ఏడాదికే చేతులెత్తేసిన వైసీపీ ఎమ్మెల్యే..?
కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం.. నందిగామ. ఎస్సీ వర్గానికి రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో రిజర్వ్డ్ కాకముందు.. అయిన తర్వాత కూడా టీడీపీకి మంచి పట్టుంది. గతంలో ఇక్కడ [more]
కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం.. నందిగామ. ఎస్సీ వర్గానికి రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో రిజర్వ్డ్ కాకముందు.. అయిన తర్వాత కూడా టీడీపీకి మంచి పట్టుంది. గతంలో ఇక్కడ [more]
కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం.. నందిగామ. ఎస్సీ వర్గానికి రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో రిజర్వ్డ్ కాకముందు.. అయిన తర్వాత కూడా టీడీపీకి మంచి పట్టుంది. గతంలో ఇక్కడ నుంచే మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విజయం సాధించారు. ఇది ఆయనకు సొంత నియోజకవర్గం కావడంతో ఆయన మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నా నందిగామలో చీమ చిటుక్కుమన్నా ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. ఈ క్రమంలో ఇక్కడ టీడీపీకి బలమైన పునాదులు పడ్డాయి. వ్యక్తులు మారినా.. టీడీపీకి ఇక్కడ ఓటు బ్యాంకు పదిలమనే గట్టి నమ్మకం ఉంది. 1994లో దేవినేని వెంకట రమణ, 1999, 2004లో దేవినేని ఉమ విజయం సాధించారు. ఆ సమయంలో ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. దీంతో ఇక్కడ నుంచి 2009లో తంగిరాల ప్రభాకరరావు విజయం సాధించారు.
వైఎస్ హవా ఉన్నా….
వాస్తవానికి 2009లో వైఎస్ హవా కొనసాగుతోంది. అయినా కూడా దానిని సైతం తట్టుకుని ప్రభాకరరావు విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా 2014లో తంగిరాల విజయం సాధించారు. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాత కొన్ని నెలలకే ఆయన మృతి చెందారు. ఈ క్రమంలోనే తంగిరాల సౌమ్య రంగంలోకి దిగారు. బైపోల్స్లో ఆమె కూడా విజయం సాధించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇక్కడి సమస్యలపై దృష్టి పెట్టడమే కాకుండా ప్రతి ఇంటికీ తిరిగి సానుభూతిని సొంతం చేసుకున్నారు. అయితే గత ఏడాది ఎన్నికలకు ముందు మాత్రం అవినీతి ఊబిలో కూరుకుపోయారనే విమర్శలు వచ్చాయి. దీంతో గత ఏడాది ఎన్నికల్లో సౌమ్య ఓడిపోయారు.
ఏడాదిలోనే…..
గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన మొండితోక జగన్మోహన్రావు 10 వేల మెజారిటీతో విజయం సాధించారు. వాస్తవానికి 2014కు ముందు నుంచి కూడా ఈయన రాజకీయాలు చేస్తున్నారు. ఆ ఎన్నికల్లో 5 వేల ఓట్ల తేడాతో ఓడిన జగన్మోహన్రావు.. గత ఏడాది ఎన్నికల్లో సత్తాచాటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఎన్నికలతోనే ఆయన హడావుడి అయిపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఏడాది గడిచినా.. ఆయన వైసీపీ ముద్ర వేసేలా ఎలాంటి కార్యక్రమాలూ ఇక్కడ నిర్వహించలేదు. తనకంటూ బ్రాండ్ సంపాయించుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఇక నియోజకవర్గంలో యేడాది పాటు జగన్మోహన్ రావు చేసిన అభివృద్ధి శూన్యం. అలాగే యేడాది కాలంలో సెక్షన్ 3 కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్నాయన్న చర్చలు నడుస్తున్నాయి. ఇక అంతా ఎమ్మెల్యే తమ్ముడి పెత్తనమే అంటున్నారు. వైసీపీ డై హార్ట్ ఫ్యాన్స్ కూడా మాట్లాడే పరిస్థితి లేదని వైసీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.
ఎమ్మెల్యే కంటే ఎక్కువగా…..
పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడి పదవులు వచ్చినా వారు కూడా చేయడానికేం లేదని నందిగామ వైసీపీ టాక్..? నిజానికి ఇప్పటికీ నియోజకవర్గంలో ఏదైనా సమస్య వస్తే.. మాజీ ఎమ్మెల్యేనే బెటర్ అనుకునే పరిస్థితి ఉందట. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమాల్లో సౌమ్య ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. తాను ఓడిపోయినా కూడా ఎమ్మెల్యే కంటే ఎక్కువుగా ప్రజల్లో ఉంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఆమె ఇంకా నాయకుల చేతుల్లో నుంచి బయటకు రావాలన్న టాక్ అయితే ఉంది. ఏదేమైనా నందిగామ లాంటి టీడీపీ కంచుకోటలో వైసీపీ ప్రభావం నామమాత్రమన్నదే జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది.