అక్కడ వైసీపీకి దిక్కెవరు… ?
వైసీపీ అధికారంలోకి రావడానికి అతి పెద్ద భుజం కాసింది ఉత్తరాంధ్ర. ఈ మూడు జిల్లాలూ జగన్ వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవడంతోనే ఆయనకు సీఎం కుర్చీ దక్కింది. [more]
వైసీపీ అధికారంలోకి రావడానికి అతి పెద్ద భుజం కాసింది ఉత్తరాంధ్ర. ఈ మూడు జిల్లాలూ జగన్ వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవడంతోనే ఆయనకు సీఎం కుర్చీ దక్కింది. [more]
వైసీపీ అధికారంలోకి రావడానికి అతి పెద్ద భుజం కాసింది ఉత్తరాంధ్ర. ఈ మూడు జిల్లాలూ జగన్ వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవడంతోనే ఆయనకు సీఎం కుర్చీ దక్కింది. ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రలో ఇంతలా ఏకపక్షంగా ఒకే పార్టీకి ఓటేసిన పరిస్థితి కూడా ఎపుడూ లేదు. అంతటి ఎన్టీయార్ హయాంలో కూడా ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ బాగానే సీట్లు దక్కించుకుంది. అలాంటిది 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ దాదాపుగా అన్ని సీట్లూ గెలుచుకుంది. మళ్ళీ అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా అంటే డౌటే. అదే కాదు మెజారిటీ సీట్లు అయినా వస్తాయా అంటే వైసీపీ ఇప్పటి నుంచే చాలా చేయాల్సి ఉంది మరి.
నాన్ లోకల్ కార్డ్…
ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇంచార్జిగా జగన్ విజయసాయిరెడ్డిని నియమించారు. ఆయన పార్టీ కోసం బాగానే చేస్తున్నారు కానీ నాన్ లోకల్ కార్డు అడ్డుగా ఉంది. ఆయన మీద ఈజీగా టీడీపీ విమర్శలు చేస్తోంది. ఎక్కడ నుంచో వచ్చి విశాఖలో దందాలు చేస్తున్నారంటూ ఘాటుగానే ఆరోపిస్తోంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా వైసీపీ బాగా ఇబ్బంది పడుతోంది. కడప రెడ్లు, పులి వెందుల రాజకీయం అంటూ టేడీపీ దూకుడుగా చేస్తున్న కామెంట్స్ కి జవాబు చెప్పుకోలేకపోతోంది. ఇక వైసీపీలో కూడా సీనియర్లు మేము ఇంతమంది ఉండగా విజయసాయిరెడ్డి ఎందుకు కీలక బాధ్యతలు అన్నట్లుగా గుర్రుగా ఉన్నారు. దాంతో ఇపుడిపుడే వైసీపీ అధినాయకత్వం మేలుకుంటోంది. స్థానిక నాయకుల మద్దతు లేనిదే రాజకీయాలు చేయలేమని కూడా భావిస్తోంది.
సీనియర్లకే పట్టం …
ఇక వైసీపీ హై కమాండ్ పార్టీ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేస్తోంది. ముందు పార్టీ పదవులను పంచడం ద్వారా వైసీపీలో సీనియర్లకు న్యాయం చేయాలని అనుకుంటోంది. అలా ప్రాంతీయ ఇంచార్జిలను కూడా కొత్త వారిని స్థానికులను నియమించాలని చూస్తోంది. అదే సమయంలో ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా ఈ మూడు జిల్లాల్లో ఉన్న సీనియర్ నేతలను చూసి అప్పగించాలని ఆలోచిస్తున్నారుట. మరి ఆ పదవి కోసం ధర్మాన క్రిష్ణ దాస్ పేరు పరిశీలనలో ఉందని అంటున్నారు. ఆయన జగన్ కి పూర్తి విధేయుడుగా ఉంటున్నారు. అప్పగించిన బాధ్యతలను ఆయన చాలా జాగ్రత్తగా చేస్తారని పేరు. ప్రత్యర్ధి పార్టీలతో లాలూచీలు ఎరగని నాయకుడిగా కూడా ఉంటారని అంటారు. ఆయనతో పాటు ప్రస్తుత మంత్రులు, మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నారుట.
మూడింటినీ ఒకటి చేసి….
ఇక ఏ జిల్లాకు ఆ జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నా మూడు జిల్లాలను ఒకటిగా చేసి ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉండడం అంటే సాధ్యమయ్యే విషయమా అన్నది చర్చగా ఉంది. ఒకే పార్టీలో ఉన్నా బొత్స సత్యనారాయణ అంటే ధర్మాన ప్రసాదరావుకు పడదు, ఇక విశాఖలో బొత్స వేలుపెడితే కొందరికి గిట్టదు, ధర్మాన కుటుంబం అంటే శ్రీకాకుళంలోని వైసీపీలోనే కొందరికి అసలు పడదు. ఇలాంటి వేళ ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా మెజారిటీ జనాలకు ఆమోదయోగ్యమైన వారిని ఎంపిక చేయడం కత్తి మీద సాము అని అంటున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఎలా అలోచిస్తారో చూడాలి. ఏది ఏమైనా గత కొన్నేళ్ళుగా వైసీపీ లోకల్ టాలెంట్ ని అధినాయకత్వం పక్కన పెట్టింది. దాని వల్లనే ఇపుడు నాయకత్వ సమస్య పెద్దదిగా కనిపిస్తోంది అంటున్నారు.