ఈ ఇద్దరూ సెలైంట్ గానే సేఫ్ జోన్ లో ఉన్నారట
కడప ఎంపీ, యువ నాయకుడు, జగన్‌కు కజిన్ వైఎస్ అవినాష్‌రెడ్డి నియోజకవర్గంలో కనిపించడం లేదనే వ్యాఖ్యలు వస్తున్నాయి. వరుస విజయాలు సాధించిన అవినాష్ రెడ్డి 2014, 2019 [more]
కడప ఎంపీ, యువ నాయకుడు, జగన్‌కు కజిన్ వైఎస్ అవినాష్‌రెడ్డి నియోజకవర్గంలో కనిపించడం లేదనే వ్యాఖ్యలు వస్తున్నాయి. వరుస విజయాలు సాధించిన అవినాష్ రెడ్డి 2014, 2019 [more]
కడప ఎంపీ, యువ నాయకుడు, జగన్‌కు కజిన్ వైఎస్ అవినాష్‌రెడ్డి నియోజకవర్గంలో కనిపించడం లేదనే వ్యాఖ్యలు వస్తున్నాయి. వరుస విజయాలు సాధించిన అవినాష్ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కారు. లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన అవినాష్‌రెడ్డి ముందు నుంచి సాఫ్ట్ పాలిటిక్స్ చేస్తారన్న పేరుంది. ఆది నుంచి కూడా సైలెంట్ గా ఉండే అవినాష్‌రెడ్డి ఎప్పుడూ ఎక్కడా పెద్దగా మాట్లాడింది లేదు. లోక్‌సభలో విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి లాంటి వాళ్లు ప్రసంగాలతో పార్టీ వాయిస్ వినిపిస్తుంటారు. ఇటు అవినాష్‌రెడ్డి రెండోసారి గెలిచినా… ఉన్నత విద్యావంతుడు.. ఆంగ్ల భాషపై పట్టున్నా ఆయన మౌనంగానే ఉంటూ వస్తున్నారు. అయితే, నియోజకవర్గాన్ని బాగానే పట్టించుకుంటాడనే పేరు అవినాష్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. తన ఎంపీ నియోజకవర్గం పరిధిలోనే సీఎం జగన్ అసెంబ్లీ నియోజకవర్గం పులివెందుల కూడా ఉంది. దీంతో ఇక్కడ కూడా అన్నీ తానే చూసుకుంటున్నారు.
నియోజకవర్గంలో కన్పించకుండానే?
లాక్డౌన్ ప్రారంభం కాగానే.. సీఎం జగన్‌ను కలిసి.. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రెండు కోట్ల రూపాయలు రిలీఫ్ ఫండ్‌కు అవినాష్‌రెడ్డి ఇచ్చారు. తర్వాత ఇంక ఎక్కడా ఆయన కనిపించడం లేదు. ప్రస్తుతం జిల్లాలో కూడా లేరనే టాక్ వినిపిస్తోంది. అయితే, సామాన్య ప్రజలకు అందాల్సినవి అందుతుండడం, దాదాపు జిల్లా వ్యాప్తంగా గెలిచినవారంతా జగన్‌కు అత్యంత సన్నిహితులు కావడం వల్ల ఎక్కడా ఎలాంటి సమస్యా రాకుండా ముందుకు సాగుతున్నారని అంటున్నారు. అయినప్పటికీ.. ఇన్నాళ్ల లాక్డౌన్లో ఎక్కడా అవినాష్ కనిపించలేదని అంటున్నారు స్థానికులు.
మిధున్ రెడ్డి కూడా….
అయితే, జిల్లాలో కీలక సమస్యలుగా ఉన్న రాజోలి, తెలుగు గంగ ఆనకట్టల ద్వారా నీటిని తెచ్చే విషయం లో మాత్రం అవినాష్‌రెడ్డి కృషి బాగా చేశారని అంటున్నారు స్థానిక రైతులు. ఇక తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలను కూడా ఆయన పెద్దగా పట్టించుకోకుండా…. వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుపోతుంటారు. అదేవిధంగా మరో ఎంపీ మిథున్ రెడ్డి కూడా ప్రజల మధ్య ఉండడం లేదు. కానీ, ఆయన పనులు మాత్రం కనిపిస్తున్నాయి. అటు పార్లమెంటులోను, ఇటు జిల్లా పరిధిలోనూ ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నారనే పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలపై పార్లమెంటులో ప్రస్థావించి.. సభ్యులను ఆకట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాల్సి ఉంటుంది.
జగన్ కు చెడ్డపేరు తేకుండా….
ఇక, లాక్డౌన్ సమయంలో తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రెండు కోట్ల రూపాయలు కేటాయించిన మిథున్ రెడ్డి.. రాష్ట్ర అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సమాచారం. మొత్తంగా ఈ ఇద్దరు వైసీపీ ఎంపీలు కూడా పైకి మౌనంగా ఉన్నా.. పనుల్లో మాత్రం కత్తులనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.అటు పార్టీలోనూ జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఈ ఇద్దరు ఎంపీలు వ్యవహరిస్తారు. ఎక్కడా పార్టీకి కానీ, పార్టీ అధినేత జగన్‌కు కానీ బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఈ ఇద్దరూ కూడా సైలెంట్ గా ఉన్నప్పటికీ సక్సెస్ గా దూసుకుపోతున్నారనే చెప్పాలి.