పల్నాడుపై వ్యూహాత్మక విజయం.. వైసీపీకి ఇక శాశ్వతం…?
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోకి వచ్చే మూడు నియోజకవర్గాల్లో వైసీపీ జోరు మరింత పెరగనుందా ? ఇక్కడ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు జగన్ వేస్తున్న అడుగులు [more]
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోకి వచ్చే మూడు నియోజకవర్గాల్లో వైసీపీ జోరు మరింత పెరగనుందా ? ఇక్కడ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు జగన్ వేస్తున్న అడుగులు [more]
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోకి వచ్చే మూడు నియోజకవర్గాల్లో వైసీపీ జోరు మరింత పెరగనుందా ? ఇక్కడ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు జగన్ వేస్తున్న అడుగులు ప్రయోజనం కలిగిస్తాయా ? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. మాచర్ల, వినుకొండ, గురజాల ప్రాంతాల ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వరికపూడి సెల పథకానికి జగన్ కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది. అంతేకాదు, దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు కూడా ఈ పథకం అమలుకు కేటాయించింది. పల్నాడులోనే బాగా వెనకపడిన నియోజకవర్గాలుగా వినుకొండ, గురజాల, మాచర్లకు సాగునీరు, తాగునీరు కొరత తీవ్రంగా ఉంది. ఈ మూడు నియోజకవర్గాలకు కూడా వరికలపూడి సెల అత్యంత కీలకం. సాగు, తాగునీరు అందించే ఈ పథకాన్ని పూర్తి చేయాలని దాదాపు మూడు దశాబ్దాలకు పైగా డిమాండ్ ఉంది.
ఎన్నికల హామీగానే…..?
ఈ మూడు నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. రైతాంగం ప్రధాన డిమాండ్ కూడా ఇదే వినిపిస్తోంది. గత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి కూడా ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పూర్తి చేయాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. దీంతో ఎన్నికల్లో నేతలకు ఈ ప్రాజెక్టు ప్రధాన హామీగా ఉండేది. కానీ, ఏ ఒక్కరూ దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. 2014లో ఇక్కడ టీడీపీ గెలిచాక ఈ పథకం పూర్తి చేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ విషయాన్ని మర్చిపోయిన చంద్రబాబు ఎన్నికలకు ముందు అనూహ్యంగా జీవో తీసుకువచ్చారు. ఇక వైసీపీ గెలిచాక ఇది మళ్లీ మరుగున పడింది.
వెయ్యి కోట్ల నిధులు కేటాయించి…
ఇక వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ పథకం పూర్తి చేసే విషయంలో సీఎం జగన్ను పలుసార్లు కలిశారు. ఎట్టకేలకు జగన్ ప్రభుత్వం దీనిపై యుద్ధ ప్రాతిపదికన ముందుకు కదిలేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సుమారు 3 వేల కోట్లరూపాయలు ఖర్చు అవుతాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే దీనికి వెయ్యి కోట్ల పైచిలుకు నిధులు కేటాయించారు. వచ్చే రెండేళ్లలో దీనిని పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు.
ఈ పథకం పూర్తయితే…?
ఈ పథకం పూర్తయితే కొన్ని శతాబ్దాలుగా వెనకపడ్డ పల్నాడు ప్రాంతం సుభిక్షం అవుతుంది. దీని పూర్తి ద్వారా రైతాంగ సమస్యలే కాకుండా.. ఇక్కడి శ్రామికులకు ఉపాధి లభించనుంది. అదే సమయంలో ఇది పల్నాడులో కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందించడంతో పాటు పంట పండనుంది. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం ద్వారా వైసీపీ మరింత పుంజుకోనే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి జగన్ గురి చూసి విసిరిన బాణం పల్నాడు ప్రాంతంలో మూడు నియోజకవర్గాల్లో వైసీపీని తిరుగులేని శక్తిగా మార్చనుంది.