అదే జరిగితే వైసీపీకే నష్టం కదా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అధికారంలో ఉన్న వైసీపీకే తలనొప్పిగా మారింది. రోజురోజుకూ విశాఖస్టీల్ ప్లాంట్ఉద్యమం తీవ్రమవుతోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రయివేటీకరణను ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వంపై [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అధికారంలో ఉన్న వైసీపీకే తలనొప్పిగా మారింది. రోజురోజుకూ విశాఖస్టీల్ ప్లాంట్ఉద్యమం తీవ్రమవుతోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రయివేటీకరణను ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వంపై [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అధికారంలో ఉన్న వైసీపీకే తలనొప్పిగా మారింది. రోజురోజుకూ విశాఖస్టీల్ ప్లాంట్ఉద్యమం తీవ్రమవుతోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రయివేటీకరణను ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచాలని భావిస్తున్నారు. దీంతో ప్రజా ప్రతినిధుల రాజీనామాల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
రోజురోజుకూ వత్తిడి…..
విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ పేరిట నిత్యం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. ఆందోళనలకు దిగుతున్నారు. నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. అయితే ఎంత చేసినా రాజకీయంగా వత్తిడి లేకుంటే ప్రయివేటీకరణను ఆపలేమని భావించి అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతుంది. గంటా శ్రీనివాసరావు బాటలో మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా పయనించాలని వత్తిడి పెంచుతున్నారు.
రాజీనామాల డిమాండ్ తో…..
రాజీనామాలు చేయకుంటే ప్రజాప్రతినిధుల ఇళ్లు ముట్టడిస్తామని ఆందోళన కారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మొండివైఖరికి వెళితే పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఉత్తరాంధ్రలో రాజీనామా చేయాల్సి వస్తే ఎక్కువగా వైసీపీకే ఎక్కువ నష్టం జరిగే అవకాశముంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం ఎంపీ ఒక్కరే టీడీపీ. మిగిలిన చోట్ల అంతా వైసీపీ నుంచి పార్లమెంటు సభ్యులుగా గెలిచారు.
నష్టం అధికార పార్టీకే…..
ఇక ఎమ్మెల్యేలను చూసుకున్నా విజయనగరంలో టీడీపీకి ఎమ్మెల్యేలు లేరు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరే టీడీపీ నుంచి గెలిచారు. విశాఖ నుంచి నలుగురు గెలిచినా వారిలో ఒకరు వైసీపీలో చేరిపోయారు. గంటా శ్రీనివాసరావు మాత్రం తటస్థంగా ఉన్నారు. దీంతో టీడీపీ కూడా రాజీనామాల డిమాండ్ ను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. మూకుమ్మడి రాజీనామాలతోనే ప్రభుత్వంపై వత్తిడి పెంచగలమని భావిస్తున్నారు. అయితే రాజీనామాలు చేయాల్సి వస్తే ఎక్కువ నష్టపోయేది వైసీపీయే. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో వైసీపీ ఆచితూచి వ్యవహరించనుంది.