ఇరు వర్గాలకు పదవులు మరి పార్టీ కోసం శ్రమిస్తారా ?
నామినేటెడ్ పదవుల పందేరంలో రాజమండ్రిలోని వైసీపీలోని రెండు గ్రూప్ లకు అధినేత జగన్ న్యాయం చేసేసారు. పోటాపోటీ కార్యక్రమాలతో పాటు రాజమండ్రి సిటీ పై ఆధిపత్యం కోసం [more]
నామినేటెడ్ పదవుల పందేరంలో రాజమండ్రిలోని వైసీపీలోని రెండు గ్రూప్ లకు అధినేత జగన్ న్యాయం చేసేసారు. పోటాపోటీ కార్యక్రమాలతో పాటు రాజమండ్రి సిటీ పై ఆధిపత్యం కోసం [more]
నామినేటెడ్ పదవుల పందేరంలో రాజమండ్రిలోని వైసీపీలోని రెండు గ్రూప్ లకు అధినేత జగన్ న్యాయం చేసేసారు. పోటాపోటీ కార్యక్రమాలతో పాటు రాజమండ్రి సిటీ పై ఆధిపత్యం కోసం ఎంపి భరత్ రామ్, రాజానగరం ఎమ్యెల్యే జక్కంపూడి రాజా వర్గాలు పోరాడుతున్నాయి. వాస్తవానికి రాజమండ్రి అర్బన్ ఎమ్యెల్యే స్థానం కోల్పోయి వైసీపీ సిటీ లో అత్యంత బలహీనంగా ఉంది. టిడిపి ఎమ్యెల్యే ఆదిరెడ్డి భవాని 30 వేలకు పైగా మెజారిటీ సాధించి సైకిల్ కు రాజమండ్రిలో తిరుగులేదని చాటి చెప్పారు. ఈ నేపథ్యంలోనే వచ్చే కార్పొరేషన్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ని గట్టి దెబ్బ తీయడానికి అధినేత వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా ముందు నుంచి పావులు కదుపుతున్నారు.
డాక్టర్ ఆకుల తో మొదలు పెట్టి …
కాపు సామాజికవర్గం కోటా లో బలమైన ఆర్ధికపరిపుష్ఠి ఉండి అవినీతి మచ్చలేని మాజీ ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ను కో ఆర్డినేటర్ పదవిని జగన్ అప్పగించారు. అయితే సిటీ లో రెండు వర్గాల ఆధిపత్య రాజకీయాల్లో డాక్టర్ ఆకుల నలిగిపోతూ ఉండటంతో వారికి దూరంగా అయన తనశైలిలో కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. అలాగే అటు ఎంపి భరత్ వర్గం, ఇటు జక్కంపూడి రాజా వర్గం ఎవరికి వారే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కి నామినేటెడ్ పోస్ట్ ల భర్తీ సైతం కత్తిమీద సాముగా మారింది. రెండు గ్రూప్ లకు సమ ప్రాధాన్యత కల్పించడం ద్వారా ప్రస్తుతానికి అసంతృప్తి జ్వలలు చల్లార్చినట్లే. అయితే మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్యప్రకాశరావు కు ఈ దఫా న్యాయం చేయకపోవడం కూడా ఆ వర్గంలో అసంతృప్తి రాజేస్తోంది.
ఈక్వేషన్లు ఒకే కానీ ?
రాజమండ్రి పరిధిలో స్మార్ట్ సిటీ కి చైర్మన్ గా చందన నాగేశ్వర్, అర్బన్ అధారిటీ కి మేడపాటి షర్మిలా రెడ్డి, డిసిసిబి చైర్మన్ గా ఆకుల వీర్రాజు, రాజమండ్రి అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా గిరజాల రామకృష్ణ తులసి లకు జగన్ పదవులు ఇచ్చారు. అయితే కీలకమైన వీరేశలింగం నెలకొల్పిన హితకారిణి సమాజం చైర్మన్ గా నగరం తో అనుబంధం లేని సాకా మణి కుమారి కి అప్పగించడం చర్చనీయం కానుంది. వందల కోట్ల రూపాయల ఆస్తులు విద్యా సంస్థలు ఉన్న హితకారిణి సమాజానికి రాజకీయాలకు అతీతంగా ఉన్న వారిని పేరుమోసిన విద్యావంతులను నియమించాలని వీరేశలింగం పంతులు గారు తన వీలునామా ద్వారా స్పష్టం చేసినా అధికారం లో ఏ పార్టీ ఉన్నా ఆయన ఆశయం నెరవేర్చకపోవడం విమర్శలకు దారి తీస్తుంది.
సఖ్యత ఏర్పడుతుందా …?
వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలంటే రాజమండ్రి లోని వైసీపీ లో అన్ని గ్రూప్ లు ఒకే తాటికిందకు రావాలిసి ఉంది. అయితే ఆధిపత్య రాజకీయాల్లో ఇది సాధ్యం అయ్యే వాతావరణం ఏ మాత్రం కానరావడం లేదు. ఎవరికి వారు గ్రూప్ లు కట్టి ముందుకు వెళుతుండటం తో భవిష్యత్తులో వీరి నడుమ సఖ్యత ఏర్పడితేనే బలమైన టిడిపి కి చెక్ పెట్టె ఛాన్స్ ఉంటుందంటున్నారు క్యాడర్. రాజమండ్రి పార్టీలో ఎన్ని మార్పులు చేసినా అనైక్యత కారణంగా జగన్ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. పార్లమెంట్ సభ్యుడు అయినా కూడా ఎంపి భరత్ రామ్ స్థానిక ఎమ్యెల్యే పాత్ర ఎక్కువశాతం పోషిస్తున్నారని అంతా భావిస్తున్నారు. ఇక జక్కంపూడి వర్గం సైతం రాజానగరం లో కార్యక్రమాల కన్నా ఫోకస్ రాజమండ్రి పాలిటిక్స్ పైనే ప్రధానంగా దృష్టి పెడుతుంది. తాజాగా జక్కంపూడి వర్గం నుంచి షర్మిలా రెడ్డి రుడా చైర్మన్ గా భరత్ వర్గం నుంచి స్మార్ట్ సిటీ చైర్మన్ గా చందన నాగేశ్వర్ లు పరిపాలనలో రెండు గ్రూప్ లు గానే ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి ట్రాక్ రికార్డ్ ను వైసీపీ బ్రేక్ చేయడం అంత ఈజీ అయితే కాదన్నది విశ్లేషకుల అంచనా.