వైసీపీలో రగులుతున్న సీనియర్లు.. రీజనేంటి…?
కీలకమైన రాజకీయ జిల్లా కృష్ణాలో అధికార పార్టీ నేతలు.. చాలా మంది పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా ? అసలు పార్టీలో ఏ ప్రాతిపదికన పదవులు [more]
కీలకమైన రాజకీయ జిల్లా కృష్ణాలో అధికార పార్టీ నేతలు.. చాలా మంది పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా ? అసలు పార్టీలో ఏ ప్రాతిపదికన పదవులు [more]
కీలకమైన రాజకీయ జిల్లా కృష్ణాలో అధికార పార్టీ నేతలు.. చాలా మంది పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా ? అసలు పార్టీలో ఏ ప్రాతిపదికన పదవులు ఇస్తున్నారు ? సీనియర్లకు ప్రాధాన్యం లేదా ? పార్టీని మోసింది మేమైతే.. పదువుల దక్కేది కొందరికా..? అంటూ.. ఆగ్రహంతో ఫైరవుతున్నారు. వీరిలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు. మరో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను.. మరో ఎమ్మెల్యే జోగి రమేష్ వంటివారు కనిపిస్తున్నారు. వీరిలో ఒక్క పార్థసారథి తప్ప.. మిగిలిన ముగ్గురు పార్టీ పెట్టిన కొత్తలోనే అటు ఇటుగా పార్టీలో చేరి.. కొనసాగుతున్నారు.
తొలి నుంచి పార్టీలోనే ఉండి…..
2014 ఎన్నికలకు ముందు పార్థసారథి పార్టీలో చేరారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక, జోగి రమేష్, ఉదయభాను కూడా ఓటమి పాలయ్యారు. కానీ, నూజివీడు మేకా ప్రతాప్ అప్పారావు మాత్రం గెలుపు గుర్రం ఎక్కారు. వీరు పార్టీలోనే ఉన్నారు. పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. జగన్‌ను సీఎం చేయడం కోసం ప్రజల్లోకి వెళ్లారు. అయితే, పార్టీ అధికారంలోకి రావడం, వారు కూడా గెలవడం, జగన్ సీఎం కావడం అన్నీ జరిగిపోయాయి.. కానీ, తమకు మాత్రం ప్రాధాన్యం దక్కకపోవడంపై వీరంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిజానికి వీరిలోనూ పార్థసారథికి టీటీడీ బోర్డులో పదవైనా దక్కింది.
సీనియర్ అయిన తమకు….
కానీ, ఉదయభానుకు, మేకాకు.. ఎలాంటి పదవులూ దక్కలేదు. మేకా ప్రతాప్ వరుసగా వైసీపీ నుంచో రెండోసారి గెలిచారు. ఆయన వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటు. పైగా వైసీపీ నుంచి వెలమ సామాజిక వర్గం కోటాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో ఆయన కేబినెట్ బెర్త్ కోసం చాలా ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలో ఏకంగా కేసీఆర్ కేబినెట్లో ముగ్గురు వెలమలకు మంత్రి పదవులు దక్కాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సైతం ఈ వర్గం నుంచి సుజయ్‌కృష్ణ రంగారావు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు తనకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన నియోజకవర్గం దాటి బయటకు రావడం లేదు.
జూనియర్ లకు ఇవ్వడంతో….
ఇదే సమయంలో గత ఏడాది ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన విజయవాడ నగరానికి చెందిన పశ్చిమ నాయకుడు వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నుంచి చచ్చీచెడీ పాతిక ఓట్లతో గట్టెక్కిన మల్లాది విష్ణులకు మాత్రం మంత్రి పదవి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడంపై వీరంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మాజీ మంత్రి పార్థసారథి అయితే తాను మాజీ మంత్రిని అని.. తన కన్నా జూనియర్ అయిన తన వర్గానికే చెందిన అనిల్‌కుమార్‌కు మంత్రి పదవి ఎలా ఇస్తారని ఓపెన్‌గానే సన్నిహితుల వద్ద చెప్పుకుని ఫైర్ అయిపోతున్నారట.
లోలోన రగిలిపోతూ…..
ఈ నేపథ్యంలో అసలు జగన్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు ? ఏం జరుగుతోంది ? అనే ఆవేదన వీరిలో స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ మరో యేడాదిలో మంత్రి పదవులు ఇస్తానని చెపుతున్నా వీరిలో చాలా మందికి నమ్మకం కుదరడం లేదట. కొన్నేళ్లుగా తాము జెండా మోస్తున్నామని, అయితే, తమను పట్టించుకోవడం మానేసి ఇప్పుడిలా వ్యవహరించడం ఏంటి ? అని ఈ నేతలంతా లోలోన రగిలిపోతుండడం గమనార్హం.