వీక్ నెస్ ను పట్టేసిన వైసీపీ… ఇక ఇప్పుడక్కడ?
జకీయాల్లో ఒకరి వీక్నెస్.. మరొకరికి బలం అవుతుంది. ఇప్పుడు అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోనూ ఇదే తరహా రాజకీయాలు సాగుతున్నాయి. ఇక్కడ టీడీపీ బలం సన్నగిల్లుతోంది. వాస్తవానికి [more]
జకీయాల్లో ఒకరి వీక్నెస్.. మరొకరికి బలం అవుతుంది. ఇప్పుడు అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోనూ ఇదే తరహా రాజకీయాలు సాగుతున్నాయి. ఇక్కడ టీడీపీ బలం సన్నగిల్లుతోంది. వాస్తవానికి [more]
జకీయాల్లో ఒకరి వీక్నెస్.. మరొకరికి బలం అవుతుంది. ఇప్పుడు అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోనూ ఇదే తరహా రాజకీయాలు సాగుతున్నాయి. ఇక్కడ టీడీపీ బలం సన్నగిల్లుతోంది. వాస్తవానికి హిందూపురం అంటేనే టీడీపీకి కంచుకోట. ఇక్కడ నుంచి గతంలో టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా విజయం సాధించి రికార్డు సృష్టించారు. హిందూపురాన్ని టీడీపీ అభిమానులు ముద్దుగా నందమూరి పురం అని పిలుచుకుంటారు. ఇక్కడ నుంచి ఎన్టీఆర్‌తో పాటు ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ ఇద్దరూ విజయం సాధించారు. 2014లో ఇక్కడ నుంచి ఎన్టీఆర్ వారసుడుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ పోటీకి దిగారు. ఆయన ఘన విజయం సాధించారు. ఇక, గత ఏడాది కూడా వైసీపీ సునామీ జోరుగా సాగినప్పటికీ.. బాలయ్య గెలుపును ఎవరూ అడ్డుకోలేక పోయారు.
రెండు సార్లు మాత్రమే….
ఇంత వరకు బాగానే ఉన్నా.. గడిచిన రెండు సార్లు కూడా నియోజకవర్గంలో గెలిచినప్పటికీ.. బాలయ్య నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. సినిమాలు, షూటింగులతో ఆయన హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఆయన తన ఇంచార్జ్‌గా వేరేవారిని నియమించినా గతంలో తీవ్ర వివాదాలు నడిచాయి. గత ఐదేళ్ల కాలంలో టీడీపీనే అధికారంలో ఉంది కాబట్టి ఇక్క డ అభివృద్ధి కార్యక్రమాలు నడిచాయి. కానీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఇక్కడ బాలయ్య పట్టించుకోకపోవడంతో ఎలాంటి కార్యక్రమాలూ ముందుకు సాగడం లేదు. అంతేకాదు, బాలయ్య ఇప్పటికి కేవలం రెండు సార్లు మాత్రమే ఈ పది నెలల కాలంలో ఇక్కడ పర్యటించారు. అవి కూడా తన వ్యక్తిగతం కావడంతో ప్రజల సమస్యలను ఆయన పట్టించుకోలేదు.
జగన్ ప్రత్యేక నజర్…..
దీంతో బాలయ్యను ఎందుకు ఎన్నుకున్నామా? అని ఇటీవల ఓ వర్గం రోడ్లమీదకి వచ్చి ఆందోళనలు చేసింది. ఇక, ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. సాక్షాత్తూ సీఎం జగన్ రాష్ట్రంలోని రెండు నియోజకవర్గాలపై తన దృష్టిని కేంద్రీకరించారు. వాటిలో ఒకటి చిత్తూరు జిల్లా కుప్పం. రెండు హిందూపురం. హిందూపురంలో గత ఎన్నికలకు ముందు వరకు ఇక్కడ నియోజకవర్గ బాధ్యతలు నవీన్ నిశ్చల్ చూసుకునేవారు. ఆయన గత మూడు ఎన్నికల్లో అక్కడ ఓడిపోయారు. అయినా మంచి పట్టు ఉంది.
వచ్చే ఎన్నికల నాటికి…..
ఎన్నికల వేళ జగన్ అనూహ్యంగా మైనార్టీ అస్త్రాన్ని ఇక్కడ ప్రయోగించారు. మాజీ ఐజీ మహమద్ ఇక్బాల్‌కు సీటు ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ పార్టీని పటిష్టం చేసేందుకు ఎన్నికల్లో ఓడిపోయిన మహమ్మద్ ఇక్బాల్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక్కడ పనులన్నీ కూడా ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయి. కీలకమైన వ్యవహారం సహా నిధులు కూడా ఆయనకే ఇస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో బలంగా ఉన్న బీసీల్లో కీలక నేతలకు నామినేటెడ్ లేదా కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఈక్వేషన్లు చూస్తుంటే ఇక్కడ టీడీపీ గడ్డు పరిస్థితులు ఖాయమైనట్టు అన్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలో ఇక్కడ వైసీపీ జెండా ఎగిరేలా జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టే ఉంది. మరి ఈ పరిణామాలను బాలయ్య ఎలా ఎదుర్కొంటారో ? చూడాలి.