మన పరపతి పెరుగుతుంది డ్యూడ్
ఏపీ అధికార పార్టీ వైసీపీలో సరికొత్త చర్చ తెరమీదికి వచ్చింది. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. రాష్ట్రంలో ఇక, [more]
ఏపీ అధికార పార్టీ వైసీపీలో సరికొత్త చర్చ తెరమీదికి వచ్చింది. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. రాష్ట్రంలో ఇక, [more]
ఏపీ అధికార పార్టీ వైసీపీలో సరికొత్త చర్చ తెరమీదికి వచ్చింది. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. రాష్ట్రంలో ఇక, తిరుగులేని పార్టీగా అవతరించిందనేది వాస్తవం. ఈ క్రమంలో ఇప్పటి వరకు అంతో ఇంతో తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని భావించిన నాయకులు.. ఇప్పుడు హ్యాపీగా ఫీలవుతున్నారు. వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా రెండేళ్లు పూర్తయితే.. అంతో ఇంతో వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. అయితే.. తాజా ఫలితాల్లో జగన్‌పై ఎక్కడా వ్యతిరేకత అన్నది లేక పోవడం గమనార్హం. పై నుంచి కిందకు ఏకపక్ష విజయం నమోదు చేసింది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా వైసీపీ వార్ వన్‌సైడ్ చేసేసింది.
వ్యతిరేకత ఉన్నా….
నిజానికి ఇసుక కుంభకోణం.. కొరతల కారణంగా నిర్మాణ రంగం కుదేలైంది. అదే సమయంలో టీడీపీ ఆరోపించినట్టు అన్నా క్యాంటీన్లను జగన్ ఎత్తేశారు. మూడు రాజధానుల ఎఫెక్ట్‌తో పాటు అనేకానేక కారణాలతో జగన్ ప్రభుత్వంపై సామాన్య ప్రజల్లో వ్యతిరేకత కొంతైనా ఉందన్నది వాస్తవం. అయితే ఈ వ్యతిరేకత ఓటింగ్‌లో ఎక్కడా కనపడలేదు. స్థానిక ఎన్నికల ప్రచారంలో అయితే అన్నా క్యాంటీన్ల వంటి వాటిని తాము స్థానికంలో అధికారంలోకి రాగానే తిరిగి ప్రారంభిస్తామని టీడీపీ పేర్కొంది. సామాన్యుల ఉపాధి దెబ్బతినడంతో పాటు పట్టణ ఓటింగ్ ప్రభావం చూపుతుందన్న ఆందోళన వైసీపీ వర్గాలను కూడా వెంటాడింది.
అన్నింటినీ దాటుకుని…..
అదే సమయంలో మూడు రాజధానుల విషయం కూడా వైసీపీలోకి కొందరిని కలవరపాటుకు గురిచేసింది. అయితే.. ఈ ప్రాథమిక గండాలను దాటుకుని.. వైసీపీ దిగ్విజయం సాధించింది. అయితే.. ఇప్పుడు ఈ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా అవతరించింది .. అనుకున్నా.. కేంద్రంలో పరిస్థితి ఏంటి? ఏమేరకు.. ఈ పార్టీ దూకుడుగా కేంద్రంలో చక్రం తిప్పుతుంది? అనేది కీలకంగా మారింది. గత 2019 ఎన్నికల్లో అప్రతిహత విజయం సొంతం చేసుకున్నా.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదు. తాము కూడా ఏపీలో ఎదుగుతామనే ధీమాతోనే ఉన్నారు.
వైసీపీని టార్గెట్ చేసినా…..
అయితే.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కమలం వాడిపోవడం.. ఫ్యాన్ జోరు పెరిగిన నేపథ్యంలో ఏపీకి ప్రాధాన్యం పెరుగుతుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. అటు బీజేపీ కూడా ఇక ఏపీలో వైసీపీని టార్గెట్ చేసి సాధించేది ఏం ఉండదు. వైసీపీ బలం దృష్ట్యా జాతీయ స్థాయిలో ఆ పార్టీతో అవసరాలు ఉన్న నేపథ్యంలో బీజేపీ వైసీపీకి ప్రాధాన్యం పెంచుతుందన్న ఆశలతో వైసీపీ వాళ్లు ఉన్నారు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.