ఈ వైసీపీ ఎంపీకి సైకిల్ పార్టీతో ఆ సరదాలేంటి?
ఆయన ఉత్తరాంధ్రలో అధికార వైసీపీ ఎంపీ. ఆయన ఇపుడు వైసీపీ హై కమాండ్ కళ్ళల్లో పడుతున్నారు. అలా ఇలా కాదు కాస్తా ఎర్రగానే హై కమాండ్ ఆయన [more]
ఆయన ఉత్తరాంధ్రలో అధికార వైసీపీ ఎంపీ. ఆయన ఇపుడు వైసీపీ హై కమాండ్ కళ్ళల్లో పడుతున్నారు. అలా ఇలా కాదు కాస్తా ఎర్రగానే హై కమాండ్ ఆయన [more]
ఆయన ఉత్తరాంధ్రలో అధికార వైసీపీ ఎంపీ. ఆయన ఇపుడు వైసీపీ హై కమాండ్ కళ్ళల్లో పడుతున్నారు. అలా ఇలా కాదు కాస్తా ఎర్రగానే హై కమాండ్ ఆయన వైపు చూస్తోందట. ఇంతకీ ఆ ఎంపీ గారు చేసిన నేరమేంటి అంటే ఆయన కూడా గోదావరి జిల్లాల రాజు గారి రూట్లోనే వెళ్తున్నాడు. అయితే రాజు గారిలా నోరు పారేసుకోవడంలేదు. అంత వాక్చాతుర్యం కూడా లేదు, పైగా రాజకీయ అనుభవమూ లేదు, అందుకే రాజుగారు గెలిచి ఢిల్లీలో అధికారంలో ఉన్న కాషాయంతో దోస్తీ చేస్తే ఈ ఎంపీ గారు ఓడిన పసుపు పార్టీతో చెట్టాపట్టాలు వేస్తున్నారుట. పైగా వారితో వ్యాపార బాంధవ్యాలు పెనవేసుకుంటున్నారుట.
మండుతోందిగా…?
నిజమే కదా. అసలు రాజకీయ ఉనికీ, ఊసూ లేని ఆ ఎంపీగారిని పార్టీలోకి తెచ్చి టికెట్ ఇప్పించాక ఇలా తొండ ముదిరి ఊసరవెల్లిలా మారితే మండిపోదూ. పార్టీలో పెద్ద తలకాయ, ఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ ఇంచార్జి విజయసాయిరెడ్డికి అలా ఇపుడు మండుకుపోతోందిట. ఆయన వ్యవహార సైలి తొలి ఆరు నెలలూ బాగానే ఉన్నా ఆ తరువాత కధ అడ్డం తిప్పారుట. రివర్స్ గేరులో వెళ్తూ సైకిల్ పార్టీతో సరదాలు చేస్తున్నారని ప్రచారం అయితే సాగుతోంది. ఇంతకీ ఆ ఎంపీ గారికి వ్యాపార యావ తప్ప పార్టీ గురించిన తపన లేదు. పైగా ఆయనకు ఈ ఎంపీ పదవి అనుకోని వరంగా దక్కింది. దాంతో ఆయన దాన్ని బాగా వాడేసుకుంటున్నారని టాక్.
నిఘా పెట్టారా…?
ఈ ఎంపీగారికి రాజకీయం వంటబట్టింది కానీ పార్టీ నిబంధనలు మాత్రం అసలు పట్టడంలేదు. అందుకే ఆయన్ని మెల్లగా పార్టీ సైడ్ చేస్తోందని ఇన్నర్ సర్కిల్స్ లో న్యూస్. ఆ ఎంపీ కూడా ఈ మధ్య పార్టీలో సందడి చేయడం చాలా తగ్గించేశారని అంటున్నారు. ఆయనకు కూడా తెలిసిపోయింది తాను వన్ టైం ఎంపీనని, ఇది చాలు, మరో నాలుగేళ్ళు కళ్ళు మూసుకుని తన పని తాను కానిచ్చేద్దామనే అనుకుంటున్నారుట. పైగా ఆయన ఇపుడు తన ఎంపీ పలుకుబడితో తాను బాగుపడుతూ తన సామాజికవర్గానికి చెందిన పసుపు పార్టీ వారి కోసం కూడా అధికారం ఉపయోగిస్తున్నారుట. దీంతో చిర్రెత్తుకువచ్చిన హై కమాండ్ ఆయన మీద నిఘా పెట్టిందని అంటున్నారు.
బ్యాడ్ చేస్తూ …..
ఇక ఎంపీ విజయసాయిరెడ్డి మీద ఈ మధ్య వరసగా సోషల్ మీడియాలో వచ్చీన్ బ్యాడ్ పోస్టులు ఒక ఎత్తు అయితే ఆయన మీద టీడీపీ అనుకూల మీడియాలో రాయిస్తున్న రాతల వెనక కూడా తెలుగుదేశం నేతలు ఉన్నారని అంటున్నారు. అటువంటి వారికి ఉప్పందించేలా సదరు వైసీపీ ఎంపీ దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఆయన్ని మొదట్లో బాగా ఎంకరేజ్ చేసిన విజయసాయిరెడ్డి ఇపుడు ఆయన్ని చాలా దూరం పెట్టారని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం జగన్ దృష్టిలోకి వెళ్ళిందని తెలుస్తోంది. అందుకే ఆయనకు కనీసం అపాయింటెమెంట్ కూడా అధినేత ఇవ్వలేదని చెవులు కొరుక్కుంటున్నారు. మరి జగన్ ఆగ్రహం ఏంటో గోదావరి జిల్లాల రాజు గారు చూస్తున్నారు. ఇపుడు ఈ ఎంపీ గారు కూడా చూడాలనుకుంటున్నారా అన్నదే ఇపుడు వైసీపీలో హాట్ హాట్ హాట్ చర్చ.