ఎమ్మెల్యేల కొంప ముంచుతుంది వాళ్లేనట
జగన్ మానస పుత్రిక లాంటి వ్యవస్థ అది. జగన్ పాదయాత్ర సందర్భంగా జనాలకు ఈ వ్యవస్థ గురించి జగన్ చెబితే ఆ పార్టీ నాయకులు సైతం స్వాగతించారు. [more]
జగన్ మానస పుత్రిక లాంటి వ్యవస్థ అది. జగన్ పాదయాత్ర సందర్భంగా జనాలకు ఈ వ్యవస్థ గురించి జగన్ చెబితే ఆ పార్టీ నాయకులు సైతం స్వాగతించారు. [more]
జగన్ మానస పుత్రిక లాంటి వ్యవస్థ అది. జగన్ పాదయాత్ర సందర్భంగా జనాలకు ఈ వ్యవస్థ గురించి జగన్ చెబితే ఆ పార్టీ నాయకులు సైతం స్వాగతించారు. చాలా గొప్పగా ఉంటుందని, జన్మభూమి కమిటీల్లాగా తమకు కూడా ఒక బలమైన తాబేదారు వ్యవస్థగా మారుతుందనుకున్నారు. కానీ తీరా ఏడాది దగ్గరవుతున్న వాలంటీర్ల వ్యవస్థ ఇపుడు ఏకంగా ఎమ్మెల్యేల అధికారాలకే ఎసరు పెట్టేలా ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేలు ఇపుడు ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నారు. అసలైన పవర్లు అన్నీ వాలంటీర్ల వద్దకే ఉన్నాయి.
ఏమైనా వారే…?
ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, పించన్ మంజూరు చేయాలన్నా, సంక్షేమ పధకాలు అందుకోవాలన్నా కూడా వాలంటీర్లే ఇపుడు అతి ముఖ్యం. పైగా వారే జనాలకు నేరుగా పరిచయం. ప్రతీ గడపా వారికే తెలుసు. వారు తలచుకుంటేనే ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా కదిలేది. అన్నింటికీ మించి జగన్ సైతం వారినే నమ్ముతున్నారు. ఇటీవల కరోనా వైరస్ వేళ వారు చేసిన సేవ అపూర్వమని జగనే మెచ్చుకున్నారు. నేరుగా జనాల ఇళ్ల వద్దకు వెళ్ళి నగదు పంచుతున్న వాలంటీర్లు ప్రజలకు దేవుళ్ళు అయిపోతున్నారు. ప్రజలు కూడా వారినే కలసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వారితో పోలిస్తే ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ నాయకులు తీసికట్టుగా ఉన్నారు.
దందాలు అలా….?
ఇక వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, ఇతర నాయకులు కానీ దందాలు చేసినా మరే విధమైన అక్రమాలకు పాల్పడినా కూడా వాలంటీర్లకు ఇట్టే తెలిసిపోతోంది. ప్రతీ యాభై గడపలకు ఒక వాలంటీరు ఉండడం వల్ల వారిని దాటుకుని ఏ పని కూడా ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు కానీ చేయలేని పరిస్థితి. వారి కన్నుగప్పడం కూడా దాదాపుగా అసాధ్యమైపోతోంది. దాంతో క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలు నాయకులు చేసే ఇసుక దోపిడీ అయినా, ఇతర అక్రమ వ్యాపారాలు అయినా కూడా వలంటీర్ల ద్వారా నేరుగా సమాచారం క్షణాల్లో సీఎం కి చేరిపోతోంది. దాంతో వైసీపీ ఎమ్మెల్యేలకు స్వేచ్చ లేకుండా పోతోందిట.
అదే అసంతృప్తి …
ఇక వైసీపీ ఎమ్మెల్యేలు ఈ మధ్య గొంతు లేపుతున్నారు. తమ బాధను జనం బాధగా మార్చి బుసలు కొడుతున్నారు. దాని వెనక వాలంటీర్ల వ్యవస్థ వల్ల చేతులు కట్టేసినట్లుగా అయిపోతోందన్న బాధ ఉందని అంటున్నారు. గత టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలు, నాయకులు, జన్మభూమి కమిటీలు కలిపి దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇపుడు వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ సదుపాయం లేకుండా పోతోంది. కనీసం తమ సొంత పనులు చేసుకోవాలన్నా కూడా అన్నింటికీ గ్రామ సచివాలయం వ్యవస్థ కన్ను పడుతోంది. ఇంత దగ్గరగా గ్రామాలకు ప్రభుత్వ వ్యవస్థను చేర్చడం వల్ల అక్కడ చిటికేస్తే చాలు డైరెక్ట్ గా జగన్ కి వినిపించేస్తోంది. దాంతో గెలిచి ఏడాది అయినా ఒక్క పనీ చేసుకోలేకపోతున్నమన్న బాధ ఓ వైపు, వాలంటీర్లతో తమకు జనం నుంచి గౌరవం లేదని, ఏ సమస్యా మీద వారు తమ వద్దకు రావడమే మానుకున్నారన్న ఆవేదన మరో వైపు వైసీపీ ఎమ్మెల్యేలలో గూడు కట్టుకున్నాయట.