సీమ ఈసారి షాక్ ఇస్తుందా?
రాయలసీమ జిల్లాలు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతాయి? సీమ జనంలో మార్పు వచ్చిందా? ఈసారి వైసీపీకి గత ఎన్నికల మాదిరి స్థానాలు దక్కడం కష్టమా? అంటే అవుననే [more]
రాయలసీమ జిల్లాలు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతాయి? సీమ జనంలో మార్పు వచ్చిందా? ఈసారి వైసీపీకి గత ఎన్నికల మాదిరి స్థానాలు దక్కడం కష్టమా? అంటే అవుననే [more]
రాయలసీమ జిల్లాలు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతాయి? సీమ జనంలో మార్పు వచ్చిందా? ఈసారి వైసీపీకి గత ఎన్నికల మాదిరి స్థానాలు దక్కడం కష్టమా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. రాయలసీమలో వైసీపీ ఆధిక్యత కనపర్చినా గత ఎన్నికల్లో మాదిరి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు లేవంటున్నారు. రాయలసీమ ఈసారి జగన్ కు దెబ్బేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
గత ఎన్నికల్లో…?
రాయలసీమలోని మొత్తం నాలుగు జిల్లాలో 52 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో జగన్ పార్టీకి మూడు తప్పించి 49 స్థానాలు రాయలసీమ నుంచే దక్కాయి. కర్నూలు, కడప జల్లాలు క్లీన్ స్వీప్ చేశాయి. అనంతపురంలో రెండు స్థానాలు, చిత్తూరు లో ఒక్క స్థానం మినహా అన్ని నియోజకవర్గాలు గత ఎన్నికల్లో వైసీపీకే దక్కాయి. అందువల్లనే జగన్ కు భారీ మెజారిటీ లభించింది. అయితే ఈసారి వైసీపీకి రాయలసీమలో క్లీన్ స్వీప్ చేయడం కష్టమేనంటున్నారు.
నేతల మధ్య విభేదాలు…
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. తాడిపత్రి మున్సిపాలిటీని జేసీ బ్రదర్స్ కైవసం చేసుకున్నారు. అదే మాదిరి కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపాలిటీలో ఒకరకంగా టీడీపీకి విజయం దక్కినట్లే. దీంతో పాటు సీమలో వైసీపీ నేతల మధ్య గ్రూపు విభేదాలు కూడా ఈసారి పార్టీని ఇబ్బంది పెట్టనున్నాయని చెబుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు పడటం లేదు. ఎంపీలకు, ఎమ్మెల్యలేకు మధ్య దూరం పెరిగింది.
క్లీన్ స్వీప్ చేసే…?
నేతల మధ్య సమన్వయం లేకపోవడం, క్యాడర్ లో అయోమయంతో పాటు రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. కడప జిల్లాను పక్కన పెట్టినా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీకి ఈసారి గణనీయమైన స్థానాలు దక్కుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. కర్నూలు, కడపల్లోనూ ఈసారి వైసీపీ క్లీన్ స్వీప్ చేేసే అవకాశాలు లేవు. ఇప్పటికైనా జగన్ రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే అక్కడ ఈసారి ఫలితాలు రివర్స్ అయ్యే అవకాశాలున్నాయని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.