ఇక, అక్కడ వైసీపీలో ఒక్కరి వాయిసే వినపడుతుందట
విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీలో చిత్రమైన సంఘటన చోటు చేసుకుందని ప్రచారం జరుగు తోంది. ఇక్కడ నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్న దేవినేని అవినాష్‌కు, విజయవాడ వైసీపీ ఇంచార్జ్‌గా [more]
విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీలో చిత్రమైన సంఘటన చోటు చేసుకుందని ప్రచారం జరుగు తోంది. ఇక్కడ నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్న దేవినేని అవినాష్‌కు, విజయవాడ వైసీపీ ఇంచార్జ్‌గా [more]
విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీలో చిత్రమైన సంఘటన చోటు చేసుకుందని ప్రచారం జరుగు తోంది. ఇక్కడ నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్న దేవినేని అవినాష్‌కు, విజయవాడ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న బొప్పన భవకుమార్‌కు మధ్య కొన్నాళ్లుగా మనస్పర్థలు నడుస్తున్నాయి. తన సొంత నియోజకవర్గాన్ని దేవినేనికి అప్పగించడంపై భవకుమార్ ఒకింత మనస్థాపంతో ఉన్నారు. అయినప్పటికీ పార్టీ అధినేత జగన్ ఆదేశాలను కాదనలేక పోతున్నారు. పైగా పార్టీలోని కీలక నాయకులు కూడా.. ఎలాగూ నువ్వు విజయవాడ ఇంచార్జ్‌గా ఉన్నావు కాబట్టి ఇది నీకు చిన్న విషయం అని సరిపుచ్చుతున్నారు.
పారిశ్రామికవేత్తలు సయితం….
మరోపక్క దేవినేని అవినాష్.. తన సత్తా నిరూపించుకునేందుకు దూకుడుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నియోజకవర్గంలో లాక్‌డౌన్‌కు ముందు జోరుగా పర్యటించారు. ఇప్పుడు కూడా నియోజకవర్గంలో పర్యటించకపోయినా.. దాతలను సమీకరించి నిధులు అందించేలా చూస్తున్నారు. ఫలితంగా ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి పెరిగింది. మరోపక్క అవినాష్ పిలుపుతో సాయం చేసిన పారిశ్రామిక వేత్తలు.. బొప్పన ఫోన్‌కు స్పందించడంలేదట. కరోనా ఎఫెక్ట్ తర్వాత దేవినేని అవినాష్ ఇప్పటికే రెండు సార్లు సీఎంను కలిసి దాతలను ఆయన వద్దకు తీసుకు వెళ్లి విరాళాలు ఇప్పించారు.
సర్ది చెప్పే ప్రయత్నం చేసినా…..
విజయవాడ ఇంచార్జ్‌గా ఉన్న బొప్పన మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారిగా కూడా విరాళాలు ఇప్పించలేక పోయారు.ఈ పరిణామం బొప్పన వర్గాన్ని ఇబ్బందిపెడుతోంది. ఇప్పటికే బొప్పన నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉండడంతో పాటు మేయర్ పదవి కూడా వైసీపీ నుంచి ఆయనకే దక్కుతుందన్న ప్రచారం నేపథ్యంలో తూర్పు వైసీపీలో ఆధిపత్య రాజకీయాలు పెరిగిపోతున్నాయి. దీంతో విషయం తెలిసిన వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైసీపీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డిలు మధ్యేమార్గంగా ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారట.
తూర్పు కు మాత్రం….
ఈ క్రమంలోనే రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ఇకపై తూర్పు నియోజకవర్గానికి సంబంధించి అన్నీ కూడా దేవినేని అవినాష్ చూసుకుంటాడని, ఓవరాల్‌గా నగర పార్టీ అధ్యక్షుడి హోదాలో నగరం అంతా పార్టీ వ్యవహారాలు మాత్రం బొప్పన చూసుకోవాలని చెప్పినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంటే.. ఇకపై తూర్పు వ్యవహారాల్లో ఎవరో ఒకరే స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ సర్దుబాటు ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.