జగన్ సీరియస్.. వేటు తప్పదా?
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఆ పార్టీ అధినేత జగన్ సీరియస్ గా ఉన్నారు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక ఎంపీ పోయినందువల్ల పార్టీకి వచ్చే నష్టమేమీలేదని, [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఆ పార్టీ అధినేత జగన్ సీరియస్ గా ఉన్నారు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక ఎంపీ పోయినందువల్ల పార్టీకి వచ్చే నష్టమేమీలేదని, [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఆ పార్టీ అధినేత జగన్ సీరియస్ గా ఉన్నారు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక ఎంపీ పోయినందువల్ల పార్టీకి వచ్చే నష్టమేమీలేదని, పార్టీ క్రమశిక్షణ కట్టు తప్పకూడదని జగన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు తొలుత షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆయన వివరణ తీసుకున్న తర్వాత జగన్ సస్పెండ్ వేటు వేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
గత కొంతకాలంగా….
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొంతకాలంగా పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారు. ఆయన వైఖరి చూస్తుంటే భయం భక్తి లేకుండా పోయిందని వైసీపీ నేతలే అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రఘురామకృష్ణంరాజు గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరును వారు జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
పార్టీ లైన్ ను థిక్కరిస్తున్నా….
రఘురామ కృష్ణంరాజు గత కొంతకాలంగా పార్టీ లైన్ ను థిక్కరిస్తున్నారు. ఆయన బీజేపీ నేతలతో ఢిల్లీలో టచ్ లో ఉన్నారన్న సమాచారం కూడా అధిష్టానం వద్ద ఉంది. బీజేపీలోకి వెళ్లేందుకు, వైసీపీ నుంచి సస్పెన్షన్ చేయించుకోవడానికే ఆయన మొగ్గు చూపుతున్నారు. అందుకే పదే పదే పార్టీపై విమర్శలు చేస్తున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఇన్ ఛార్జి మంత్రి దీనిపై నివేదికను త్వరలో సమర్పించనున్నారు.
నివేదిక వచ్చిన తర్వాత….
నివేదిక వచ్చిన తర్వాత రఘురామ కృష్ణంరాజుపై చర్యలు ఉంటాయని తెలుస్తోంది. జగన్ కూడా ఫైనల్ డెసిషన్ కు వచ్చారని తెలిసింది. పదే పదే రఘురామకృష్ణంరాజు పార్టీపై కాలు దువ్వుతున్నారని నిర్ణయానికి వచ్చారు. దీంతో తొలుత షోకాజ్ నోటీసులు ఇచ్చి తర్వాత సస్పెన్షన్ దిశగా చర్యలు తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రఘురామ కృష్ణంరాజు విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని కూడా వైసీపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతుండటం విశేషం.