గుంటూరుపై వైసీపీ నేతల పెత్తనం.. ఏం జరుగుతోందంటే?
రాజధాని ప్రాంతంగా పేరొందిన గుంటూరు నగరంపై వైసీపీ నేతలు పెత్తనం చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఇక్కడ తూర్పు, పశ్చిమ.. నియోజకవర్గాల నుంచి వైసీపీ, టీడీపీ గెలుపొందాయి. [more]
రాజధాని ప్రాంతంగా పేరొందిన గుంటూరు నగరంపై వైసీపీ నేతలు పెత్తనం చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఇక్కడ తూర్పు, పశ్చిమ.. నియోజకవర్గాల నుంచి వైసీపీ, టీడీపీ గెలుపొందాయి. [more]
రాజధాని ప్రాంతంగా పేరొందిన గుంటూరు నగరంపై వైసీపీ నేతలు పెత్తనం చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఇక్కడ తూర్పు, పశ్చిమ.. నియోజకవర్గాల నుంచి వైసీపీ, టీడీపీ గెలుపొందాయి. అయితే.. తర్వాత పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన టీడీపీ మద్దాలి గిరిని వైసీపీలోకి ఆహ్వానించారు. టెక్నికల్‌గా ఆయన టీడీపీ అభ్యర్థే అయినా.. మద్దతు పరంగా చూస్తే.. వైసీపీలో కొనసాగుతున్నారు. ఇక, ఈయనను పార్టీలోకి తీసుకువచ్చిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస్.. గుంటూరులో తరచూ పర్యటిస్తూ.. ఇక్కడ కార్యక్రమాలను చక్కబెడుతున్నారని అంటున్నారు వైసీపీ నాయకులు.
బయట నేతలే…?
ఇక, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా ఈ రెండు నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయనదే పెత్తనం అన్నట్టుగా సాగిస్తున్నారట. అదే సమయంలో జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన అంబటి రాంబాబు కూడా నగరంలో తిష్టవేసి.. తన వారికి కాంట్రాక్టులు ఇప్పించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు. అంబటి సీనియర్ కావడంతో ఆయన ఇటు గుంటూరు నగరంలో పెత్తనం చేయడంతో పాటు పక్కనే ఉన్న తాడికొండలో కూడా పెత్తనం చేస్తున్నారట. ఈ విషయంలోనే అంబటికి, తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అంతర్గత యుద్ధం నడుస్తోందంటున్నారు.
పనుల కోసం….
ఇక జిల్లా నేతలతో పాటు వైసీపీ రాష్ట్ర కార్యాలయ కార్యనిర్వాహక కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వీళ్లంతా గుంటూరుపై పెత్తనం చేయడం వెనక చాలా కారణాలే ఉన్నాయంటున్నారు. గుంటూరు నగరంలో ఇప్పుడు ప్రభుత్వం అనేక రూపాల్లో కార్యక్రమాలు చేపట్టింది. రాజధానిని తరలించేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. ఇక్కడ ఏర్పడిన వ్యతిరేకతను చల్లార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరును అభివృద్ధి చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ పనులను తమ వారికి ఇవ్వాలంటే.. తమ వారికి ఇవ్వాలంటూ.. ఇక్కడి నియోజకవర్గాలతో సంబంధం లేని ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చక్రం తిప్పుతున్నారు.
లోకల్ ఎమ్మెల్యేలు కామ్ గా…..
ఇక, తూర్పు నియోజకవర్గం నేత ముస్తాఫా.. సీనియర్ అయినప్పటికీ.. అందరిలోనూ మంచిగా ఉండాలనే లక్ష్యంతోనో.. లేక వివాదాలు ఎందుకులే అనుకుంటున్నారో.. మొత్తానికి ఆయన కూడా మౌనంగా ఉంటున్నారు. ఇక పశ్చిమంలో గిరి జంపింగ్ నేత కావడంతో ఆయన మాట లెక్క చేసేవారే లేరు. ఫలితంగా ఇక్కడ ఇతర ప్రాంతాలు, జిల్లాల నుంచి వస్తున్న వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని.. స్థానికంగా ఉన్నవారికి ఎలాంటి పనులు లభించడం లేదని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.