ఈ వసూళ్లు.. వైఎస్ ఆత్మను తృప్తి పరుస్తాయా..?
వసూళ్లు..! ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ వసూళ్ల పర్వంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే.. తీవ్ర స్థాయిలో నెటిజన్లు దుమ్మెత్తి [more]
వసూళ్లు..! ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ వసూళ్ల పర్వంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే.. తీవ్ర స్థాయిలో నెటిజన్లు దుమ్మెత్తి [more]
వసూళ్లు..! ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ వసూళ్ల పర్వంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే.. తీవ్ర స్థాయిలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ వసూళ్ల పర్వం వెనుక కొందరు మంత్రులు కూడా ఉన్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇలా అయితే.. వైఎస్ ఆత్మ శాంతిస్తుందా ? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని పరిస్తితి వస్తోందని.. వైసీపీ సానుభూతి పరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే.. ఈ నెల 8న వైఎస్ జయంతి కార్యక్రమం ఉంది.
రైతు దినోత్సవం…..
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావడం, అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ రెండేళ్ల కాలంలో అముల చేయడం.. ముఖ్యంగా పేదలకు ఇళ్లు, పింఛన్లు, వాహన మిత్ర, ఇంటింటికీ వలంటీర్.. వంటి వినూత్న పథకాలతో దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. ఎన్ని విమర్శలు, లోపాలు ఉన్నా సంక్షేమం విషయంలో జగన్కు మంచి మార్కులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతు దినోత్సవం పేరిట వైఎస్ జయంతిని కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం అన్ని జిల్లాల ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి నియోజకవర్గంలోనూ చేసిన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా అప్ లోడ్ చేయాలని నిర్దేశం చేసింది.
టార్గెట్లు పెట్టి మరీ…..
దీంతో వైసీపీ ఎమ్మెల్యే లు ఈ కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించేందుకు రెడీ అయ్యారు. కానీ, ఇప్పుడు.. ఇదే కార్యక్రమం పార్టీని విమర్శల పాలు చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలన్న పార్టీ అధిష్టానం .. ఎవరికీ రూపాయి ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేలు.. వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా మందికి టార్గెట్లు కూడా పెట్టారని.. విమర్శలు వస్తున్నాయి. దీంతో సదరు వ్యాపారులు ఈ విషయాన్ని టీడీపీ నేతలకు ఉప్పందించడంతో వారు సోషల్ మీడియాలో వైసీపీ నేతల వైఖరిని దుయ్యబడుతున్నారు.
సోషల్ మీడియాలో…
వసూళ్ల పర్వంతో వైసీపీ ముందుకు సాగుతోందని, ఇలా అయితే.. వైఎస్ ఆత్మ శాంతిస్తుందా ? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. కొందరు మంత్రులు స్వయంగా ఎమ్మెల్యేలకు టార్గెట్లు విధించారని కూడా ఆరోపణలు వినిపిస్తుండడం గమనార్హం. ఇక, మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ఈ కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఖర్చు పెరిగిపోయి. ఇక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అధికారుల నుంచి కూడా వసూళ్ల పర్వం సాగిస్తున్నారట. ఏదేమైనా ఇలాంటి చర్యలే పార్టీ, ప్రభుత్వ పరువును దిగజార్చేస్తాయనడంలో సందేహం లేదు.