్టీ విషయంలోనే కాకుండా.. ఎమ్మెల్యే చేయాల్సిన పనుల విషయంలోనూ అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ఇక, పార్టీ పదవులు, పంచాయతీ ఎన్నికలు.. నిధులు.. కాంట్రాక్టులు ఇలా.. అన్నింటినీ తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారని అంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. బద్వేల్ రాజకీయాలే ఇంత! గెలిచేది ఒకరు.. చక్రం తిప్పేది మరొకరు!! అని కామెంట్లు చేస్తున్నారు.