సాగర్ ఉప ఎన్నికల్లో వైసీపీ.. రీజన్ ఇదేనా?
ఏపీ ముఖ్మమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. తెలంగాణలో పార్టీ అనేది లేదని పరోక్షంగా ఇటీవల సంకేతాలు ఇచ్చారు. ఏ ఎన్నిక తెలంగాణలో జరిగినా 2014 [more]
ఏపీ ముఖ్మమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. తెలంగాణలో పార్టీ అనేది లేదని పరోక్షంగా ఇటీవల సంకేతాలు ఇచ్చారు. ఏ ఎన్నిక తెలంగాణలో జరిగినా 2014 [more]
ఏపీ ముఖ్మమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. తెలంగాణలో పార్టీ అనేది లేదని పరోక్షంగా ఇటీవల సంకేతాలు ఇచ్చారు. ఏ ఎన్నిక తెలంగాణలో జరిగినా 2014 తర్వాత వైసీపీ తెలంగాణలో దూరంగా ఉంది. తాను కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమవుతామని, రెండు చోట్ల పార్టీ ఉంటే రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని వైసీపీ నేతలు ఇటీవల వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన సందర్భంగా చెప్పారు.
2014 తర్వాత…..
అది విని నిజమేననుకున్నారు. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లోనే వైసీపీ ఇక్కడ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానం, మూడు ఎమ్మెల్యేల సీట్లను దక్కించుకుంది. ఆ తర్వాత జగన్ దృష్టంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. తెలంగాణ పార్టీని జగన్ అసలు పట్టించుకోలేదు. అనేక ఎన్నికల సందర్భంగా ఇక్కడి నేతలు పోటీకి ప్రయత్నించినా జగన్ వారిని వద్దని తెగేసి చెప్పారు. ఇక ఇక్కడ వైసీపీ లేనట్లే అనుకోవాలని పార్టీ నేతలు కూడా చెప్పారు.
ఎందుకు బరిలోకి దిగారు?
ఇలాంటి సమయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం 12 మంది అభ్యర్థులు ఇప్పుటికే నామినేషన్ వేయగా అందులో వైసీపీ అభ్యర్థి ఒకరని రిటర్నింగ్ అధికారి చెప్పారు. ఇప్పుడు వైసీపీ పోటీపై సర్వత్రా చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే పెద్దగా అనుకోరు. అన్ని ఎన్నికల్లో అది పోటీ చేస్తూనే ఉంది. కానీ వైసీపీ నాగార్జున సాగర్ లో పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది.
జగన్ అనుమతి ఉందా?
అయితే సాగర్ ఉప ఎన్నికల్లో పోటీకి పార్టీ అధినేత జగన్ అనుమతి ఉందా? లేదా? అన్న సందేహం కూడా తలెత్తుతుంది. నిజంగా వైసీపీ పోటీ చేస్తే అది టీఆర్ఎస్ కు మేలు చేస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం ఓట్లను చీల్చేందుకు వైసీపీ ఉపయోగపడుతుందంటున్నారు. ఫలితంగా మరోసారి కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పవు. మొత్తం మీద టీఆర్ఎస్ కు మేలు చేయడానికే వైసీపీ అభ్యర్థి సాగర్ బరిలో ఉన్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరి దీనిపై వైసీపీ అధినాయకత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.