ఈ ఎమ్మెల్యే ఖచ్చితంగా మంత్రి అవుతారట.. ఆయనే చెబుతున్నారు
నెల్లూరు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సీనియర్ నాయకుడు, కొన్నాళ్ల కిందట సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాలో నిలిచిన నాయకుడి [more]
నెల్లూరు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సీనియర్ నాయకుడు, కొన్నాళ్ల కిందట సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాలో నిలిచిన నాయకుడి [more]
నెల్లూరు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సీనియర్ నాయకుడు, కొన్నాళ్ల కిందట సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాలో నిలిచిన నాయకుడి గురించి ఇప్పుడు హాట్ టాపిక్ ఒకటి నడుస్తోంది. వైసీపీలోనే ఈయన డిఫరెంట్ గురూ అనే రేంజ్లో ఆయన రాజకీయాలు చేస్తున్నారట. జీవితంలో ఒక్కసారైనా మంత్రి అవ్వాలనేది ఈయన ఆశ. ఈ క్రమంలో ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలించడం లేదు. దీంతో తన పనితాను చేసుకుని పోతున్నారు. అయితే.. ఇదేదో ప్రజలకు, ప్రభుత్వానికి మేలు చేసేది కాదని.. తన సొంత పనులని అంటున్నారు పార్టీ నేతలు.
వ్యాపార వర్గాల నుంచి సేకరించి…..
ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్న వైసీపీ నేతల్లో ఈయన.. కీలకంగా కనిపిస్తున్నారు. ఇటీవల తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కోసం.. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి.. నిధులు సర్దుబాటు చేయాలని.. పార్టీ కోరింది. దీంతో ఈయన కొంత మొత్తం ఇచ్చారు. కానీ, దీనికి సంబంధించి ఆయన సొంత నిధులు కాకుండా.. వ్యాపార వర్గాల నుంచి సేకరించారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇందులో తప్పేముంది.. ఏ పార్టీ నేతలైనా సొంత జేబుల్లోంచి ఇవ్వరు కాబట్టి.. ఈయన చేసింది తప్పుకాదు. కానీ, వీరికి పెద్ద హామీ ఇచ్చారు. వచ్చే మంత్రి వర్గ ప్రక్షాళనలో తనకు మంత్రి పీఠం ఖాయమని.. అప్పుడు మీ కోరికలన్నీ.. నెరవేరుస్తానని.. ఆయన హామీ ఇచ్చారట.
అప్పుడే ప్రచారం….
ఈ హామీపై నమ్మకంతోనే కొందరు ఇచ్చారు. మరికొందరు చేతులు ఎత్తేసి.. కరోనా పేరు చెప్పి తప్పించుకున్నారు. కానీ, ఇప్పుడు ఈయనకు పదవి దక్కే అవకాశం లేదని.. ఈ విషయం తెలిసిన మరో వైసీపీ నాయకుడు.. ఒకరు సైలెంట్‌గా విషయాన్ని లీక్ చేశారు. దీంతో వ్యాపార వర్గాలు లబోదిబో మంటున్నాయి. పైకి చెప్పుకోలేక.. అలాగని నేరుగా వెళ్లి వైసీపీ ఎమ్మెల్యేను అడగలేక.. ఇబ్బంది పడుతున్నాయి. ఇక, ఈ యాంటీ ప్రచారం తెలిసిన సదరు ఎమ్మెల్యే.. మళ్లీ తన పదవిపై అదే మాట చెబుతున్నారు.
ఆశ మంచిదే కాని…?
నాకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది.. రాకపోవడానికి నాదగ్గరమీ రీజన్లు లేవు.. అంటున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ నెల్లూరులో హాట్ హాట్‌గా మారింది. కొందరు ముసిముసిగా నవ్వుతుంటే.. మరికొందరు ఆశ పెట్టుకోవడం తప్పుకాదు.. అంతా వైసీపీ అధినేత జగన్ చేతుల్లో ఉంటుందని అంటున్నారు. అయితే.. ఇంకొందరు మాత్రం వస్తుందో రాదో తెలియని పదవి కోసం.. ఇప్పుడే వసూళ్లు చేయడం సమంజసమా ? అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయం చివరకు ఎటు దారితీస్తుందో చూడాలి.