వైసీపీ కోణాన్ని చూసిన తరువాత ?
అంతా వారికోసమే ఏర్పాటు అయింది. ఆ కులానికే లబ్ది. ఒక కులం ఆర్ధిక పరిపుష్టికే అమరావతి సృష్టి. అన్నదే ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించిన మాట. ఈ ప్రచారాన్ని [more]
అంతా వారికోసమే ఏర్పాటు అయింది. ఆ కులానికే లబ్ది. ఒక కులం ఆర్ధిక పరిపుష్టికే అమరావతి సృష్టి. అన్నదే ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించిన మాట. ఈ ప్రచారాన్ని [more]
అంతా వారికోసమే ఏర్పాటు అయింది. ఆ కులానికే లబ్ది. ఒక కులం ఆర్ధిక పరిపుష్టికే అమరావతి సృష్టి. అన్నదే ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించిన మాట. ఈ ప్రచారాన్ని పెద్దఎత్తునే చంద్రబాబు ప్రభుత్వం పై నాటి విపక్షాలు గట్టిగా చేశాయి. ఇలా అన్నవారిలో కేవలం గత ప్రధాన విపక్షం వైసీపీ నే కాదు, బిజెపి, కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్ట్ లు లోక్ సత్తా వంటివన్నీ ఇవే చెప్పాయి. ఆ ప్రచారమే నేడు మూడు రాజధానుల ప్రకటన తరువాత ఏపీ లో కృష్ణా, గుంటూరు జిల్లాలతో సహా ఎక్కడా స్పందన లేకపోవడానికి కారణమైంది. అందువల్లే కేవలం రాజధాని ప్రాంతంలోని రైతులు మాత్రమే ఉద్యమం లో పాల్గొవడం కనిపిస్తుంది.
అదే స్లోగన్ మరింతగా ….
ఏపీ లో కొత్త ప్రభుత్వాన్ని వైసీపీ ఏర్పాటు చేశాక ఒకే సామాజిక వర్గం లబ్ది ఇవిగో ఆధారాలు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగించారు. తాజాగా మూడు రాజధానుల ప్రకటనను ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన అనంతరం రేగిన దుమారాన్ని సామాజిక వర్గ అస్త్రాన్ని ఆయుధంగా అధికారపార్టీ పోరాటం కొనసాగిస్తుంది. దీనికి రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల వాసులు నిజమే అనే పరిస్థితి ఏర్పడింది. అదే ఇప్పుడు టిడిపి వాదనను నీరుగారుస్తోంది.
ఉద్యమాన్ని ఉధృతం చేసేపనిలో …
ఈ నేపథ్యంలో అమరావతిలో ఉద్యమాన్ని ముందు వెనుక ఉండి నడిపించే బాధ్యతను తెలుగుదేశం భుజానికి ఎత్తుకోక తప్పలేదు. అందుకే అమరావతి రైతులతో ఒక పక్క ఆందోళన నిర్వహిస్తూనే మరోపక్క అన్ని వర్గాలను ఒక తాటిపైకి తెచ్చేందుకు టిడిపి శ్రేణులు పని మొదలు పెట్టాయి. న్యాయవాదులు, లారీ యజమానులు, హోటల్ యజమానులు, ఇలా పలు సంఘాలను కలిపి ఒకే జేఏసీ ఏర్పాటును తెరవెనుక తెలుగుదేశం చేస్తున్నట్లు వైసీపీ వర్గాలు గుర్తించాయి. ఈ ప్రయత్నాలను ఎలా ఎదుర్కోవాలా అన్నదానిపై ఇప్పుడు అధికారపక్షం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఒకే సామాజిక వర్గం ఆర్ధిక లబ్ది అనే కోణమే అన్నిటికన్నా బ్రహ్మాస్త్రంగా అధికారపార్టీ భావించి అదే అంశాన్ని విపక్షంపై పదేపదే ప్రయోగిస్తోంది. ఈ యుద్ధం మరి ఇప్పటివరకు కొనసాగుతుందో చూడాలి మరి.