కొత్త ట్రెండ్…రివర్స్ ఎటాక్
మూడు రాజధానుల అంశం కు అనుకూల వ్యతిరేక ఉద్యమాలు ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ అయ్యాయి. అధికారపార్టీ మూడే ముద్దు అంటూ, ఒకటే ముద్దు అదీ [more]
మూడు రాజధానుల అంశం కు అనుకూల వ్యతిరేక ఉద్యమాలు ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ అయ్యాయి. అధికారపార్టీ మూడే ముద్దు అంటూ, ఒకటే ముద్దు అదీ [more]
మూడు రాజధానుల అంశం కు అనుకూల వ్యతిరేక ఉద్యమాలు ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ అయ్యాయి. అధికారపార్టీ మూడే ముద్దు అంటూ, ఒకటే ముద్దు అదీ అమరావతి మాత్రమే అంటూ టిడిపి రూపొందించిన జేఏసీ లు ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాలు మొదలు పెట్టి దాదాపుగా రెండు మాసాలు సమీపిస్తోంది. తమ వాదన జనం నమ్మేలా ఎవరి వ్యూహాలు వారు అనుసరిస్తున్నారు. ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు జెఎసి రౌండ్ టేబుల్ సమావేశాలు వీలైనన్ని కార్యక్రమాలతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే అన్ని ప్రయత్నాలు అమరావతి జెఎసి సాగిస్తూ తన ఉద్యమం కొనసాగిస్తోంది. అలా చూస్తూ ఉరుకుంటే ప్రజలు వారు చెప్పేదే నమ్మే పరిస్థితి వస్తుందని గుర్తించిన అధికారాపార్టీ వైసీపీ వారికి చెక్ పెట్టేందుకు గట్టిగానే నడుం బిగించింది.
సేమ్ టూ సేమ్ …
జగన్ నిర్ణయానికి ప్రజా మద్దత్తు కూడగట్టుకునేందుకు వైసీపీ, టిడిపి అనుసరిస్తున్న వ్యూహాన్నే బయటకు తీసి వాడేస్తుంది. మూడు రాజధానులే ముద్దు అంటూ భారీ ర్యాలీలు ఏపీ లోని అన్ని నియోజకవర్గాల్లో చేపట్టింది. అంతే కాదు మరో అడుగు ముందుకు వేసి అధికారపక్ష అనుకూల జెఎసి లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ సమావేశాలు మొదలు పెట్టేసింది. విపక్ష నేతల ముందు నిరసన కార్యక్రమలు ఆందోళనలతో కొత్త ట్రెండ్ మొదలు పెట్టింది. వాస్తవానికి విపక్షంలో వుండే వారు చేసే పోరాటాలు అన్ని ఇప్పుడు అధికారపక్షమే చేస్తూ ఉండటంతో ఏక రాజధాని మూడు రాజధానులు, అంటేనే గందరగోళం గా పరిస్థితి మారిపోయింది.
దీన్ని ఎలా ఎదుర్కోవాలి …?
అధికార వైసీపీ ఈ తరహా ఎదురుదాడికి దిగడంతో ప్రతివ్యూహంపై ఇప్పుడు విపక్ష జెఎసి సమాలోచనలు చేస్తుంది. ఇదిలా ఉంటే రాజధానుల కోసం అటు అధికారపక్షం చేసే ఆందోళనలు, ఇటు విపక్షాలు జెఎసి గా చేస్తున్న ఉద్యమాలను మాత్రం మెజారిటీ ప్రజలు పట్టించుకోవడమే లేదు. అయితే వీటిపై చర్చిస్తున్నారు తప్ప స్వచ్ఛందంగా ఉద్యమాల్లోకి దూకేందుకు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. జనం అలా ఉంటే పార్టీలు మాత్రం ఎవరి సెంటిమెంట్ వారు రాజేసుందుకు తమ ప్రయత్నాలు మాత్రం విరమించకపోవడం విశేషం.
.