రాజధాని ఎఫెక్ట్…. ఈ వైసీపీ నేతల ఫేట్ రివర్స్
గత నాలుగైదు నెలలుగా ఊరిస్తూ ఊరిస్తూ వస్తోన్న ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. జగన్ గత డిసెంబర్లో శీతాకాల అసెంబ్లీ [more]
గత నాలుగైదు నెలలుగా ఊరిస్తూ ఊరిస్తూ వస్తోన్న ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. జగన్ గత డిసెంబర్లో శీతాకాల అసెంబ్లీ [more]
గత నాలుగైదు నెలలుగా ఊరిస్తూ ఊరిస్తూ వస్తోన్న ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. జగన్ గత డిసెంబర్లో శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు రావొచ్చని అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనతో మొదలైన కలవరం ఆ తర్వాత ఎన్నో మలుపులు తిరుగుతూ సస్పెన్స్‌లా మారింది. ఎట్టకేలకు ఇప్పుడు ఈ సస్పెన్స్‌కు తెరపడింది. ఏపీలో మూడు రాజధానులకు లైన్ క్లీయర్ అయ్యింది. ఇక ఇప్పటి నుంచి ఏపీకి లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి, జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖకు తరలించే ప్రక్రియ ప్రారంభం కానుంది.
తలరాతలను మారుస్తుందా?
ఇక ఈ మూడు రాజధానులతో అటు అధికార వైఎస్సార్సీపీతో పాటు విపక్ష టీడీపీ నేతల తలరాతలను మార్చేయనుంది. ఇది ప్రతిపక్ష పార్టీల కన్నా అధికార పార్టీలో మూడు జిల్లాల నేతలు, ప్రజా ప్రతినిధులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బిల్లు అలా ఆమోదం పొందిందో లేదో వెంటనే టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇక వైఎస్సార్సీపీ అసంతృప్త ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు అయితే అమరావతిపై ప్రత్యేక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని.. నమ్మించి తడిగుడ్డతో గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి ప్లస్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. తూర్పు గోదావరిలో కూడా కొంత ప్లస్ అవుతుంది. పశ్చిమ గోదావరిలో సగం మంది అమారవతికి అనుకూలంగా ఉంటే.. మరి కొందరు వైజాగ్‌కు అనుకూలంగా ఉన్నారు.
ఈ ప్రాంత వైసీపీ నేతలకు…
అయితే ఇప్పుడు వైసీపీకి రాజధాని జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో పెద్ద ఎదురు దెబ్బ తగిలే ఛాన్సులే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లోనూ వైసీపీ తిరుగులేని సీట్లు గెలుచుకుంది. కృష్ణా, గుంటూరులో టీడీపీ కేవలం రెండేసి సీట్లతో సరిపెట్టుకుంటే వైసీపీకి తిరుగు ఉండదు అనుకున్న ప్రకాశం జిల్లాలో ఏకంగా నాలుగు సీట్లు గెలుచుకుంది. ఇక నాడు టీడీపీ మీద ఉన్న వ్యతిరేకతతో పాటు జగన్ అండ్ టీం అన్నీ కమ్మోళ్లకేనా అని చేసిన ప్రచారంతో కృష్ణా, గుంటూరులో మిగిలిన కులాల్లో మెజార్టీ శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి పడడంతో ఆ పార్టీ తిరుగులేని మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. ఇక రాజధాని మార్పు ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ రెండు జిల్లాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటి వరకు ప్రజలకు, సొంత పార్టీ నేతలకు ఏదోలా సర్ది చెప్పుకుంటూ వచ్చారు.
ఈ సీట్లలో మాత్రం……
ఇప్పుడు రాజధాని విభజనతో వీరి ఆస్తుల విలువలు పూర్తిగా పోడిపోగా.. వీరి జీవితాలు, అంచనాలు తలకిందులు అయ్యాయి. వైసీపీ గెలిచిన తాడికొండ, పొన్నూరు, చివరకు లోకేష్ ఓడిన మంగళగిరి లాంటి చోట్ల ఇప్పుడు పార్టీకి ఇబ్బందులు తప్పవు. గుంటూరు ఎంపీ సీటు మొన్నే వైసీపీ ఓడింది. విజయవాడ సీటూ గెలవలేదు. ఇక ఇప్పుడు విజయవాడ నగరంలో వైసీపీకి మరిన్ని ఇబ్బందులు తప్పవు. గుంటూరు నగరంతో పాటు తెనాలి, చిలకలూరిపేట, సత్తెనపల్లి, ప్రత్తిపాడు లాంటి నియోజకవర్గాల్లో వైసీపీ కేడర్‌తో పాటు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పైకి చెప్పుకోకపోయినా లోపల రగిలి పోతున్నారు. అలాగని పార్టీకి ఎదురు చెప్పే పరిస్థితి లేదు. దీంతో రాజధాని ఎక్కడికి వెళ్లలేదు… వికేంద్రీకరణ మాత్రమే అని సర్దిచెప్పుకుంటున్నా వైసీపీ వీరాభిమానులు సైతం స్థానిక ఎన్నికల్లో వీళ్లకు దెబ్బ కొట్టేందుకు కసితో ఉన్నారు. జగన్‌కు, వైసీపీకి ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ పడనుంది.
ప్రకాశం జిల్లాలోనూ….
ఇక గత కొంత కాలంగా జగన్ తీసుకున్న నిర్ణయంపై ఓపెన్‌గా తమ అభిప్రాయం చెప్పలేక.. తమలతో తామే రగులుతోన్న గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేలకు రేపటి నుంచి మరింత అగ్నిపరీక్ష ఖాయం. స్థానిక ఎన్నికల్లో ఎఫెక్ట్ పడితే మళ్లీ జగన్ నుంచి చీవాట్లు తప్పవు. ఇక ప్రకాశం జిల్లా ప్రజలది మరో దారి. వారికి మూడు రాజధానులు ఉన్నా అటు కర్నూలు దూరమే… ఇటు వైజాగ్ దూరమే.. అమరావతి మాత్రమే అనుకూలంగా ఉంటోంది. ఇక గుంటూరు జిల్లాకు ఆనుకుని ఉన్న నాలుగైదు నియోజకవర్గాల్లో మొన్న టీడీపీయే గెలిచింది. ఇక ఇప్పుడు జిల్లాకు చెందిన జగన్ సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులతో పాటు మిగిలిన సీనియర్ నేతలు సైతం తీవ్ర అసహనంలో ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు, కృష్ణాలో టీడీపీకి పట్టుంది.. అక్కడ కాకుండా వైసీపీకి తిరుగులేని బలం ఉన్న ఇక్కడ కూడా పరిస్థితి రివర్స్ అవ్వడాన్ని బట్టి చూస్తే రాజధాని వికేంద్రీకరణ ఈ మూడు జిల్లాలలో వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చేలా ఉంది.