ముగ్గురిపై మూడింటి స్కెచ్
ఏపీలో వైసీపీ కి తిరుగు లేకుండా చేసుకునేందుకు నాలుగు పదుల వయసులో వైఎస్ జగన్ స్కెచ్ గీశారా ? అందులో నలభై ఏళ్ళ అనుభవజ్ఞుడితో బాటు జనసేన [more]
ఏపీలో వైసీపీ కి తిరుగు లేకుండా చేసుకునేందుకు నాలుగు పదుల వయసులో వైఎస్ జగన్ స్కెచ్ గీశారా ? అందులో నలభై ఏళ్ళ అనుభవజ్ఞుడితో బాటు జనసేన [more]
ఏపీలో వైసీపీ కి తిరుగు లేకుండా చేసుకునేందుకు నాలుగు పదుల వయసులో వైఎస్ జగన్ స్కెచ్ గీశారా ? అందులో నలభై ఏళ్ళ అనుభవజ్ఞుడితో బాటు జనసేన అధినేతను, కాకలు తీరిన కమలాన్ని ఇరికించారా అంటే అవునంటున్నారు విశ్లేషకులు. రాజధాని వికేంద్రీకరణ అనే ఒకే ఒక అంశంతో ఈ ముగ్గురికి రాజకీయ చదరంగంలో ముఖ్యమంత్రి ముట్టడించారనే చర్చ గట్టిగానే నడుస్తుంది. ఒకే ఒక్క భారీ ప్రాజెక్ట్ తో తాను తన పార్టీ పూర్తిగా సెటిల్ అయిపోతామని అమరావతిపై చంద్రబాబు కన్న కలలు పటాపంచలు చేస్తూ జనసేన కు భవిష్యత్తులో ఎలాంటి స్కోప్ లేకుండా చేసే ఎత్తుగడ వేసి, కమలానికి వేరేదారి లేని పరిస్థితిని వైసీపీ అధినేత కల్పించారని అంతా జగన్ ఉచ్చులో పడినట్లే అని లెక్కేస్తున్నారు.
టిడిపి కుదేలౌతుందా …?
రాజధాని విభజన జరిగితే టిడిపి కి జరిగే డ్యామేజ్ అందరికన్నా ఎక్కువ అన్నది వైసీపీ అంచనా. ఉత్తరాంధ్రా, రాయలసీమ వెనుకబాటుతనం ఉద్ధారకులం తామే అన్న అజండా ఉంటుందని కూడా వైసీపీ భావిస్తుందంటున్నారు. కేవలం రెండు జిల్లాలకే టిడిపి బలం బలగం పరిమితం కావాలిసి వస్తుందని మిగిలిన చోట్ల ఆ పార్టీకి ఆదరణ మరింత దూరం అవుతుందన్నది వైసీపీ ఆలోచనగా కనిపిస్తుందంటున్నారు. ఇప్పటికే టిడిపి లో మూడు ప్రాంతాల్లో మూడు రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతూ మూడు కళ్ళ సిద్ధాంతం ఏర్పడిందన్న మాట విమర్శలకు గురౌతుంది. రాష్ట్ర విభజన సమయంలో ఇలాంటి క్లిష్టపరిస్థితి ఎదురైనా ఎన్నికలముందు బిజెపి, జనసేన సాయంతో టిడిపి గట్టెక్కిసింది. అయితే ఈసారి ఎవరైనా పొత్తులో కలిసినా కలవకపోయినా కూడా గడ్డుకాలమే ఎదురౌతుందని అంతర్గతంగా తమ్ముళ్లలో కలవరం బయల్దేరిందని కూడా టాక్ వస్తుంది.
ఇంకా అయోమయంలో జనసేన …
అమరావతి ఉద్యమానికి ముందుగా నడుం కట్టిన జనసేన లోనూ జగన్ కొట్టిన త్రీ క్యాపిటల్స్ దెబ్బకు ఇంకా ఎవరు తేరుకోలేదు. పవన్ అన్న చిరంజీవి అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధికి జగన్ నిర్ణయమే సరైనది అనేయడంతో జనసేన పంచ్ లకు ఉద్యమాలకు విలువే లేకుండా పోయిందనే చర్చ సాగుతుంది. అందుకే పవన్ రాజధాని ఉద్యమానికి గ్యాప్ లమీద గ్యాప్ లు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ రాజధానుల జపం చేస్తూ ఉంటే క్షేత్ర స్థాయిలో బలపడేది ఎప్పుడన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది.
కన్ఫ్యూజన్ లోనే కమలం …
రాజధాని అమరావతిలోనే వుండాలని కోర్ కమిటీ తీర్మానం చేయడానికి కమలం నేతలు నానా అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు పార్టీ నిర్ణయం ఇదేనంటూ తీర్మానం ప్రకటించినా కొందరు నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని ప్రయత్నం చేసి విజయం సాధించినా బిజెపికి ప్రయోజనం ఏమాత్రం చేకూరాకపోగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల వ్యతిరేకులుగా ముద్ర వేయించుకుంటామన్న భయం వారిని వెంటాడుతుంది. ఉత్తరాంధ్ర, సీమ ల అభివృధ్ధికోసం హై కోర్టు కర్నూలు లో ఏర్పాటు అంశాలను మ్యానిఫెస్టో లో ప్రకటించి కూడా దానికి బిజెపి కట్టుబడలేదనే అపవాదును ఆ పార్టీ భవిష్యత్తులో మోయక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. ఇవన్నీ జగన్ కే లబ్ది చేకూరుస్తాయన్న ఆందోళన కమలాన్ని వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత ఒకే దెబ్బకు మూడు పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారనే అంతా అంటున్నారు.